group-1 exam
-
గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్ స్పెషల్ విషెస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంరత్ రెడ్డి.. శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాసి.. విజయం సాధించాలని కోరుకున్నారు.సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న…గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు …హాజరవుతున్న అభ్యర్థులకు …నా శుభాకాంక్షలు.ఎటువంటి ఆందోళన చెందకుండా…పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.ఈ పరీక్షల్లో మీరు …విజయం సాధించి…తెలంగాణ పునర్ నిర్మాణంలో…భాగస్వాములు కావాలని…మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న…గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు …హాజరవుతున్న అభ్యర్థులకు …నా శుభాకాంక్షలు.ఎటువంటి ఆందోళన చెందకుండా…పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి. ఈ పరీక్షల్లో మీరు …విజయం సాధించి…తెలంగాణ పునర్ నిర్మాణంలో…భాగస్వాములు కావాలని…మనస్ఫూర్తిగా…— Revanth Reddy (@revanth_anumula) October 21, 2024 -
Telangana: సుప్రీంకోర్టులో గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కోర్టు తెలిపింది. నవంబర్ 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ దశలో పరీక్షల వాయిదాపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ స్టేజ్‌లో రిజర్వేషన్లు పాటించకపోవడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 అభ్యర్థులు జీవో-29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓపెన్ కేటగిరిలో మెరిట్‌తో అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరిగా పరిగణించడం పట్ల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రిజర్వేషన్ అందుకోలేకపోతున్నారు. తక్కువ మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు. అయితే, ఇది గత సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని అభ్యర్థులు పిటిషన్లో తెలిపారు.ఇదిలా ఉండగా.. గ్రూప్–1 కొలువుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు వరుసగా జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి.. మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 563 గ్రూప్–1 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజులు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను లోనికి అనుమతించరు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అశోక్ నగర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అభ్యర్థులు మీడియా సమావేశం పెట్టే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు మాట్లాడుతూ.. మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మా బాధలు వినండి సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కొద్దిగా కనికరించండి. జీవో నంబర్ 29ని రద్దు చేయండి.ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు వేరు వేరుగా ఉన్నాయి. ఇలా చరిత్రలో నంబర్లు వేరే వేరేగా ఎప్పుడూ రాలేదు. ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక్కరే రాసినప్పుడు వేరే వేరే హాల్ టికెట్ నంబర్లు ఎలా వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ నగర్లో భారీ సంఖ్యలో బందోబస్తే ఏర్పాటు చేశారు. అలాగే, గాంధీ భవన్ వద్ద ముందస్తుగా భద్రతను పెంచారు. -
గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు పులుముకున్న రాజకీయ రంగు
-
ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి: రేవంత్‌కు ఈటల సవాల్
సాక్షి, నిజామాబాద్: గ్రూప్-1 విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్లు చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్పీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అనుమతిస్తేనే టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో హైకోర్టు ప్రిలిమ్స్‌ను మాత్రమే రద్దు చేసిందని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందకే వస్తుందన్నారు.రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెయిన్స్‌కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనను ప్రభుత్వం తప్పుబట్టింది. టీఎస్పీఎస్సీకి అన్ని అధికారా లుంటాయని స్పష్టం చేసింది. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 6 శాతం ఎస్టీ రిజర్వేషన్లే అమలు చేయాలి: పిటిషనర్లు గ్రూప్–1కు రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని, తాజా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది జొన్నలగడ్డ సు«దీర్ వాదనలు వినిపించారు. ‘టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు 2022, ఏప్రిల్ 26న తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతమే ఉన్నాయి. ఆ తర్వాత 10 శాతానికి పెంచారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 6 శాతమే అమలు చేయాలి. లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది..’అని చెప్పారు. రీనోటిఫికేషన్‌తో అభ్యర్థులకు లబ్ధి: ప్రభుత్వం ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘టీఎస్పీఎస్సీ చట్టబద్ధమైన సంస్థ. నియామకాలకు సంబంధించి ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం కమిషన్‌కు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 2024 ఫిబ్ర వరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీ నోటిఫికేషన్‌తో ఎవ రికీ నష్టం కలుగలేదు. పైగా 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు..’అని తెలిపారు. అనంతరం సమయం ముగియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1గం. దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఆ అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు రద్దు అయిన ఈ పరీక్షను ఎట్టకేలకు ఇవాళ నిర్వహించారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎంతమంది హాజరయ్యానే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళనజగిత్యాల పట్టణంలో గ్రూప్-1 పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైం ఉన్నా కూడా 5 నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పారని, టైం అయిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని ఆవేదన చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
మూడోసారి గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు చూపిస్తేనే అభ్యర్థులను అనుమతించనుంది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్... గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించే చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాకు అదనపు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారిని నోడల్ అధికారులుగా.. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక వ్యవస్థను కమిషన్ ఏర్పాటు చేసింది. 897 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, లోకల్ రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించారు.ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్వా్కడ్ బృందం ఉంటుంది. ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్వా్క డ్ బృందం ఉంటుంది. ప్రతి వంద మంది అభ్యర్థులకు ఒక చెకింగ్ అధికారిని నియమించారు. గ్రూప్–1 పరీక్షా కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటుతోపాటు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కమిషన్ తెలిపింది.గ్రూప్–1 అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్య ర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. -
తెలంగాణలో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత నేత మధు యాష్కీ స్పందించారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కాగా, మధు యాష్కీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. కేసీఆర్, కేటీఆర్ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకు అయ్యియి. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు.. ఏజ్ రియాక్సేషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థులు తిరిగి పరీక్ష రాయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి? -
పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్: కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారు. మొదటి సారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ రద్దు చేసింది. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారింది. కేసీఆర్ సర్కార్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరీక్షలు నిర్వహించలేదని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని ఘాటు విమర్శలు చేశారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు! -
ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రూప్–1 వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రూప్–1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఆందోళన, ఆగ్ర హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్య క్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమె త్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపా లన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహ రిస్తుందనుకుంటే.. మళ్లీ అదే అస మర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసు కెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయ డం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధి కారంలో ఉండే నైతిక అర్హత లేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి: అరుణ డిమాండ్ టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, చైర్మ న్ ఈ ఘటనకు భాద్యత వహించి తక్షణమే రాజీ నామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. గ్రూప్ –1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందజేయాలన్నారు. కేసీ ఆర్ సర్కార్‌కు మద్యం నోటిఫి కేషన్‌పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్ పై లేదని విమర్శించారు. ప్రభుత్వానికి సిగ్గుండాలి: ఈటల ధ్వజం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టి లాంటిదని, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూ ప్–1 పరీక్షలను రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశా రు. ‘మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫ లమే ఈ దుస్థితి. మీ అన్యాయమైన, దుర్మార్గ మైన పాలనకు విద్యార్థులు, నిరుద్యోగుల చేతిలో మీకు శిక్ష తప్పదు. తెలంగాణ ఏర్పా టైన నాటి నుంచి నిరుద్యోగ, విద్యార్థులకు అడుగడుగునా పరాభవమే ఎదురవుతోంది. ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో తప్పులు, సింగరేణి, ఎంసెట్ పేపర్ల లీకేజీ, విద్యుత్ సంస్థల నియామక పరీక్షలు, పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో మోసం పరాకాష్టకు చేరింది. ఏం జరిగినా మీరు పట్టించుకున్న పాపాన పో లేదు. లక్షలాది మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారన్న ఆలోచన మీకు ఏ కోశానా లేదు. అసలు పరీక్షలు రద్దు కాదు. మీ సర్కారును రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది’ అని ఆ లేఖలో రేవంత్ విమర్శించారు. -
గ్రూప్–1 పరీక్షపై ఎందుకు నిర్లక్ష్యం?: హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్‌టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసింది. ఈ నెల 11న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇప్పుడెందుకు చర్యలు చేపట్టలేదు.. టీఎస్పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది. ఇది కూడా చదవండి: అన్ని కోర్టుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తారేమో! -
టీఎస్పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ ఖరీదు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మం జంట సాయి లౌకిక్, సాయి సుస్మిత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులపాటు విచారించారు. ఆదివారం ఆ గడువు ముగియడంతో సోమవారం వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. సాయి సుస్మిత గ్రూప్–1 పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో జరిగిన పొరపాట్లు సరి చేసుకోవడానికి కమిషన్‌కు వచ్చిన సందర్భంలో ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైంది. డీఏఓ మాస్టర్ క్వశ్చన్ పేపర్ తన వద్ద ఉందని ఫిబ్రవరి మూడో వారంలో ఈమెతో చెప్పిన ప్రవీణ్ రూ.10 లక్షలకు విక్రయిస్తానన్నాడు. ఈ విషయాన్ని సుస్మిత తన భర్త లౌకిక్‌కు చెప్పింది. అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో తమ వద్ద ఉన్న రెండు కార్లలో ‘ఆడి’ కారును తన స్నేహితుడికి విక్రయించిన లౌకిక్ అతడి నుంచి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌కు ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన మొత్తం చెల్లింపునకు గడువు కోరాడు. దీంతో భార్యాభర్తల్ని ఎల్బీనగర్ వద్దకు రమ్మని ప్రవీణ్ చెప్పాడు. ‘ఆ పేపర్ మేం ఎవ్వరికీ ఇవ్వలేదు’ ఫిబ్రవరి 23 రాత్రి ఖమ్మం నుంచి నగరానికి వచ్చిన దంపతులు ఎల్బీనగర్లోని డీ మార్ట్ వద్ద ఉండి ప్రవీణ్‌కు సమాచారం ఇచ్చారు. బడంగ్‌పేట్‌లోని మల్లికార్జున కాలనీలో తన ఇంటి నుంచి అక్కడకు వచ్చిన ప్రవీణ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్లాడు. ఆ రాత్రి అల్కాపురిలోని లాడ్జిలో బస చేసిన ఈ దంపతులు మరుసటి రోజు ఖమ్మంలోని సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు రోజుల ఉండి పరీక్షకు సిద్ధమైన సుస్మిత ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. సిట్ అధికారులు వీరిద్దరినీ తీసుకుని శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేశారు. మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్ స్వాదీనం చేసుకున్నారు. తాము ఆ ప్రశ్నపత్రాలు మరెవరికీ ఇవ్వలేదని ఇరువురూ సిట్ అధికారులకు తెలిపారు. నేను కష్టపడి చదివా.. మీరు అపోహపడుతున్నారు న్యూజిలాండ్ నుంచి సిట్‌కు ఈ– మెయిల్ చేసిన నిందితుడు ప్రశాంత్ గ్రూప్–1 ప్రశ్నా పత్రాన్ని ప్రధాన నిందితులలో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి పంపించాడు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంత్ గ్రూప్–1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి రావడంతో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌రెడ్డికి వందకుపైగా మార్కులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్న పత్రాన్ని పంపించానని రాజశేఖర్ అంగీకరించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సిట్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మెయిల్ పంపించాడు. ‘నేను కష్టపడి చదివానని, నేను ఎవరి వద్ద నుంచి ప్రశ్నా పత్రం తీసుకోలేదు, నాకు మార్కులు ఎక్కువగా రావడంతో మీరు అపోహపడుతున్నారు’ అని ఈ మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ప్రశ్నా పత్రాన్ని న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు రిమోట్‌యాప్ అయిన ఎనీడెస్క్ ద్వారా రాజశేఖర్‌రెడ్డి పంపించిన విషయం విచారణలో వెల్లడైన విషయంతెలిసిందే. -
ఆ ఆరు పరీక్షలపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దయిన, వాయిదా పడిన అర్హత పరీక్షలను మళ్లీ నిర్వహించడంపై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ వార్షిక సంవత్సరంలో 26 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన కమిషన్, ఏడు పరీక్షలను నిర్వహించగా ఇందులో నాలుగు రద్దయ్యాయి. రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేశారు. కాగా ఇప్పటికే గ్రూప్–1 పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించిన కమిషన్.. రెండ్రోజుల క్రితం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. మిగతా నాలుగు పరీక్షలకు అతి త్వరలో తేదీలను ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తేదీల సర్దుబాటు .. ఆ ఆరు పరీక్షలకు కొత్తగా ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీ తదితర ప్రక్రియను తిరిగి చేపట్టాల్సి ఉండగా.. ఈ మేరకు చర్యలను టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. పరీక్షల తేదీలను ఖరారు చేసేందుకు వీలుగా.. వీటి తో పాటు ఇతర పరీక్షల తేదీల సర్దుబాటు చేపట్టింది. ఈ క్రమంలోనే వచ్చేనెల 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టీకల్చర్ ఆఫీసర్ అర్హత పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏఈఈ పరీక్షలను మే నెల 8, 9, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మిగతా నాలుగు పరీక్షలు కూడా మే నెలాఖరులోగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికను తయారు చేస్తోంది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో.. ఒకసారి పరీక్ష రాసిన అభ్యర్థి మళ్లీ అదే పరీక్ష రాయాలంటే కష్టమే. పరీక్షకు తిరిగి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాల్సిందే. అయినా ఆశించిన ఫలితం రాకపోవచ్చనేది అభ్యర్థుల ప్రధాన ఆందోళన. ఈ నేపథ్యంలోనే ఎక్కువ జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. -
గ్రూప్–1.. కటాఫ్ ఉండదు: టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల్లో ఇంకా గందరగోళం వీడలేదు. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 2,86,051 మంది దీనికి హాజరయ్యారు. అభ్యర్థులుగానీ, కోచింగ్ సెంటర్లుగానీ పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు, మేధావులను సంప్రదించి సరైన సమాధానాలపై, తమకు వచ్చే మార్కులపై అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఆదివారం నాటి గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది. ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతు న్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడు గుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. పరీక్ష జరిగి రెండు రోజులు అవుతున్నా కనీసం కోచింగ్ సెంటర్లు కూడా నమూనా ‘కీ’ని విడుదల చేయకపోవడం గమనార్హం. కటాఫ్ మార్కులేమీ ఉండవు! గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రత్యేకంగా కటాఫ్ మార్కులంటూ ఏమీ ఉండవని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. నోటిఫికేషన్లోనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా తెలిపిన కమిషన్.. సోమవారం మరోమారు ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చినవారిని.. మల్టీజోన్ల వారీగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. మొత్తం 503 పోస్టులు ఉన్న నేపథ్యంలో.. ఎక్కువ మార్కులు వచ్చిన సుమారు 25,150 మందికి మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. ప్రశ్నపత్రం కోడింగ్‌లో కొత్త విధానంతో.. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం కోడింగ్‌లో టీఎస్పీఎస్సీ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఇదివరకు కమిషన్ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాన్ని ఏ, బీ, సీ, డీ నాలుగు కోడ్లలో తయారు చేసింది. ఈసారి కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా ఆరు డిజిట్ల కోడ్‌తో ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చింది. విభిన్న రూపాల్లో ప్రశ్నపత్రం తయారైంది. దీనితో ఏ కోడ్‌కు చెందిన ప్రశ్న పత్రానికి నమూనా కీని తయారు చేయాలనే దానిపై కోచింగ్ సెంటర్లు, నిపుణులు సైతం తికమక పడ్డారు. చివరికి ప్రశ్నపత్రం కోడ్‌కు బదులుగా.. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కొన్నింటికి జవాబులను నిర్ధారిస్తూ సామాజిక మాధ్యమాల్లో అంచనాలను పోస్టు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. దీనితో టీఎస్పీఎస్సీ కీ వచ్చేదాకా అంచనాకు వచ్చే పరి స్థితి లేదని అభ్యర్థులు అంటున్నారు. కమిషన్ కీ విడుదల చేసేందుకు పదిరోజుల సమయం పడు తుందని అంచనా వేస్తున్నారు. ముందుగా అభ్య ర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చిన తర్వాతే ‘కీ’ని విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. -
నేడు గ్రూప్–1 పరీక్ష
- హాజరుకానున్న 7,326 మంది అభ్యర్థులు - ఉదయం 10.15 తరువాత అనుమతించరు అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆమె శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అనంతపురంలోని 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. 7,326 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 9.30 నుంచి 10.15 గంటల్లోపు పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. 10.15 తరువాత లోపలికి అనుమతించరు. పరీక్ష నిర్వహణకు 34 మంది సిబ్బందిని నియమించారు. 13 కేంద్రాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. స్పెషలాఫీసర్లుగా ముగ్గురు జిల్లా అధికారులను, లైజన్ అధికారులుగా ఐదుగురు తహసీల్లార్లను, సహాయ లైజన్ అధికారులుగా 13 మంది ఎంపీడీఓలను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ నిబంధనలు, సూచనలను పాటించాల్సి ఉంటుంది.