Ashok Nagar
-
ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. వ్యాపారి మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ ఏరియాతో శనివారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి.. వ్యాపారి సునీల్ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.ఇక, స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ జైన్‌ను కృష్ణా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని రాణిభాగ్‌లో భామ్‌భీనా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. #WATCH | Delhi | A person, Sunil Jain was found with gunshot injuries in the Farsh Bazar PS area. He was reported to have been shot by two persons who came on a motorcycle. The Crime Team has been called to the spot. Further investigation is in progress: DCP Shahdara(Visuals… pic.twitter.com/t2DEV2lkNy— ANI (@ANI) December 7, 2024 -
టాప్ పోస్ట్.. సిటీ హోస్ట్!
సివిల్ సర్వీసెస్ దేశంలోకెల్లా అత్యంత కఠినమైన పరీక్ష అంటారు. నిజమే మూడంచెలుగా ఉండే ఈ ప్రక్రియ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కో దశ దాటాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ప్రిపరేషన్ కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే చాలా మంది ఇన్స్టిట్యూట్స్లో చేరి కోచింగ్ తీసుకుంటుంటారు. ఒకప్పుడు సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడే నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుని, ప్రిపరేషన్ అయితే కానీ అత్యున్నత ఉద్యోగాన్ని సాధించడం సులువు కాకపోయేది. కానీ కరోనా తర్వాత ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన భాగ్యనగరం సివిల్స్ కోచింగ్‌కు హబ్‌గా మారిపోయింది. దీంతో ప్రిపేర్ అయ్యే వారు అశోక్‌నగర్‌కు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీతో పోల్చుకుంటే అశోక్‌నగర్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు..? అనుకూల అంశాలేంటి.. నాణ్యతగల కోచింగ్ లభిస్తోందా..? వంటి అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా ఢిల్లీలో వాతావరణం గురించి తెలిసిందే. చలికాలంలో అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన వాయు కాలుష్యంతో బయటకు వెళ్లేందుకు కూడా జంకుతుంటారు. పైగా అక్కడ జీవన వ్యయం కూడా ఇక్కడితో పోల్చుకుంటే రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటుంది. భోజనం కూడా మనకు నచి్చనట్టు ఉండదు. నార్త్ ఇండియన్ వంటకాలు మన శరీర తత్వానికి సరిపడవు. ఆ ఫుడ్‌కు అలవాటు పడేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఏడాది కాలంలో ఢిల్లీలో విద్యుత్ షాక్, వరదలతో సెల్లార్లోకి నీళ్లు రావడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి చాలా మంది తల్లిదండ్రులు అదే కోచింగ్ హైదరాబాద్‌లో తీసుకోవచ్చనే ఆలోచనకు వస్తున్నారు. ఈ కారణాలన్నీ మన హైదరాబాద్‌కు పాజిటివిటీని తీసుకొచ్చాయి అనొచ్చు. ఆన్లైన్ క్లాసులతో.. కరోనా ముందు వరకూ ప్రిపరేషన్ అంటే దాదాపు ఢిల్లీకి వెళ్లాల్సిందే అనే ఆలోచన అభ్యర్థుల్లో ఉండేది. అయితే కరోనా తర్వాత ఆ పరిస్థితులు మారాయి. ఎక్కడి నుంచైనా టాప్ ఇన్స్టిట్యూట్ అనే వాటిల్లో కూడా ఇంట్లో ఉండే కోచింగ్ తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ సమయంలో ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా సంస్థలు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. కరోనా అనంతరం విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కన్నా నేరుగా క్లాసులు వినేందుకు మొగ్గుచూపారు. దీంతో ఆన్లైన్ సంస్థలు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచి్చంది. దీంతో సంస్థలు ఏర్పాటు చేస్తేనే బెటర్ అని చాలా మంది నగరంలో సంస్థలు ఏర్పాటు చేశారు. అశోక్‌నగర్‌కు క్యూ.. ఇదే మంచి అవకాశమని ఇటు అభ్యర్థులు, అటు కోచింగ్ సంస్థల నిర్వాహకులూ భావించి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అభ్యర్థులు భారీగా అశోక్‌నగర్‌కు రావడమే కాకుండా.. కోచింగ్ సంస్థలు కూడా ఈ బూమ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకే కాకుండా కోచింగ్ సంస్థల మధ్య కూడా భారీగా కాంపిటీషన్ పెరిగిందని చెప్పొచ్చు.వరుస నోటిఫికేషన్లతో.. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తుండటంతో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారు కూడా రాష్ట్రస్థాయి పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. దీంతో నగరంలోని చాలా ఇన్స్టిట్యూషన్స్ సివిల్స్ కోచింగ్‌తో పాటు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇవ్వడం, టెస్ట్ సిరీస్‌లను రూపొందించడం వంటివి చేస్తున్నారు. వికేంద్రీకరణ జరుగుతోంది.. సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్లాలనే భావన క్రమంగా తగ్గుతోంది. మెటీరియల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఢిల్లీలోనే దొరికేవి. కానీ ఇప్పుడు అక్కడి సంస్థలకు దీటుగా ఇక్కడ కూడా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. నైపుణ్యం గల టీచర్లు కూడా ఉన్నారు. అక్కడి ప్రతికూల పరిస్థితుల వల్ల చాలా మంది హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. సక్సెస్ శాతం కూడా ఢిల్లీకి సమానంగానే ఉంది. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. – బాల లత, సివిల్స్ మెంటార్అన్నీ ఇక్కడే అందుబాటులో.. టెస్ట్ సిరీస్ రాసేందుకు ఢిల్లీకే వెళ్లేవారు. కానీ క్వాలిటీతో టెస్ట్ సిరీస్‌లను ఇచ్చే సంస్థలు మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షనల్స్‌కు కూడా మంచి మెటీరియల్ లభ్యం కాకపోయేవి. కానీ ఇప్పుడు అన్ని రకాల సోర్స్ మనకు దొరుకుతున్నాయి. సబ్జెక్ట్ పరంగా ప్రత్యేక కోచింగ్ తీసుకునే వెసులుబాటు వచ్చింది. – బొప్పని జగన్మోహన్, సివిల్స్ అభ్యర్థి -
రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
-
హైదరాబాద్ అశోకనగర్ లో మరోసారి ఉద్రిక్తత
-
అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అశోక్ నగర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అభ్యర్థులు మీడియా సమావేశం పెట్టే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు మాట్లాడుతూ.. మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మా బాధలు వినండి సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కొద్దిగా కనికరించండి. జీవో నంబర్ 29ని రద్దు చేయండి.ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు వేరు వేరుగా ఉన్నాయి. ఇలా చరిత్రలో నంబర్లు వేరే వేరేగా ఎప్పుడూ రాలేదు. ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక్కరే రాసినప్పుడు వేరే వేరే హాల్ టికెట్ నంబర్లు ఎలా వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ నగర్లో భారీ సంఖ్యలో బందోబస్తే ఏర్పాటు చేశారు. అలాగే, గాంధీ భవన్ వద్ద ముందస్తుగా భద్రతను పెంచారు. -
గ్రూప్ వన్ ఆందోళనలు.. అశోక్‌నగర్‌లో హై టెన్షన్ (ఫొటోలు)
-
TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
Updatesసచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తతపోలీసులు, గ్రూప్-1 అభ్యర్థుల మధ్య తోపులాటగ్రూప్-1 వాయిదా వేయాలంటూ ఆందోళనజీవో 29 రద్దు చేయాలంటూ డిమాండ్బీజేపీ నేత బండి సంజయ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్గ్రూప్-1 అభ్యర్థులతో సచివాలయానికి వెళ్తుండగా అరెస్ట్సచివాలయం వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్, దాసోజు శ్రవణ్‌లు అరెస్టుబండి సంజయ్‌ను బీజేపీ ఆఫీస్‌కు తరలించిన పోలీసులుసచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరింపుసచివాలయం గేట్లు మూసేసిన పోలీసులుఅంతకుముందు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు చెప్పేందుకే సచివాలయానికి వెళ్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. తక్షణమే జీవో 29ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులను ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
అశోక్ నగర్ లో విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య
-
‘అత్తమామలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. భర్తతో మాట్లాడనీయడం లేదు’
సాక్షి, చిక్కడపల్లి: అత్తమామలు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, భర్తను తనతో మాట్లాడనీయడం లేదంటూ ఓ వివాహిత గురువారం అశోక్‌నగర్‌లోని వారి ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఏలూరుకు చెందిన గౌరి, అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణకు 2019లో వివాహం జరిగింది. గత నాలుగు నెలలుగా భర్తను తనతో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, అత్తమామలు తన సామాన్లు బయటపడేసి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ ఇంటి ముందు నిరసనకు దిగింది. తన భర్తను గచ్చిబౌలిలోని వేరే ఇంటికి పంపించి అత్తమామలు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ గౌరి చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించింది. సీఐ సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ అశోక్‌నగర్‌కు వచ్చి ఆమెను తిరిగి ఇంట్లోకి పంపించారు. అయితే గౌరి కేసు పెట్టడానికి అంగీకరించలేదని లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని చెప్పిందని సీఐ తెలిపారు. చదవండి: కలహాలతో పిల్లలు బలి.. కన్న పేగుతో కాటికి.. -
భర్త, అత్తమామలు వేధింపులు.. చివరికి ఏమైందంటే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో తన భర్త ఇంటి ముందు ఓ మహిళ నిరసనకు దిగింది. తన భర్త, అత్త మామ.. తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అత్తమామలు తన లగేజీ బయట వేసి ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు నిరసన తెలిపింది. ఏలూరుకు చెందిన గౌరీకి..హైదరాబాద్ అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణలకు 2019లో వివాహం జరిగింది. ఆమెను మూడేళ్లుగా అత్తమామలు వేధిస్తున్నారు. తన భర్తను తన నుండి దూరం చేసి వేరే ఇంటికి పంపించారు. నాలుగు నెలలుగా భర్త తన వద్దకు రాకుండా అడ్డుకుని అత్తమామలు వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈరోజు ఉదయం తనను ఇంటి నుంచి బయటికి పంపించి, లగేజీ బయటవేసారని బాధిత మహిళ తెలిపింది. అత్తమామలు తాను ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. భర్త, అత్త, మామ తనను వదులుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆమె వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
పేదల ఆకలి తీరుస్తున్న గంభీర్ 'జాన్ రసోయి'
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్.. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ 'జాన్ రసోయి' పేరిట క్యాంటీన్ ప్రారంభించి ఒక్క రూపాయికే నాణ్యమైన భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో గాంధీనగర్‌లో జాన్ రసోయి క్యాంటీన్‌ను లాంచ్ చేయగా.. తాజాగా మంగళవారం గంభీర్ తన లోక్‌సభ పరిధిలోని అశోక్ నగర్లో రెండో క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆధ్వర్యంలో గంభీర్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. కులం, మతం, లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జన్ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోశాం. గాంధీనగర్‌లో ప్రారంభించిన జన్ రసోయి మొదటి క్యాంటీన్లో రోజుకు వెయ్యి మంది చొప్పున ఆకలి తీరుస్తుంది. కాగా ఇప్పటివరకు 50వేల మందికి పైగా పేద ప్రజలు జన్ రసోయి క్యాంటీన్లో నాణ్యమైన ఆహారాన్ని పొందడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తామంటూ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఈ విషయంలో ఆందోళన నిర్వహించొచ్చు.. పేదల ఆకలి తీర్చే విషయంలో రాజకీయం చేయకూడదనే జాన్ రసోయి క్యాంటీన్లకు శంకుస్థాపన చేశాం.అంటూ తెలిపాడు. కేవలం రూపాయికే భోజనం అందిస్తున్న జాన్ రసోయి క్యాంటీన్లో భోజనంలోకి బియ్యం, కాయధాన్యాలు, కూరగాయలు ఇవ్వనున్నారు. కాగా ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌తోపాటు తన వ్యక్తిగత వనరుల నుంచి నిధులు సమకూరుస్తున్నారు. -
అతడి పైనుంచి 3 రైళ్లు వెళ్లాయి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడివున్నాడు. అతడి పైనుంచి మూడు రైళ్లు కూడా వెళ్లిపోయాయి. అతడు చనిపోయాడనుకుని పోలీసులు వచ్చి చూడగా సదరు వ్యక్తి లేచి కూర్చుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ‘మా నాన్న వస్తాడు’ అంటూ అతడు చెప్పడంతో పోలీసులు గందరగోళానికి గురయ్యారు. అసలేం జరిగింది? రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడివుందని లోకోమోటివ్ పైలట్(రైలు డ్రైవర్) ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికే ఆ మార్గంలో మూడు రైళ్లు వెళ్లడంతో అతడు చనిపోయివుంటాడని భావించారు. తాము అతడిని తరలిచేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చి తన తండ్రి వస్తాడని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు ధర్మేంద్ర అని మద్యం సేవించి అతడు రైలు పట్టాల మధ్యలో నిద్రపోయాడని వెల్లడించారు. అతడి పైనుంచి మూడు రైళ్లు వెళ్లిన విషయం చెప్పగానే మద్యం మత్తు దిగిపోయిందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ధర్మేంద్రను ఇంటికి పంపించారు. -
అశోక్‌నగర్‌లో చోరీ
కడప అర్బన్: కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో చోరీ జరిగింది. బాధితురాలు మేరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. తాను ఎదిరింటిలో ఉన్న తన బంధువు ఇంట్లో గత రాత్రి నిద్రించానని, ఉదయం చూసేలోపు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 వేల నగదు దొంగలు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు. -
పట్టపగలే చోరీ
అనంతపురం సెంట్రల్ : నగరంలోని శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు... అశోకనగర్ రెండో క్రాస్‌లో నాగరాజు, అనిత దంపతులు నివాసముంటున్నారు. నాగరాజు వ్యక్తిగత పని నిమత్తం చెన్నైకు వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అనిత అదేకాలనీలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటి వద్దకు వెళ్లింది. అరగంట తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. దుండగులు బీరువా తలుపులు పగలకొట్టి అందులో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2లక్షలు నగదు చోరీ చేసినట్లు గుర్తించింది. వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ రంగయాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
సమస్యల అశోక్‌నగర్
రోడ్లపై వెళ్తే నడుంనొప్పి ఫ్రీ నిండిపోతున్న చెత్త కుండీలు చోద్యంచూస్తున్న అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : అధ్వానంగా రోడ్లు.. నిండిపోయిన చెత్తకుండీలు..కంపుకొడుతున్న ఖాళీస్థలాలతో అశోక్‌నగర్ సమస్యలకు నిలయంగా మారింది. రోడ్లపై గుంతలుపడి నడిచేందుకు వీలులేకుండా తయారయ్యాయి. ట్రాన్స్‌పోర్టు కంపెనీల అడ్డాలు సైతం ఇక్కడే ఉండడంతో రహదారులు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9వ డివిజన్ అశోక్‌నగర్‌లో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రెయినేజీలు, చెత్తకుండీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నాలుగు డివిజన్ల కూడలి బొమ్మవెంకన్న చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్లుపై గుంతలు పడి నడిచేందుకు ఇబ్బందిగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డు మరింత ఛిద్రమైంది. దీనికి తోడు వివిధ ట్రాన్స్‌పోర్టుల అడాలు కూడా ఇక్కడే ఉండడంతో ప్రతీరోజు భారీ వాహనాలు రోడ్లను మరింత అధ్వానంగా చేస్తున్నాయి. ఇదే ఏరియాలో రెండు పాఠశాలలు, రైతు బజారు ఉండడంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అధ్వాన రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. అశోక్‌నగర్‌లో అంతర్గతరోడ్లన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ప్యాచ్‌వర్క్ కరువాయే గతేడాది అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) పైపులైన్ వేసేందుకు రోడ్లు తవ్వారు. పైపులైన్ వేశాక ప్యాచ్ వర్క్ చేయాల్సిన కాంట్రాక్టర్ అలాగే వదిలేశారు. దీంతో మట్టి రోడ్లు కాస్తా బురదమయమయ్యాయి. రోడ్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. శనివారం అంగడిరోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుబజార్ అక్కడే ఉన్నందున వ్యవసాయశాఖ అధికారులు కూడా పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గుంతలతో నిండిన ఈ రోడ్లపై ఎగుడుదిగుడూ ప్రయాణం చేస్తూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గుంతలరోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. చెత్తపై నిర్లక్ష్యమే నగరంలో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. 9వ డివిజన్లోని ఎన్ఎన్గార్డెన్ సమీపంలో ఉన్న చెత్త కలెక్షన్ పాయింట్ వద్ద ఆరు రోజులుగా చెత్త వేయడం తప్ప, డంప్‌యార్డుకు తరలించిన దాఖలాలు లేవు. దీంతో పందులకు అడ్డాగా మారింది. రోగాలు ప్రబలకముందే చెత్తను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
వివాహితపై దుండగుడి అత్యాచారయత్నం
కృష్ణా: ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని నందిగామ అశోక్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివాహిత బిగ్గరగా కేకేలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అబ్రకదబ్ర
హిప్నో క్వీన్ ఓం హ్రీం... హ్రీం ఓం... అంటే చాలు... మంత్రాలకు వశమైన స్థితిలో మనిషి కొండల్ని పిండి చేసేస్తాడు. కోతిని చూసీ వణికిపోతాడు. మంత్రగాడు కోరితే మహా బలుడైపోతాడు, మంత్రగాడు ఆదేశిస్తే మహా భయస్థుడూ అయిపోతాడు. ఏమిటీ వింత అంటే... అంతా మన మైండ్ చేసే మాయాజాలమే అంటున్నారు తొలి టీనేజ్ హిప్నాటిస్ట్ సరోజారాయ్. ‘‘మంత్ర తంత్రాలేమీ ఉండవు. మనలో ఉన్న అంతర్గత శక్తుల్ని మేల్కొలిపితే ఏమైనా చేయగలం. ‘నేనింతే చేయగలను. ఇంతే ఆలోచించగలను’ అని మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం వల్ల మైండ్ ఆ విధంగా సెట్ అయిపోయి, సాధారణ పనులతోనే సరిపెట్టుకుంటున్నాం. అంత మాత్రాన మనలోని అసాధారణ శక్తియుక్తులు నిర్వీర్యమైపోవు. నిద్రాణంగా ఉంటాయంతే. వాటిని మేల్కొలపడంలో హిప్నాటిజం గొప్ప సాధనం’’ అంటున్న సరోజారాయ్... దీనితో మూఢనమ్మకాలను తొలగించడంతో పాటు వ్యాధుల్ని నయం చేయవచ్చునంటోంది. హిప్నో షోస్ నిర్వహించే తొలి టీనేజి మహిళా హిప్నాటిస్ట్ ఘనత దక్కించుకున్న సరోజారాయ్... ప్రస్తుతం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నివసిస్తోంది. చిన్న వయసులోనే హిప్నాటిస్ట్‌గా ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంది. హిప్నోని ఇంటిపేరుగా మార్చుకున్న తండ్రి కమలాకర్, తల్లి పద్మా కమలాకర్ల బాటలో మహిళలు అరుదుగా మాత్రమే ఎంచుకునే వృత్తిని ఎంచుకున్న సరోజారాయ్ (18) సాక్షి ఫ్యామిలితో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.... సామాజిక అవసరం గుర్తించి... మూడేళ్ల పిన్న వయసులోనే మ్యాజిక్ షోస్ చేసిన అనుభవం ఉంది. పెద్దయ్యాక ఆటోమొబైల్ ఇంజనీర్ని అవుదామనుకున్నాను. అయితే చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ప్రొఫెషన్‌ను గమనించడం, ఆ ప్రొఫెషన్ అవసరం సమాజానికి అంతకంతకూ పెరుగుతోందని గుర్తించడం నన్ను కూడా ఇదే రంగాన్ని ఎంచుకునేందుకు ప్రేరేపించాయి. జనానికి చేరువ చేయాలని... సినిమాల కారణంగా హిప్నాటిస్ట్‌లు అంటే జనంలో ముఖ్యంగా మహిళల్లో ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిపోయింది. కేవలం నాలుగ్గోడల మధ్య ప్రాక్టీస్‌కే పరిమితం కాకుండా ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించి, వారికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలని ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాను. అంతేకాకుండా దొంగ బాబాలు, నకిలీ స్వామిజీలు చేసే చిన్న చిన్న మాయల వలలో పడకుండా జనాన్ని చైతన్యవంతుల్ని చేయడం కూడా ప్రదర్శనలకు మరో కారణం. నాకు మేజిక్‌లో సైతం ప్రవేశం ఉంది కాబట్టి... ఈరెండిటినీ మేళవించి మరింత ప్రభావవంతంగా ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా. ప్రజల్లో శాస్త్రీయ పరమైన అవగాహన పెరిగితే ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయని నా నమ్మకం’’ అంటూ ముగించింది సరోజారాయ్. వందల, వేల మంది ఎదురుగా అపరిచితుడైన ఒక వ్యక్తి మైండ్‌ని మన అధీనంలోకి వచ్చేలా చేసే స్టేజ్ హిప్నాటిజం అతి క్లిష్టమైన ప్రక్రియ. ‘‘ఛాలెంజ్ కాబట్టే ఇది ఎంచుకున్నాను’’అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పే సరోజారాయ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలకు నిధుల సేకరణ నిమిత్తం ప్రదర్శనలు ఇవ్వడంలో ముందుంటోంది. హిప్నోధెరపిస్ట్గా మరెన్నో ఘనవిజయాలు సాధించే లక్ష్యంతో ముందడుగేస్తోంది. - ఎస్.సత్యబాబు -
కారు ఢీకొని 10నెలల బాలుడు మృతి
అశోక్‌నగర్ (హైదరాబాద్) : వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో 10 నెలల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కోడలు స్నేహ ఆదివారం సాయంత్రం నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడు నవదీప్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్‌నగర్‌కు చెందిన నాగమణి కుమారుడు నవదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో స్నేహ చికిత్స చేయించింది. అయితే బాలుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు స్నేహను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
హైదరాబాద్ : ప్రయాణికుల పట్ల ప్రయివేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళుతున్న మేఘన ట్రావెల్స్ బస్సు సాంకేతికలోపంతో అశోక్‌నగర్ వద్ద నిలిచిపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గత అర్థరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. మరో బస్సులో తమను తరలించేలా ట్రావెల్స్ యాజమాన్యానికి తెలియజేయాలని డ్రైవర్, క్లీనర్‌కు ప్రయాణికులు సూచించారు. అందుకు వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కూడా ఇదే ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళ్తు కంచికచర్ల సమీపంలో బ్రేక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. -
నిరుద్యోగుల జాతరలో కోచింగ్‌ల ‘కత్తెర్లు’
-
నిరుద్యోగుల జాతరలో కోచింగ్‌ల ‘కత్తెర్లు’
శిక్షణార్థులను లూటీ చేస్తున్న కోచింగ్ సెంటర్లు సర్కారీ కొలువుల కోసం లక్షల మంది ఎదురుచూపు హైదరాబాద్‌కు చేరి కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు సిలబస్ మార్పులు ఖరారు కాకున్నా పుస్తకాలతో కుస్తీ నోటిఫికేషన్ల జారీపై ఇంకా లేని స్పష్టత సిలబస్‌నే నిర్ణయించని సర్కారు.. నిరుద్యోగుల్లో ఆందోళన శిక్షణ కేంద్రాలపై నియంత్రణ కరువు.. నిబంధనలు బేఖాతర్ ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. అప్పులపాలవుతున్న యువత సాక్షి, హైదరాబాద్: సర్కారీ కొలువుల కోసం నిరుద్యోగులు పట్నం బాట పట్టారు. ఉద్యోగ ప్రకటనలు రాకముందే రాజధానికి చేరుకుని కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కొత్త రాష్ట్రంలో వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారన్న ప్రచారంతో కనీసం నాలుగైదు లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. మరెంతో మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నగరంలోని అశోక్‌నగర్, గాంధీనగర్, దోమల్‌గూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, దిల్సుఖ్నగర్, కొత్తపేట, మలక్‌పేట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నిరుద్యోగులే. అసలు ఉద్యోగమే లేని వారిని పక్కనబెడితే.. ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి కొందరు, ఉద్యోగాలనే వదిలేసి మరికొందరు, కింది స్థాయి ప్రభు త్వ ఉద్యోగాల్లోని వారు కూడా ఉన్నత ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా, పోటీ పరీక్షల సిలబస్ కూ డా ఖరారు చేయకపోయినా శిక్షణ కేంద్రాలకు నిరుద్యోగుల రాక కొనసాగుతూనే ఉంది. దీంతో రాజధానిలో ఏ మూలన చూసినా హాస్టళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగాలు వదిలేసి.. అప్పులు చేస్తూ.. గ్రూపు-1, గ్రూపు-2 వంటి ఉన్నత స్థాయి పోస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను పక్కనబెట్టి మరీ అనేక మంది సిద్ధమవుతున్నారు. కోచింగ్ ఫీజులు, రూమ్ అద్దెలు, భోజనం, వసతి, పుస్తకాల కోసం ఏడాది కాలంలో ఒక్కొక్కరు సగటున రూ.84 వేలకుపైగా వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అప్పులు చేసి మరీ శిక్షణ పొందుతున్నారు. సిలబస్ లేకుండా సన్నద్ధమయ్యేదెలా? మరోవైపు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులను రాష్ర్ట ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, 1948 నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తదితర మార్పులు ఉంటాయని టీఎస్పీఎస్సీ ఇప్పటికే పేర్కొంది. కాని పూర్తిస్థాయి సిలబస్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాక రాత పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు మించి సమయం ఉండదు. అలాంటపుడు సిలబస్ ఏంటో తెలియకుండా పరీక్షకు తామెలా సన్నద్ధం కావాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి సిలబస్‌ను ముందుగా ప్రకటించకున్నా శిక్షణ తీసుకోకుండా వారు ఉండలేకపోతున్నారు. ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లు కోచింగ్ కేంద్రాల్లో కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాత షాపింగ్ మాల్స్, ఫంక్షన్‌హాళ్లు, కాలేజీలు, స్కూళ్ల ఆడిటోరియాల్లోనూ శిక్షణ కేంద్రాల పేరుతో బహిరంగ సభలనుతలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బ్యాచ్‌లో 700 నుంచి వెయ్యి మందికి శిక్షణ ఇస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బదులు తెలంగాణకు సంబంధించిన అంశాలు చదువుకుంటే సరిపోతుందని చెబుతూ శిక్షణ కొనసాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 ప్రకారం ఈ కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఇందుకు సంబంధించిన 1997 నాటి జీవో 200ను పాలకులు పట్టించుకోవడం లేదు. జీవోలో మార్గదర్శకాలు స్పష్టంగా లేవని పక్కన పడేశారు. రాజధానిలో కోచింగ్ కేంద్రాలు అశోక్‌నగర్ పరిసరాల్లో: 80కి పైనే దోమల్‌గూడ పరిసరాల్లో: 20కి పైనే చిక్కడపల్లి పరిసరాల్లో: 25కు పైనే దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ పరిసరాల్లో: 250కి పైనే ఏడాదిగా శిక్షణ పొందుతున్న వారు: లక్ష మందిపైగా శిక్షణ పూర్తయి సిద్ధమవుతున్న వారు: 2లక్షలకు పైనే మూడు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారు: మరో లక్షకుపైగా. గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా.. గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా సిద్ధమవుతున్నాను. ఇప్పు డు పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులంటున్నారు. మరి త్వరగా సిలబస్‌ను ప్రకటిస్తే సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా? నోటిఫికేషన్లోనే సిలబస్‌ను ప్రకటిస్తే కష్టం. ప్రిపేర్ అయ్యేందుకు సమయం par సరిపోదు. - గుమ్మడి అనురాధ, ఇల్లెందు ప్రైవేటు ఉద్యోగం వదులుకున్నా.. గ్రూపు-1 రాసి డీఎస్పీ కావాలన్నది నా లక్ష్యం. 2013లో ఎంటెక్ పూర్తయింది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాను. తెలంగాణ రాష్ట్రం రావడంతో నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో గతేడాది ఉద్యోగం మానేసి కోచింగ్ తీసుకుంటున్నాను. - బి. తిరుపతి, మహబూబ్‌నగర్ ఇప్పటికే రెండున్నర లక్షల అప్పు గ్రూప్-2 కోచింగ్ కోసం వరంగల్ నుంచి వచ్చాను. అశోక్‌నగర్‌లో రూం తీసుకొని చదువుతున్నా. గ్రూపు-2 అధికారి కావాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు అప్పు రెండున్నర లక్షలైంది. - ఎ. సురేష్, గ్రూప్-2 అభ్యర్థి -
బస్సు కిందపడి యువకుడు మృతి
టేకులపల్లి: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు కిందపడి టేకులపల్లికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటనకు సంబంధించి, ఆ యువకుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు: టేకులపల్లిలో నివసిస్తున్న రైతు దంపతులు గుగులోత్ సుక్యా-సుగుణ పెద్ద కుమారుడు సంతోష్ రాజు(25) పీజీ పూర్తి చేశాడు. గ్రూప్స్ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగం సాధించేందుకని మూడు నెలల కిందట హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ మెహిదీపట్నంలో ఓ అద్దె గదిలో ఉంటూ, అశోక్‌నగర్‌లోని రాజిరెడ్డి ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నాడు. రోజులాగానే శనివారం కూడా అశోక్ నగర్ చౌరస్తా వద్ద మెట్రో బస్సు ఎక్కబోతూ, కాలు జారి బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. అతడు తీవ్ర గాయూలతో ఆస్పత్రిలో మృతిచెందాడు. రెండు గంటలపాటు అందని వైద్యం రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సంతోష్ రాజును ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముందుగా డబ్బు కట్టనిదే చికిత్స చేయలేమంటూ అక్కడి వైద్యులు చెప్పారు. రెండు గంటల తరువాత సంతోష్ రాజు బంధువు వచ్చి ఆస్పత్రిలో డబ్బు జమ చేసిన తరువాతనే చికిత్స మొదలైంది. ‘‘ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సకాలంలో వైద్యం అందకపోవడంతోనే సంతోష్ మృతిచెందాడు’’ అని, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం సాయంత్రం టేకులపల్లికి చేరినమృతదేహాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సర్పంచ్ ఇస్లావత్ పార్వతి, వివిధ పార్టీల నాయకులు సందర్శించారు.అతని కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. సంతోష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇలా చేయండి!
‘రిటైరయ్యాక కూడా జీవితం ఉంటుంది ఆ జీవితాన్ని వ్యర్థంగా గడపరాదు... అర్థవంతంగా గడపాలి’ ఇది చదువుల శకుంతలమ్మ చెప్పే సూక్తి. ఈ లెక్కల టీచర్ భాషలో ‘అర్థవంతం’... అంటే పరోపకారం! అప్పుడే ఆమె దగ్గర లెక్క సరిగ్గా కుదురుతుంది. చదువంటే డిగ్రీ కాదు... జీవితాలు బాగుపడడం... ఇది ఆమె చెప్పే మరో సూక్తి. లెక్కల్లో విలువలకు నైతిక విలువలను రంగరించడమే ఆమెకు తెలిసిన లెక్క. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి చదువు చెప్పడం ఆమెకు ఆనందం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్ నుంచి లోపలికి వెళ్తే అశోక్‌నగర్ కల్చరల్ అసోసియేషన్ వారి కమ్యూనిటీ భవనం. ఆ భవనంలోని మధ్య హాలు గ్రంథాలయం. కాలనీలోని పెద్దవాళ్లు పుస్తకాలు చదువుకుంటున్నారు. అదే హాల్లో ఒక పక్కగా, మరో గదిలో ఎనిమిది, తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు ట్యూషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ భవనం గేటు ఎదురుగా కనిపించే ఇల్లే వేమూరి శకుంతలది. ఆమె ఇంట్లో... దాదాపుగా పదిమంది పెద్ద పిల్లలున్నారు. హారిక... వాసవి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఆగస్టులో ఉద్యోగంలో చేరనుంది. రమాలీల... ఈ అమ్మాయి పాలిటెక్నిక్ విద్యార్థి. ఈ-సెట్లో 18వ ర్యాంకు తెచ్చుకుంది. ఆ పక్కనే ఉన్న కిరణ్‌సాయి 128వ ర్యాంకు తెచ్చుకున్నాడు. కౌన్సెలింగ్ మొదలైతే వీరిద్దరూ ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలో చేరుతారు. లీలావతి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో సీటు తెచ్చుకుంది. ‘‘ఈ అమ్మాయికి లెక్కల మీద పట్టు పెద్దగా లేదు. అందుకే తనకు ఇష్టమైన మరో రంగాన్ని సూచించాను’’ అంటూ ఒక్కొక్కరినీ పరిచయం చేశారు 79 ఏళ్ల వేమూరి శకుంతల. ఈ పిల్లలందరూ వాళ్ల కుటుంబాల నుంచి తొలితరం విద్యావంతులే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరి తల్లిదండ్రుల్లో ఎవరూ పిల్లల చదువు కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగిన స్థితిలో లేరు. ఇస్త్రీ బండితో బతుకు వెళ్లదీసేవాళ్లు, ఇళ్లలో పనులు చేసుకునేవాళ్లు, వాచ్‌మ్యాన్, అటెండర్ వంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. ‘‘మేమంతా ఇంత బాగా చదివి, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నామంటే అమ్మ వల్లనే’’ అన్నారు ఈ పిల్లలందరూ ముక్తకంఠంతో. ‘‘మేము కూడా మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తాం’’ అని చిన్న పిల్లలు వంత పలుకుతున్నారు. లెక్కల టీచరమ్మ! నగరంలోని ఉన్నత విద్యావంతులు, సంపన్న వర్గాల పిల్లలు చదువుకునే కాలేజ్‌గా పేరున్న ఫ్రాన్సిస్‌లో మంచి లెక్చరర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శకుంతల, లెక్కల పాఠాలను దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి అందించడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ‘‘మా ఇంట్లో పని చేసే ఆమె ఒకరోజు చాలా బాధపడుతూ... తన రెక్కల కష్టంతో కొడుకుని చదివిస్తున్నానని, కానీ కొడుక్కి లెక్కలు రావడం లేదని, వాడికి లెక్కలు నేర్పించమని అడిగింది. ఫెయిలవుతాడని భయపడిన ఆ కుర్రాడు 72 మార్కులతో పాసయ్యాడు. రిటైరయ్యాక ఇదే వ్యాపకం’’ అన్నారామె చుట్టూ ఉన్న పిల్లలను చూస్తూ. విద్యార్థుల మధ్య వంతెన శకుంతలమ్మ దగ్గర చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న సంపన్న విద్యార్థులు ఆమెకి చేదోడుగా ఉంటున్నారు. ఫీజులు కట్టడానికి ఒక్కో విద్యార్థినీ ఒక్కో సంపన్న పూర్వ విద్యార్థితో అనుసంధానం చేస్తారామె. సమాజంలో దిగువ స్థాయిలో జీవిస్తున్న వారి కోసం రిజర్వేషన్లు పెంచడమే పరిష్కారం కాదంటారామె ‘‘ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించుకోగలిగినంత నాణ్యమైన విద్యనందించాలి. అప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో నిలబడగలిగే శక్తి తెచ్చుకుంటారు. ధైర్యాన్ని సంపాదించుకుంటారు’’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు శకుంతలమ్మ. ఆమె చెబుతున్నట్లే ఆమె దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు రిజర్వేషన్ కోటా కోసం చూడడం లేదు. ఓపెన్‌లో సీటు తెచ్చుకుని చదువుకుంటున్నారు. ‘ఓపెన్‌లో మెరిట్ సీటు తెచ్చుకుంటే నాకదే మీరిచ్చే గురుదక్షిణ’ అని పిల్లలకు లక్ష్యాన్ని స్థిరీకరిస్తున్నారామె. - సాక్షి ప్రతినిధి కొంతైనా చేయాలని... శకుంతల మేడమ్ చేస్తున్న పని నాకు బాగా నచ్చింది. ఆమెలా కాకపోయినా కొంతైనా చేయగలిగితే బావుణ్ణు అనుకునేదానిని. మా పాపకు పెళ్లయిన తర్వాత నేను కూడా ఇందులో భాగస్వామినయ్యాను. పిల్లలకు ట్యూషన్ క్లాసులు, వాళ్ల చేత ఏయే పరీక్షలు ఎప్పుడు రాయించాలి... వంటి పనుల్లో మేడమ్‌కి సహాయంగా ఉంటున్నాను. - శ్రీవల్లి, శకుంతలమ్మకు సహకార భాగస్వామి -
సివిల్స్ కోచింగ్.. కేరాఫ్ అశోక్‌నగర్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు.. 20కి పైగా కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు మార్గం. సమున్నత హోదాతోపాటు సమాజానికి సేవ చేసే అవకాశం. అలాంటి కలల కెరీర్‌ను సొంతం చేసుకోవాలంటే.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలతో వైకుంఠపాళిని పోలిన పరీక్షల్లో సత్తా చాటాల్సిందే. వందల్లో ఖాళీలకు దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ..! దాంతో నాణ్యమైన శిక్షణకూ ప్రాధాన్యత పెరిగింది.అందుకే ప్రతిఏటా సివిల్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు పయనమయ్యే విద్యార్థుల సంఖ్య వేలల్లోనే. సివిల్స్ కోచింగ్ సెంటర్లకు సిటీలోని అశోక్‌నగర్ వేదికగా మారింది. ముఖ్యంగా కొత్త బ్యాచ్ కోచింగ్ ప్రారంభమయ్యే జూన్-జులై నెలల్లో విద్యార్థులతో ఈ ప్రాంతంలో ఒకటే సందడి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సివిల్స్ ఆశావహులకు అడ్డా.. అశోక్‌నగర్!! అశోక్‌నగర్.. అన్ని రకాల పోటీపరీక్షల అభ్యర్థులతో కిక్కిరిసిన ప్రాంతం. కెరీర్ గమనంలో ‘క్రాస్‌రోడ్స్’లో నిలిచిన అభ్యర్థికి దారిచూపే నేస్తం. అక్కడ సివిల్స్ లక్ష్యంగా వేల మంది విద్యార్థులు పుస్తకాలతో అక్షరయజ్ఞం చేస్తుంటారు. ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని సివిల్స్ లక్ష్యంగా శిక్షణ కోసం వచ్చినవారు కొందరైతే.. ఇప్పటికే కోచింగ్ ముగించుకొని సొంతంగా ప్రిపేర్ అవుతున్నవారు మరికొందరు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో ఏదో దశలో వెనుదిరిగిన అభ్యర్థులు మరింత కసిగా చదువుతుంటారు. సుదీర్ఘకాలం సాగే సివిల్స్ ప్రయాణంలో నిరాశా నిస్పృహలు ఆవహించకుండా జాగ్రత్త పడుతుంటారు. గత తప్పిదాలను సరిచేసుకుంటూ ప్రిపరేషన్‌కు పదును పెడుతుంటారు. ‘బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరాను. దగ్గర్లోనే హాస్టల్ చూసుకున్నాను. ఎందుకంటే.. మన ఆలోచనలపై చుట్టూ ఉన్న వారి ప్రభావం ఉంటుంది. ఇక్కడే ఉంటే నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సివిల్స్ 2012, 2013 రెండుసార్లు ప్రిలిమ్స్ గట్టెక్కాను. కానీ మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయా. జనరల్ స్టడీస్‌పై ఇంకొంచెం దృష్టిపెట్టి, తెలుగులో స్కోరు చేస్తే తప్పకుండా విజయం వరించేది’ అని తన అనుభవాలను పంచుకున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన కె.వి.మహేశ్. ఈసారి గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నానని చెప్పాడు. అధ్యాపకులు, సివిల్ సర్వీసెస్‌లో ఎంపికైన వారి సలహాలు తీసుకుని ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగిస్తున్నట్లు వివరించాడు. శిక్షణ- తరగతులు: అశోక్ నగర్లో పేరొందిన కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఆప్షనల్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. ఒక్కో సబ్జెక్టుగా లేదా అన్ని సబ్జెక్టులు కలిపి కోచింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. 8నెలల నుంచి ఏడాది కాలపరిమితితో కోచింగ్ ఇస్తారు. సాధారణంగా జూన్-జూలై నెలల్లో కోచింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. అధ్యాపకులు కూడా శిక్షణ కేంద్రాలతో సంబంధం లేకుండా సబ్జెక్టుల వారీగా విడిగా క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ‘సివిల్ సర్వీసెస్ పరీక్షపై యువతలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. గత మూడేళ్లలో ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సివిల్స్ పరీక్షలపై దృష్టిపెడుతున్నారు. ఈ ఏడాది అటెంప్ట్స్ సంఖ్య పెరగడం, వయోపరిమితి సడలించడం ద్వారా.. సివిల్స్ కోచింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ సంస్థలు కొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఢిల్లీ ఫ్యాకల్టీతోనూ ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నాయి.’ అని వివరించారు అనలాగ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్. ముఖ్యమైన కోచింగ్ కేంద్రాలు: ఆర్సీరెడ్డి స్టడీ సర్కిల్, బ్రెయిన్‌ట్రీ, శ్రీచైతన్య నారాయణ ఐఏఎస్ అకాడెమీ, అనలాగ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడెమీ, హైదరాబాద్ స్టడీ సర్కిల్, లా ఎక్సలెన్స్, క్లాస్1 స్టడీ సర్కిల్, వెంకటేశ్వర్‌రెడ్డి స్టడీ సర్కిల్. ఫీజులు- ఖర్చులు: శిక్షణ కేంద్రాలను బట్టి ఫీజులు మారుతుంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలోని ప్రిలిమ్స్, మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ కోచింగ్‌కు సుమారుగా రూ.70,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టుకు రూ. 20వేలుపైనే ఉంటుంది. సివిల్స్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు దాదాపు రూ.15వేలు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పోల్చితే అశోక్‌నగర్‌లో జీవన వ్యయం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఏసీ, నాన్ఏసీ హాస్టల్స్, నివాస గదులు అందుబాటులో ఉన్నాయి. నాన్ఏసీ గదులకు సుమారు 4 నుంచి 5 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. గత విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హాస్టల్ ఎంపికలో కోచింగ్ సెంటర్లు కూడా సలహాలను అందిస్తాయి. సదుపాయాలు: అశోక్ నగర్లో సివిల్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఇక్కడ బుక్ షాప్లూ, జిరాక్స్ సెంటర్లూ, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, కర్రీపాయింట్లు వెలిశాయి. ప్రముఖ అధ్యాపకులు, కోచింగ్ సంస్థల మెటీరియల్ జిరాక్స్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. సివిల్స్‌తోపాటు గ్రూప్-1, గ్రూప్-2 తదితర అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. విద్యార్థులకు స్టడీ హాల్స్ సౌకర్యాన్ని అందిస్తున్న శిక్షణ సంస్థల సంఖ్య చాలా తక్కువ. దాంతో హాస్టల్స్ లేదా గదుల్లో చదువుకోవడానికి వీలుపడని వారు స్టడీ రూమ్స్‌ను ఆశ్రయిస్తారు. సమయపాలన: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు నిర్దిష్ట టైం టేబుల్ రూపొందించుకుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి సాయంత్రం డిన్నర్ వరకూ.. ప్రతి పనిని పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. సబ్జెక్టుల విషయంలోనూ అంతే కచ్చితంగా వ్యవహరిస్తారు. ‘ఒక్కో సబ్జెక్టుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించి చదువుతున్నాను. ప్రతి సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ప్రిపేరవుతున్నాను’ అని మహేశ్ తెలిపాడు. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తక్కువ ప్రయత్నాల్లోనే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్: సివిల్స్ అభ్యర్థులకు ఉదయాన్నే క్రమం తప్పకుండా పత్రికా పఠనం అలవడుతుంది. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ కొత్త విషయాలను పాతవాటికి అన్వయించి చదవడం ద్వారా విస్తృత విషయ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చని వారి అభిప్రాయం. ‘ప్రతిరోజూ గంటన్నర నుంచి 2 గంటల్లో హిందూ తదితర ప్రధాన పత్రికలను మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ డేగ కళ్లతో పరిశీలిస్తూ, వేగంగా చదువుతాం. పత్రికలను కేవలం పరీక్ష కోణంలోనే చదువుతాం’ అని అంటున్నాడు గుంటూరుకు చెందిన సివిల్స్ అభ్యర్థి సనకా సుభాష్. ‘ఇక్కడికి వచ్చే వారిలో ఎలాంటి ఆడంబరాలు కనిపించవు. పుస్తకాలే ప్రపంచంగా జీవిస్తారు. స్టడీరూంలు, దగ్గర్లోని సెంట్రల్ లైబ్రరీలకు వెళ్లి చదువుకుంటాం. సాయంత్రం సమయాల్లో దగ్గర్లోని పార్కులకు వెళ్లి వాకింగ్ చేస్తుంటాం. ఆ సమయంలోనూ పుస్తకాలు చేతిలో ఉండాల్సిందే’ అని చెప్పాడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాఘవేంద్ర. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, ఫ్యాకల్టీ ఉన్నారు విధాన రూపకల్పనలో భాగస్వామి కావడం ద్వారానే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దగలుగుతామనే ఉద్దేశంతో సివిల్స్ ఎంచుకున్నాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కోచింగ్ తీసుకోవడానికి అశోక్‌నగర్‌కు వస్తుంటారు. ఇక్కడ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, ఫ్యాకల్టీ, మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి ఫ్యాకల్టీ ఢిల్లీకి వెళ్లి కూడా తరగతులు చెప్తారు. కాబట్టి ఢిల్లీ కంటే ఇక్కడే మెరుగైన కోచింగ్ లభిస్తుందని భావిస్తున్నా. - సత్య శిరీష, సివిల్స్ అభ్యర్థిని కాంపిటీటివ్ వాతావరణం ఉంటుంది అశోక్‌నగర్‌లో కాంపిటీటివ్ వాతావరణం బాగుంది. ఇక్కడ శిక్షణ పొందే వారిలో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అశోక్‌నగర్‌లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ కోచింగ్ తీసుకున్నాను. సివిల్స్ అభ్యర్థుల్లో సంకల్పం పెరగాలి. సీరియస్‌నెస్, అంకితభావంతో చదవాలి. సివిల్స్ లేకపోతే గ్రూప్స్ అనే ధోరణి నుంచి బయటపడాలి. తప్పకుండా విజయం సాధిస్తారు. - ఎండీ ముషారఫ్ అలీ ఫరూకి ఆలిండియా 80వ ర్యాంకు, సివిల్స్ - 2013 -
అశోక్ బాబుపై మండిపడ్డ బషీర్
-
అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించండి
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని అశోక్‌నగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటిల్ ఒక ఫ్లెక్సీని తయారు చేసి స్థానిక రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ఈ ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, ప్యాకింగ్‌కు సంబంధించిన చిన్న గోదాముల వల్ల రోడ్లపై నిత్యం వాహనాలు, ట్రక్కులు నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించండి
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని అశోక్‌నగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటిల్ ఒక ఫ్లెక్సీని తయారు చేసి స్థానిక రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ఈ ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, ప్యాకింగ్‌కు సంబంధించిన చిన్న గోదాముల వల్ల రోడ్లపై నిత్యం వాహనాలు, ట్రక్కులు నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.