భోపాల్: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడివున్నాడు. అతడి పైనుంచి మూడు రైళ్లు కూడా వెళ్లిపోయాయి. అతడు చనిపోయాడనుకుని పోలీసులు వచ్చి చూడగా సదరు వ్యక్తి లేచి కూర్చుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ‘మా నాన్న వస్తాడు’ అంటూ అతడు చెప్పడంతో పోలీసులు గందరగోళానికి గురయ్యారు.
అసలేం జరిగింది?
రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడివుందని లోకోమోటివ్ పైలట్(రైలు డ్రైవర్) ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికే ఆ మార్గంలో మూడు రైళ్లు వెళ్లడంతో అతడు చనిపోయివుంటాడని భావించారు. తాము అతడిని తరలిచేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చి తన తండ్రి వస్తాడని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు ధర్మేంద్ర అని మద్యం సేవించి అతడు రైలు పట్టాల మధ్యలో నిద్రపోయాడని వెల్లడించారు. అతడి పైనుంచి మూడు రైళ్లు వెళ్లిన విషయం చెప్పగానే మద్యం మత్తు దిగిపోయిందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ధర్మేంద్రను ఇంటికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment