train track
-
బైక్‌తో రైలుకు ఎదురెళ్తుండగా..
నిజామాబాద్: కుటుంబ కలహాలు అతన్ని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేశాయి. బైకుతో సహా పట్టాలపై రైలుకు ఎదురెళ్లాడు. కాస్తుంటే అతనిప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కానీ, అతని టైం బాగుంది. రైలు ఆగింది. ప్రాణాలతో బయటపడ్డాడు. నవీపేట మండల కేంద్రంలో రైలును ఢీకొనేందుకు ఒక యువకుడు బైక్‌పై ఎదురెళ్లిన సంఘటన కలకలం రేపింది. భీమ్‌గల్ మండల కేంద్రానికి చెందిన జగదీశ్ (34)కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. దుబాయ్ లో డ్రైవర్‌గా పనిచేసే జగదీశ్ అప్పుడప్పు డు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల కిందట మకాంను నవీపేటకు మార్చాడు. ఈ వ్యవధిలో ఇద్దరి మధ్య కలహాలు పెరిగాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన జగదీశ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సాయినగర్ షిరిడీ–తిరుపతికి వెళ్లే వీక్లీ రైలును ఢీకొనాలని నిర్ణయించుకుని.. మండల కేంద్రంలోని రైలు పట్టాలపై బైక్‌పై ఎదురుగా వెళ్లాడు. ఇది గమనించిన గేట్‌మన్ కొద్ది దూరంలో ఉన్న మరో గేట్మన్కు సమాచారమివ్వగా గేట్ వేయలేదు. ఇది గమనించిన రైల్వే కో పైలట్ చాకచక్యంగా రైలును ఆపేశాడు. దీంతో జగదీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. జగదీశ్‌పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
36 గంటల్లో మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
మహబూబాబాద్, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మతు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకుపోవటంతో వందలాది రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారిమళ్లించి విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావటంతో రేపటి(బుధవారం) నుంచి యాధావిధిగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్తపల్లి– మనోహరాబాద్ లైన్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు రైలొచ్చింది. మిగిలిన రూట్లలోనూ పనులు స్పీడందుకున్నాయి. సిద్దిపేట తర్వాత గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల స్టేషన్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, భవనాలు, గదులు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, విద్యుత్ యార్డు తదితర పనుల కోసం టెండర్లు జారీచేశారు. మొత్తం టెండరు విలువ రూ. 5,30,27,277గా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 25న మధ్యాహ్న 3 గంటలకు టెండరు ముగింపు గడువుగా తెలిపారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని టెండరులో సూచించారు. 21 కి.మీ. దూరంలో పాత కరీంనగర్.. సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో 30 కి.మీ దూరానికి ట్రాక్ వేసేందుకు దాదాపు రూ.440 కోట్ల వ్యయంతో జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే బిడ్డింగులు పిలిచింది. తాజాగా సిరిసిల్ల, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్లలోనూ స్టేషన్ నిర్మాణాలకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవడంతో ఈ మార్గంలో జరుగుతున్న పనుల వేగానికి నిదర్శనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను హైదరాబాద్‌తో కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైను ప్రస్తుతం సిద్ధిపేట వరకు పూర్తయింది. ఇటీవల సిద్ధిపేటను రైలు కూడా పలకరిచింది. సిద్దిపేట తర్వాతి స్టేషన్ గుర్రాలగొంది కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. గుర్రాలగొంది– చిన్నలింగాపూర్ మధ్య దూరం 11 కి.మీ. చిన్నలింగాపూర్–సిరిసిల్ల మధ్య 9.కి.మీ దూరం వస్తుంది. గుర్రాలగొంది సిద్దిపేట జిల్లా కాగా, చిన్నలింగాపూర్ సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఈ లెక్కన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించేందుకు కేవలం 21.కి.మీల దూరంలో ఉంది. 77 కి.మీ. మేర పూర్తయిన మార్గం.. మనోహరాబాద్ –కొత్తపల్లి (కరీంనగర్) వరకు మొత్తం 151.36 కిలో మీటర్లు బ్రాడ్‌గేజ్‌లైన్. ఈ మార్గంలో ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ (77కి.మీ) వరకు లైన్ పూర్తయింది. ఇక్కడి నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సిరిసిల్ల స్టేషన్ (106.88 కి.మీ) వరకు ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. అక్కడ నుంచి కరీంనగర్ వరకు (151.36 కి.మీ) అంటే దాదాపు 44.48 కి.మీ వరకు ట్రాక్ పనులు సాగాలి. ఇవి 2025 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్లలో కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. దక్షిణ మధ్యరైల్వే అడిగిన భూమిని అటవీ భూమిని ఇచ్చేందుకు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ అనుమతించారు. భూసేకరణ విషయంలో రైల్వే అధికారులతో సిరిసిల్ల–కరీంనగర్ కలెక్టర్లు కూడా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మార్గం పూర్తయితే జగిత్యాల, పెద్దపల్లి వాసులకు ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు నేపథ్యం ఇదీ.. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006–07లో 151 కి.మీ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రూ.1,167 కోట్ల అంచనా వ్యయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత ఈ మార్గం ఆర్థికంగా భారమని చెప్పి రైల్వేశాఖ సుముఖత చూపలేదు. మొత్తం బడ్జెట్లో 1/3 వంతు ఖర్చుతోపాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వడం, ఈ మార్గంలో ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఈప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం
షిమ్లా/డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు. వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్‌నగర్‌లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షా దిగ్భ్రాంతి షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్‌సింగ్ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు. కేదార్‌నాథ్‌కు రాకపోకలు బంద్ ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని ప్రైవేట్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్దామ్ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్‌లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్.. క్షణాల్లో తునాతునకలు!
లక్నో: రైలు పట్టాలు దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గేటు వేసినా ఆ ఏమౌతుందిలే అని వెళ్లే ప్రయత్నం చేస్తే.. ప్రాణాల మీదకే వస్తుంది. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో జరిగింది. అయితే.. ఇక్కడ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నా పట్టాలపైకి బైక్‌తో వెళ్లాడు. అయితే.. అవతలి ట్రాక్‌పై ఓ రైలు వెళ్తుండటంతో ఈ వైపు ఉన్న పట్టాలపై వేచి ఉన్నాడు. అప్పుడే మరో రైలు ఆ వ్యక్తి ఉన్న పట్టాలపై దూసుకొస్తోంది. అది గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తిప్పే క్రమంలో పట్టాల మధ్యలో పడిపోయింది. దానిని లాగేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అక్కడే వదిలేసి వెనక్కి పరిగెట్టాడు. క్షణాల వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. బైక్ తునాతునకలైంది. ఆగస్టు 26న జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రైల్వే పోలీసులు బైక్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో కిడ్నాపైన బాలుడు.. బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో ప్రత్యక్షం! -
మొబైల్ సిగ్నల్ ట్రాకింగ్‌తో.. నిండు ప్రాణాన్ని నిలబెట్టారు!
ఒంగోలు: రైలు పట్టాలపై యువకుడు పడుకుని ఉన్నాడు.. దూరంగా రైలు కూత వినిపిస్తోంది.. రైలు మరింత దగ్గరికొచ్చినట్టుగా శబ్దం వినిపిస్తోంది.. యువకుడు మాత్రం అలానే పడుకుని ఉన్నాడు. మరికొద్ది క్షణాలు ఆలస్యమైతే యువకుడి తల తెగిపడేదే. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. పోలీసులు వచ్చి యువకుడిని పక్కకు లాగేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనతో అక్కడి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. జె.పంగులూరు మండలం తూర్పుకొప్పెరపాడుకు చెందిన కలవ కిషోర్‌కు రెండేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగింది. కృత్రిమ కాలుతో జీవనం సాగిస్తున్నాడు. కాలు విరిగినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయి బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. బంధువుల ద్వారా ఆ సమాచారం అందుకున్న జె.పంగులూరు ఎస్ఐ శ్రీనివాసరావు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మలికా గర్గ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ.. ఐటీ కోర్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కిషోర్ మొబైల్ లొకేషన్‌ను గుర్తించారు. వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై కిషోర్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే వేటపాలెం ఎస్ఐ కమలాకర్‌కు ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎస్ఐ.. రైల్వే ట్రాక్‌పై ఉన్న కిషోర్‌ను పక్కకు లాగేశారు. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ట్రాక్ మీదుగా రైలు వెళ్లింది. పోలీసులు వెళ్లడం ఆ రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే కిషోర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బందిని నగదు రివార్డులతో ఎస్పీ సత్కరించారు. -
రైల్వే ట్రాక్‌పై చిరుత మృతదేహం
భువనేశ్వర్: సుందరగడ్ జిల్లా హిమగిర్ సమితి రాంపియా గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చిరుతపులి మృతి చెందింది. స్థానికులు చిరుత మృతదేహాన్ని గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్‌వో సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. హిమగిర్ అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి వచ్చి రైల్వే ట్రాక్ దాటుతుండగా రైతు ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిరుత దాడిలో నలుగురికి గాయాలు రాంపియా గ్రామంలో మంగళవారం రాత్రి ఒక మహిళపై చిరుత దాడి చేసి గాయపరిచింది. ఆమెను కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురిపై చిరుత దాడి చేయడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా హిమగిర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతన్నారు. రాంపియా అటవీ ప్రాంతం నుంచి తరచూ పులులు, ఏనుగులు, కూృరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయని, కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామస్తులపై దాడి చేయడంతో ఆగ్రహించిన ప్రజలు చిరుతను చంపి రైల్వే ట్రాక్‌పై పడేసి ఉంటారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
రాళ్లతో కొట్టి పెట్రోల్‌పోసి..
బన్సీలాల్‌పేట్: బన్సీలాల్‌పేట్‌కు చెందిన యువకుడు అదృశ్యమై చివరకు రైల్వేట్రాక్‌పై శవంగా తేలాడు. అతనిని రాళ్లతో కొట్టి పెట్రోల్‌పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హత్యచేశారు. తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. బన్సీలాల్‌పేట్ ప్రాంతానికి చెందిన జె. క్రిష్ణ(22) ఈనెల 31న అదృశ్యమయ్యాడు. రైల్వేలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఇతను పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన క్రిష్ణ తిరిగి రాకపొవడంతో తల్లి నాగమ్మ ఈ నెల 2న గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ట్రాక్ పక్కన చెట్ల పొదల్లో యువకుడి శవం పడి ఉందనే సమాచారం మేరకు ఈ నెల 3పరాత్రి గాంధీనగర్, మహాంకాళి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్లు ఎస్. శ్రీనివాస్‌రావు, కావేటి శ్రీనివాసులు అక్కడికి చేరుకుని సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. మిస్టరీని చేదించడానికి ప్రత్యేకంగా పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. పథకం ప్రకారమే హత్య? మృతుడు క్రిష్ణకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం ఏరుకొని గంజాయి సేవించే జులాయిలు పలువురితో పరిచయం ఉంది. ఈ బృందమే పథకం ప్రకారం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. క్రిష్ణ స్నేహితుడు శ్రావణ్‌ను నిందితుల్లో కొందరు కలిసి కొట్టి బెదిరించారు. ఈ విషయాన్ని శ్రావణ్ వచ్చి క్రిష్ణతో చెప్పాడు. దాంతో క్రిష్ణ నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరించి ...మీ పని చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో క్రిష్ణపై కక్ష పెంచుకున్న ఐదుగురు పథకం ప్రకారం ఈ నెల 31న క్రిష్ణను రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించుకున్నారు. మద్యం మత్తులో అందరి మధ్య వాగ్వివాదం...ఘర్షణ జరిగినట్లు తెలిసింది. క్రిష్ణను రాళ్లతో కొట్టి అంతమొందించి వెంట తెచ్చుకున్న పెట్రోల్ అతనిపై పొసి నిప్పంటించి పరారైనట్లు తెలుస్తోంది. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఈ హత్య తెలిసిన వారి పే అయి ఉంటుందని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు విలేకరులతో పేర్కొన్నారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్ ట్రైన్
హఫీజ్‌పేట్ : లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళే రైలు (47141) సాయంత్రం 5.20 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. 5 నిమిషాల అనంతరం చందానగర్ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం హఫీజ్‌పేట్ స్టేషన్ వద్ద రైలు చివరి బోగి చక్రం రాడ్ విరిగింది. దీంతో పెద్ద శబ్దంతో ఒక్కసారి పట్టాలు తప్పి బోగి పక్కకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా రైలును నిలిపిపివేశారు. ఆలస్యంగా ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైలు... ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పడంతో లింగంపల్లి నుంచి హైదరాబాద్, ఫలక్‌నూమాకు వెళ్ళే లోకల్ రైళ్ళను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, షిర్డి, గుల్బర్గా, కాకినాడలకు వెళ్ళే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. తాండురు, గుల్బర్గా నుంచి నగరానికి రావల్సిన ప్యాసింజర్ రైళ్ళు రెండు గంటల తరువాత నడిచాయి. లింగంపల్లికి రావాల్సిన అన్ని లోకల్ రైళ్ళు హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ నుంచి తిప్పి పంపారు. -
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. మొబైల్ చూస్తూ..
సెల్‌ఫోన్.. ఇది మనిషికి ప్రస్తుతం ఎంతో అత్యవసరమైన, ఇష్టమైన వస్తువు. చాలా పనులు దీని ద్వారానే చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఇది ప్రాణం మీదకు తెస్తోంది. మొబైల్ చూస్తూ రోడ్డు, రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడిన వారెందరో. జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి మరింత నిర్లక్ష్యంగా ఉంటూ కొందరు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే నెల్లూరులో చోటుచేసుకుంది. నెల్లూరు(క్రైమ్): చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని వీఆర్ లా కళాశాల విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని విజయమహాల్‌గేటు సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలపై సోమవారం చోటుచేసుకుంది. దీంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రైల్వే పోలీసులు, సంఘటనా స్థలంలోని వారి కథనం మేరకు.. సంగం తూర్పువీధిలో ఉపాధ్యాయడు డి.నరసింహారెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు భార్య, కుమారుడు రామ్‌ప్రతాప్‌రెడ్డి (23), కుమార్తె ఉన్నారు. పత్రాప్‌రెడ్డి నెల్లూరు వీఆర్ లా కళాశాలలో లా రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం అతను ఇంటినుంచి బస్సులో నెల్లూరుకు చేరుకున్నాడు. మినీబైపాస్‌లో బస్సు దిగి నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరాడు. విజయమహాల్‌గేట్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలు దాటసాగాడు. చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మొబైల్లో మాట్లాడుతున్నాడో? లేదా సంగీతం వింటున్నాడో తెలియదుకానీ రైలు రావడాన్ని గమనించలేదు. దీంతో అతడిని వేగంగా రైలు ఢీకొంది. ప్రతాప్‌రెడ్డి రెండు కాళ్లు మోకాళ్ల వద్దకు తెగిపోయి వేరుగా పడిపోయాయి. తలకి తీవ్రగాయమైంది. రెండు చేతులు విరిగిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై డీసీ వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులుకు అప్పగించారు. చేతికందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారిపోవడం చూసి బాధిత తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంగంలో విషాదఛాయలు సంగం: రామ్‌ప్రతాప్‌రెడ్డి మృతితో సంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి విష యం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, మండల వైఎస్సార్సీపీ నేతలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రతాప్ సంగంలో ఇంటర్ చదివాడు. -
వివాహితుడు దారుణ హత్య?
చిత్తూరు, మదనపల్లె టౌన్ : ఓ వివాహితుడి∙మృతదేహం కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మృతదేహం పడి ఉన్న తీరు చూస్తుంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కదిరి రైల్వే పోలీసుల కథనం..కురబలకోట మండలం సింగన్నగారిపల్లెకు చెంది న రైతు కృష్ణమూర్తి కుమారుడు కె. ఈశ్వర(35) చిన్న చిన్న వ్యాపారాలు, కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఈశ్వర్ గురువారం ఉదయం మదనపల్లె మండలం, సీటీఎం పంచాయతి అంగళ్లు మార్గంలోని రైలుపట్టాలపై శవమై వెలుగులోకి వచ్చాడు. పశువుల కాపర్లు గుర్తించి సీటీఎం రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కదిరి రైల్వే పోలీసులకు చేరవేశారు. దీంతో రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయి ఉంటే తల, కాళ్లు, చేతులు వేరైనా కనీసం ఎంతో కొంత దూరంలో కనిపించేవని, అయి తే తల, కాళ్లూ, ఒక చేయి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో పక్కాగా ప్లాన్ ప్రకారం ఈశ్వర్‌ను హత్య చేసి, తల, కాళ్లను, చేతిని వేరు చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని రైలుపట్టాలపై పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని అనంతపురం జిల్లాలోని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ సాల్మన్ రాజు తెలి పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదలా ఉంచితే, మృతుడి స్వగ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలోని మృతదేహం వెలుగులోకి రావడం, ఇంటి నుంచి సెల్‌ఫోన్‌తో వెళ్లిన మృతు డి వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో రైల్వే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
సిగ్నల్ పడింది.. పాయింట్ తప్పింది
రాజంపేట : తిరుపతి నుంచి షిర్డి (17417) వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. రైల్వేకోడూరు స్టేషన్లో మంగళవారం సిగ్నల్ పడగానే డ్రైవర్ రైలును కదిలించారు. రైలింజన్ పాయింట్ దాటింది. అయితే వెనుక ఉన్న ఎస్ఎల్ఆర్ (బోగీ) పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఎస్‌అండ్‌టీ జేఈ సస్పెన్షన్ ఇందులో భాగంగా సిగ్నల్ సాంకేతిక వ్యవస్థకు సంబంధించిన ఎస్‌అండ్‌టీ శాఖ జేఈ మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ గుంతకల్ డీఎస్టీఈ బీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈయనతోపాటు పర్మినెంట్ వే డిపార్టుమెంట్‌కు చెందిన అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. గుంతకల్ ఏడీఆర్ఎం సైమన్ ప్రమాదం జరిగిన వెంటనే ఈ మార్గంలో ఇన్స్పెక్షన్కు వచ్చిన సందర్భంగా నేరుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తొలగిన క్లాంపర్... తిరుపతి నుంచి వచ్చిన షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేకోడూరు స్టేషన్లో నాలుగో లైనులో తీసుకున్నారు. సెకండ్ ప్లాట్‌ఫాంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ రైలుకు సిగ్నల్ వేశారు. అయితే రైలు కదిలిన కొద్ది క్షణాల్లోనే కట్‌పాయింట్ దాటుకొని రైలింజన్ వెళ్లింది. ఇదే క్రమంలో క్లాంపర్ సరిగా లేకపోవడంతో రెండోబోగీ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో అప్రమత్తమైన లోకోఫైలెట్ రైలు నిలిపివేశారు. రైలు వేగంగా వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత ఎస్‌అండ్‌టీ విభాగానిదే అని రైల్వే అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంపై విచారణ .. తిరుపతి–షిర్డి రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేయనున్నారు. రైలు ప్రమాదాలకు గల కారణాలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. ఈ ప్రమాదాన్ని రైల్వేశాఖ సీరియస్‌గా తీసుకోనుంది. -
అతడి పైనుంచి 3 రైళ్లు వెళ్లాయి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడివున్నాడు. అతడి పైనుంచి మూడు రైళ్లు కూడా వెళ్లిపోయాయి. అతడు చనిపోయాడనుకుని పోలీసులు వచ్చి చూడగా సదరు వ్యక్తి లేచి కూర్చుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ‘మా నాన్న వస్తాడు’ అంటూ అతడు చెప్పడంతో పోలీసులు గందరగోళానికి గురయ్యారు. అసలేం జరిగింది? రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడివుందని లోకోమోటివ్ పైలట్(రైలు డ్రైవర్) ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికే ఆ మార్గంలో మూడు రైళ్లు వెళ్లడంతో అతడు చనిపోయివుంటాడని భావించారు. తాము అతడిని తరలిచేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చి తన తండ్రి వస్తాడని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు ధర్మేంద్ర అని మద్యం సేవించి అతడు రైలు పట్టాల మధ్యలో నిద్రపోయాడని వెల్లడించారు. అతడి పైనుంచి మూడు రైళ్లు వెళ్లిన విషయం చెప్పగానే మద్యం మత్తు దిగిపోయిందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ధర్మేంద్రను ఇంటికి పంపించారు. -
రైలు పట్టాలపై బైక్ ఆపిన యువకుడు
తిరువొత్తియూరు: రైలు పట్టాలపై బైకును అడ్డంగా నిలిపి మదురై – రామేశ్వరం ప్యాసెంజర్ రైలును మార్గమధ్యలో ఆపిన యువకుడిని మానామదురై పోలీసులు, రైల్వే భద్రతాదళం సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మదురై నుంచి ఆదివారం ఉదయం రామేశ్వరం వెళ్లే ప్యాసెంజర్ రైలు ఉదయం 6.50 గంటలకు బయలుదేరింది. త్రిభువనవనం రైల్వేస్టేషన్‌కు వచ్చి తరువాత తిరిగి ఏడు గంటలకు మానామదురైకి బయలుదేరింది. లాడానేందల్ నాలుగు రోడ్డు కూడలి వంతెన కింద వెళుతుండగా పట్టాలపై బైకును నిలిపి దానిపై ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. ఇది చూసిన డ్రైవర్ రైలును ఆపివేశాడు. ప్రయాణికులు బైక్‌ను పక్కన పెట్టి యువకుడిపై పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో అర్ధగంట ఆలస్యంగా రైలు కదిలింది. పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అప్పటికే ఆ యువకుడు పారిపోయాడు. దీనిపై మానామదురై రైల్వే ఎస్ఐ నాచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో రైలును నిలిపిన యువకుడు మానామదురై యానాది సెంగోటైకి చెందిన కార్మేఘం కుమారుడు షన్ముగవేల్ అని తెలిసింది. మద్యం మత్తులో రైలును ఆపినట్టు తెలిసింది. దీనిపై షణ్ముగవేల్ తండ్రి కార్మేఘం మాట్లాడుతూ.. కొన్ని వారాలకు ముందు అతని స్నేహితుడు బైకులో వెళ్లి ప్రమాదానికి గురై మృతి చెందాడని..దీంతో షణ్ముగవేల్ మానసిక రుగ్మతకు గురై ఇలా ప్రవర్తిస్తున్నట్టు తెలిపారు. -
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
అన్నానగర్: విరుదాచలం సమీపంలో బుధవారం ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. విరుదాచలం సమీపం తొట్టికుప్పం గ్రామంలో విరుదాచలం – సేలం రైల్వే పట్టాలపై బుధవారం 35 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల మహిళ గాయాలతో మృతిచెందారు. పట్టాల పక్కన బైకు, విషం బాటిళ్లు, చెప్పులు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు విరుదాచలం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ చిన్నప్పన్, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతులు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యన్ కుమారుడు రమేష్ (38), పెన్నడం పొన్నేరికి చెందిన తిరుమూర్తి భార్య గాయత్రి (25) అని తెలిసింది. కూలీ అయిన రమేష్‌కి లక్ష్మీ అనే భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గాయత్రికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. తిరుమూర్తి విదేశాల్లో పనిచేస్తున్నాడు. రమేష్, గాయత్రి విరుదాచలంలోని ఓ మిఠాయి దుకాణంలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం ఇరు కుటుంబీకులకు తెలిసి తీవ్రంగా మందలించారు. వారం కిందట రమేష్ గాయత్రి అదృశ్యమయ్యారు. అనంతరం బంధువులు వారి కోసం పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో బుధవారం వీరిఇద్దరూ తొట్టి కుప్పం పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఏం కష్టమొచ్చిందో..?
బిడ్డకు చిన్న రాయి తగిలి గాయమైతేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది రైలు ఢీకొని చిన్నారి శరీరం ఛిద్రమైపోతుంటే ఆ తండ్రి మనసు ఎలా తట్టుకుందో..? ఓ గంట పాటు పిల్లాడు కనిపించకపోతేనే అమ్మానాన్నల ప్రాణాలు విలవిలలాడిపోతాయి. బిడ్డలు శాశ్వతంగా దూరమయ్యారని తెలిసి ఆ తల్లి మనసు ఎంత వేదన అనుభవిస్తోందో. నడక నేర్పిన నాన్నే బిడ్డలను చావు వరకు నడిపించాడు. వేలు పట్టుకుని లోకం చూపించిన తండ్రే చిన్నారులను ఈ లోకానికి శాశ్వతంగా దూరం చేశాడు. జన్మనిచ్చాననే హక్కుతోనేనేమో ఆ బుజ్జాయిల ప్రాణాలు తీసుకున్నాడు. నరసన్నపేటలో ఇద్దరు పిల్లలతో సహా తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చూడడానికి కూడా వీల్లేకుండా మారిపోయిన చిన్నారుల మృతదేహాలు చూసి స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి. శ్రీకాకుళం, నరసన్నపేట: ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లేవు.. ఎవరితోనూ వివాదాలు లేవు. మేమిద్దరం..మాకిద్దరు అంటూ సంతోషంతో.. సాఫీగా గడిచిపోతున్న జీవితం వారిది. భార్య ఆరోగ్యశాఖలో ఉద్యోగి.. భర్త వ్యవసాయం చేస్తూ గ్రామంలో గౌరవంగా బతుకుతున్న కుటుంబం. ఇంతలో ఏం జరిగిందో ఏమో..ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న భర్త తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ముక్కుపచ్చలారని ఇద్దరి పిల్లలతో సహా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతే..క్షణాల్లో ఆ ప్రాంతం రక్తపాతమైంది. ముగ్గురు శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కనీసం గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు ముక్కలై..చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషాద ఘటన నరసన్నపేట మండలం కామేశ్వరిపేట వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇదే మండలం కొల్లవానిపేటకు చెందిన బలగ గురునాథరావు (42), అతని ఇద్దరి కుమారులు రోహిత్‌కుమార్ (4), జ్ఞానసాయి (2) ప్రాణాలు కోల్పోయారు. కామేశ్వరపేట పంచాయతీ పరిధి కొల్లవానిపేట గ్రామానికి చెందిన బలగ గురునాథరావు అతని ఇద్దరి కుమారులతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గురునాథరావు భార్య బలగ రాజు మాకివలస పీహెచ్సీ పరిధి మడపాంలో ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం పిల్లలను షికారుకు తీసుకెళ్తానని భార్య రాజుకు గురునాథరావు చెప్పారు. దీంతో నిజమేనని నమ్మిన ఆమె సరేనంది. దీంతో పిల్లలిద్దర్నీ ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన అరగంటలోనే పలాస–విశాఖ వెళ్లే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడిచనిపోయినట్టు అక్కడకు సమీపంపలో ఉన్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాంబులాంటి సమాచారం విన్న గురునాథం భార్య రాజు అక్కడే కుప్పకూలిపోయింది. తల్లి నూకమ్మ తన కొడుకు ఇక లేడన్న సంగతి తెలుసుకుని గుండెలు అదిరేలారోదిస్తోంది. గ్రామంలో విషాదఛాయలు ఇద్దరి పిల్లలు సహా గురునాథరావు ఆత్మహత్యతో కొల్లవానిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. వివాదరహితుడుగా పేరున్న అతను ఎందుకు ఇంతలా తెగించాడాని స్థానికులు చర్చించుకుంటున్నారు. అభం..శుభం తెలియని పిల్లలు ఏం పాపం చేశారని ..వారికి ఈ శిక్ష విధించాడని మండిపడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ వారితో చర్చించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంఘటనా స్థలాన్నిపరిశీలించిన రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని ఆమదాలవలస జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారావు నేతృత్వంలోని సిబ్బంది రాత్రి 10 గంటల సమయంలో పరిశీలించారు. చెల్లాచెదురుగా పడిఉన్న ఇద్దరు పిల్లలు, గుర్నాథరావు శరీర భాగాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తున్నారు. -
కోవైలో ప్రేమజంట ఆత్మహత్య
సేలం: రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోవైలో చోటుచేసుకుంది. విచారణలో వారు కేరళకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కోయంబత్తూరు ఉక్కడం సమీపంలో ఒక ప్రైవేటు కళాశాల ఉంది. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పొల్లాచ్చి నుంచి కోవైకు ప్యాసింజర్ రైలు వస్తోంది. ఆ సమయంలో ఒక ప్రేమజంట అకస్మాత్తుగా రైలు కింద పడ్డారు. ఈ ఘటన యువతి, యువకుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కోవై రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అక్కడ గాలించగా, రెండు బ్యాగులు పడి ఉన్నాయి. వాటిలో ఆ ప్రేమ జంట ఫొటోలతో కూడిన ఐడీ కార్డులు, ఒక లేఖ కనిపిచింది. ఆ లేఖలో నిన్ను వీడి ఉండలేకున్నాను, జీవించడం ఇష్టం లేదు, నువ్వు రాలేదు, నేను చనిపోతాను అని రాసి ఉంది. ఐడీ కార్డుల ఆధారంగా ప్రేమజంటలో యువకుడు కేరళ రాష్ట్ర మూనాళం, అట్టూరుకు చెందిన అమల్ పి.కుమార్ (19) అని, అతను అదే ప్రాంతంలో ఉన్న కళాశాలలో బి.కామ్ చదువుతున్నట్టుగాను తెలిసింది. అదే విధంగా ఆ యువతి కూడా అదే ప్రాంతానికి చెందిన నాయర్ కుమార్తె సూర్య (19) అని, కేరళలోనే పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన కారణంగా ఆ రైలును అక్కడే నిలిపివేశారు. అదే సమయంలో ఆ రైలు వెనుక పాలక్కాడు నుంచి వస్తున్న రైలును పోత్తనూర్లో నిలిపివేశారు. రైళ్లు రెండు గంటలపాటు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
రైలుకు ఎదురెళ్లి వివాహిత ఆత్మహత్యాయత్నం..
నెల్లూరు , నాయుడుపేటటౌన్: భర్తతోపాటు అత్త వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి చెందిన ఓ వివాహిత తన చంటిపాపతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. ఇద్దరు వ్యక్తులు గుర్తించి పరుగున వెళ్లి వారిద్దరిని కాపాడిన ఘటన పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. పోతమ్మ అనే మహిళకు అగ్రహారపేటకు చెందిన పసల మదన్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి జాషువ అనే కుమారుడు, మధుప్రియ అనే నెలల చంటిపాప ఉన్నారు. మదన్‌కుమార్ కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పోతమ్మను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో రెండురోజుల క్రితం ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై జి.వేణు మదన్‌కుమార్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించి పంపించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అత్త పోతమ్మను పరుష పదజాలంతో దూషించింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మనస్తాపానికి గురైన పోతమ్మ సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి చంటిబిడ్డను తీసుకుని బయటకు వచ్చేసింది. రైలుకి ఎదురెళుతుండగా.. పోతమ్మ బిడ్డతో కలిసి తనువు చాలించేందుకు పట్టణ సమీపంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ రైలుపట్టాల వద్దకు వెళ్లింది. చెన్నై వైపు నుంచి రైలు వస్తుండడంతో దానికి ఎదురుగా చంటిబిడ్డతోపాటు వెళుతుండగా కాలనీకి చెందిన కప్పల మునుస్వామి, నాగరాజులు గుర్తించారు. వారు వెంటనే వెళ్లి రైలుపట్టాల మధ్యలో ఉన్న ఆమెను పక్కకు లాగారు. కాలనీ మహిళలు ఆమెకు అక్కున చేర్చుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వెళితే అత్తమామలు తిరిగి వేధిస్తారని, తనను వదిలిపెట్టాలని పోతమ్మ చెప్పడంతో మహిళలు ఆమెకు ధైర్యం చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాహితను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై వేణు మదన్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించినా రాత్రి వరకు కూడా రాలేదు. దీంతో ఆమెను మూలపడవలోని తల్లిదండ్రుల వద్దకు పంపారు. బాధితురాలికి న్యాయం చేసేలా చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. తల్లీబిడ్డను కాపాడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు అభినందించారు. -
ఏ కష్టమొచ్చిందో..!
శ్రీకాకుళం ,కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కాశీబుగ్గ ఎల్సీ గేటు ఫ్లై ఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడి తల.. మొండెం నుంచి వేరుపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బొగాబంద గ్రామానికి చెందిన బొంసుగంటి దండాసి, వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నరసింహారావు(23) విదేశాలలో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నెల రోజుల కిందటే స్వగ్రామం వచ్చాడు. రెండో కుమారుడు రాంబాబు కాశీబుగ్గ ఐటీఐలో చదువుతుండగా, చిన్నకుమారుడు చైతన్య గొప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి కిరణా షాపు నిర్వహిస్తున్నారు. విశాఖ వెళ్తానని చెప్పి.. నరసింహారావు బుధవారం ఉదయాన్నే రెండు రొట్టెలు తిని తండ్రి వద్దకు వెళ్లాడు. విశాఖపట్నం వెళ్తానంటూ రూ.2 వేలు తీసుకుని పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మధ్యాహ్నం 2.45 గంటలకు పలాస నుంచి విశాఖపట్నం వెళ్తున్న వాస్కోడిగామా రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మొండెం నుంచి తల వేరుపడింది. కాళ్లు పక్క ట్రాకుపైకి వెళ్లడం, అదే లైనులో గూడ్స్ రైలు రావడంతో స్థానికులు కేకలు పెట్టారు. వెంటనే జీఆర్పీ పోలీసులు వచ్చి రైలును నిలిపివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి.. కుమారుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న దండాసి, కుటుంబ సభ్యులు హుటాహుటిన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలుపట్టాలపై విగతజీవిగా పడి ఉన్న నరసింహారావును చూసి బోరున విలపించారు. ఎవరి మీదో కోపం పెట్టుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చావా.. అంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
అదృష్టం
ఉత్తరప్రదేశ్‌లోని మథుర స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో పొరపాటున తల్లి ఒడిలోంచి జారి ట్రాక్‌కు, రైల్వే ప్లాట్‌ఫామ్‌కు మధ్యనున్న చిన్నపాటి గ్యాప్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు దక్కించుకున్న దృశ్యమిది. -
మృత్యువు అంచుల దాకా వెళ్లి..
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఏ కష్టం వచ్చిందో గానీ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రైలు పట్టాలపై పడుకున్నాడు. సరిగ్గా రైలు వచ్చిన సమయంలో భయం వేయడంతో మధ్యలో లేచే ప్రయత్నం చేశాడు. రైలు కిందిభాగం తగలగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పలాస రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సోంపేట మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన సింహాచలం పాత్రో(62) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం పలాస రైల్వేష్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ రైల్వే ఎల్సీ గేటు వద్ద పట్టాలపై పడుకున్నాడు. టాటా ఎక్స్‌ప్రెస్ రైలు పలాస చేరుకుంటున్న తరుణంలో భయంతో లేచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో రైలుకింద భాగం తగలగడంతో చేతులు, కాళ్లకకు తీవ్రంగా దెబ్బలు తగలయ్యాయి. వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్న సమయంలో కొందరు ప్రయాణికులు చూసి వెంటనే చెయిన్ లాగడంతో రైలు ఆగింది. కొందరు ప్రయాణికులు, గ్యాంగ్మెన్లు వెళ్లి క్షతగాత్రుడిని అతికష్టమ్మీద రైలు కింద నుంచి బయటకు తీశారు. గంటపాటు నరకయాతన.. తీవ్రంగా గాయపడిన సింహాచలం సుమారు గంటంపావు సేపు నరకయాతన అనుభవించారు. స్థానికులు 108కు ఫోన్ చేయగా అందుబాటులో లేదని సమాచారం రావడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. చాలాసేపటి తర్వాత మందస 108 అంబులెన్సు వచ్చి క్షతగాత్రుడిని పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నూకలు ఉన్నాయి కాబట్టే !
కర్ణాటక ,యశవంతపుర : అదృష్టం ఇంటే ఇదే మరి, ఓ చిన్న కుక్కపిల్ల గురువారం రైలు పట్టాలపై నిలబడింది. ఇంతలోనే వాయు వేగంతో భారీ శబ్ధంతో ఓ రైలు వేగంగా వచ్చింది. అయినా కూడా కుక్క పిల్ల కదలకుండా రైలు పట్టాల మధ్య అలాగే ఒదిగిపోయింది. కొన్ని సెకెన్ల తరువాత మెల్లగా లేచి కుంటుకుంటు వెళ్లిపోయింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీశారు. చనిపోతుందనుకున్న శునకం అనూహ్యంగా ప్రాణాలతో బయటపడటంతో భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అంటూ చమత్కరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
రైతు చొరవ తప్పిన పెనుముప్పు
చిత్తూరు, రేణిగుంట: కళ్లెదుటే ఏంజరిగినా స్పందించని చాలా మందికి మల్లికార్జున్, అంకయ్యలు కచ్చితంగా స్ఫూర్తినిస్తారు. వారు తీసుకున్న చొరవ వందలాది మంది ప్రాణాలను కాపాడింది. రైలుకు పట్టాలు తప్పే ప్రమాదం తప్పించారు. రేణిగుంట మండలంలోని వెదుళ్లచెరువుకు చెందిన చెంగయ్య కుమారుడు మల్లికార్జున్ సాదాసీదా సన్నకారు రైతు. వెదుళ్లచెరువుకు చెందిన ఇతను సోమవారం తెల్లవారుజామున పొలంలో నాట్ల కోసం కూలీలను పిలిచేందుకు ఎస్టీ కాలనీ వైపు వెళుతున్నాడు. రైలు పట్టాలను దాటే సమయంలో ఎడమ వైపునున్న ఓ పట్టా రెండుగా విరిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అక్కడి కాలనీకి చెందిన అంకయ్యకు వెంటనే చెప్పాడు. అదే సమయంలో తిరుపతి నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ కూతపెడుతూ వస్తోంది. రైలును ఎలాగైనా ఆపి ప్రమాదాన్ని తప్పించాలని వారిద్దరూ భావించారు. అంకయ్య వెంటనే తన ఎర్రటి టీషర్టును విప్పి చేతితో ఊపుతూ మల్లికార్జున్ తో కలిసి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టారు. డ్రైవర్ విరిగిన పట్టాలకు కొద్ది దూరంలో రైలును ఆపేశాడు. తర్వాత సిబ్బంది అర్ధగంట పాటు శ్రమించి తాత్కాలిక మరమ్మతులను చేసి రైలును సురక్షితంగా అక్కడి నుంచి పంపారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని వారిద్దరినీ ఎంతగానో కొనియాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వారికి రైల్వే ఉన్నతాధికారులు సేవా పురస్కారాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: మున్సిపాలిటి పరిధిలోని బెల్లుపడ గ్రామం పెద్దకొండవీధికి చెందిన నీలాపు నిర్మల(29) అనే వివాహిత శుక్రవారం వేకువజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వేపోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టోల్ ప్లాజాలో పనిచేస్తున్న నీలాపు పురుషోత్తంతో బెల్లుపడ పెద్ద కొండవీధికి చెందిన నిర్మలకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు దిలీప్, ప్రేమ్, కుమార్తె నిహారిక ఉన్నారు. తనతో ఫోన్లో మాట్లాడాలంటూ నిర్మలను అదే గ్రామానికి చెందిన బి.గంగాధర్ అనే యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నాడు. గురువారం సాయంత్రం కూడా ఫోన్లో మాట్లాడి వేధింపులకు గురిచేయడాన్ని భర్త గమనించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యాడు. ఇప్పుడే వద్దని, శుక్రవారం ఇద్దరం కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామని చెప్పిన నిర్మల కొద్దిసేపటి తర్వాత అదే గ్రామంలో ఉన్న కన్నవారింటికి వెళ్లింది. రాత్రికి అక్కడే నిద్రపోయి శుక్రవారం వేకువజామున లేచి స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకుని బరంపురం వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్మల భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ కె.రవికుమార్ తెలిపారు. కాగా, నిర్మల మృతితో బెల్లుపడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చేతిపైనే చివరి లేఖ..
బొబ్బిలి/ సాలూరు రూరల్: దేవుడిచ్చిన వందేళ్ల జీవితాన్ని అవగాహనా లోపంతో నాశనం చేసుకుంటున్నారు యువత. చిన్న చిన్న కారణాలు, అంతుబట్టని ఆలోచనలతో క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సాలూరు మండలం కోదుకరకవలసకు చెందిన ధనుంజయ్ (25) అనే యువకుడు రైలు ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. అక్కడి రైల్వే ట్రాక్‌పై శరీరం రెండు ముక్కలుగా ఉండటాన్ని చూసిన స్థానికులు, ట్రైన్ డ్రైవర్ (లోకోపైలట్) పోలీసు సిబ్బందికి సమాచారమందించారు. ధనుంజయ్ తన చేతిమీద, ఒక చీటీపై ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ‘సారీ అమ్మా..! నేను చనిపోతున్నా! ప్రస్తుతం బొబ్బిలి రైల్వే ట్రాక్‌పై ఉన్నా.. కాసేపట్లో తనువు చాలిస్తున్నా..! నాకు అందంగా ఉండాలని ఉంది. కానీ ఆ దేవుడు నన్ను అందంగా పుట్టించలేదు. అందువల్ల నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. నేను ఎందుకు చనిపోతున్నానో పర్సులో రాసి పెట్టాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా కుటుంబ సభ్యులు చాలా మంచివారు. మృతదేహాన్ని నా కుటుంబ సభ్యులకు అప్పగించండని రాసి ఉంది. అలాగే మృతుడు తన అరచేతిపైకూడా తాను ఎందుకు చనిపోతుందీ రాసుకున్నాడు. కూలి పనులతో పెంచింది.. ధనుంజయ్ తండ్రి కృష్ణ చనిపోవడంతో తల్లి గౌరమ్మ కూలిపనులు చేస్తూ కుమారుడ్ని పెంచి ంది. ధనుం జయ్ ఇంట ర్మీడియట్ (వొకేషనల్)ను 2011లో పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో రాజ మండ్రి, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లి వివిధ కారణాల వల్ల వెనక్కి వచ్చేశాడు. ఈ క్రమంలో తాను అందంగా లేడనే ఆత్మన్యూనతా భావానికి గురయ్యాడు. పైగా తల్లి కష్టపడి పనిచేసి పెంచుతోందని, తాను కుటు ంబానికి భారమయ్యానని తరచూ బాధపడేవాడు. తాను చనిపోతానని గ్రామస్తుల వద్ద తరచూ అనేవాడు. అనుకున్నట్లుగానే శుక్రవారం రాత్రి బొబ్బిలిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదని తల్లి గౌరమ్మ కన్నీటిపర్యంతమైంది.