సాక్షి, హైదరాబాద్: నగరంలోని అశోక్ నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అభ్యర్థులు మీడియా సమావేశం పెట్టే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
వివరాల ప్రకారం.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు మాట్లాడుతూ.. మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మా బాధలు వినండి సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కొద్దిగా కనికరించండి. జీవో నంబర్ 29ని రద్దు చేయండి.
ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు వేరు వేరుగా ఉన్నాయి. ఇలా చరిత్రలో నంబర్లు వేరే వేరేగా ఎప్పుడూ రాలేదు. ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక్కరే రాసినప్పుడు వేరే వేరే హాల్ టికెట్ నంబర్లు ఎలా వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ నగర్‌లో భారీ సంఖ్యలో బందోబస్తే ఏర్పాటు చేశారు. అలాగే, గాంధీ భవన్ వద్ద ముందస్తుగా భద్రతను పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment