- హాజరుకానున్న 7,326 మంది అభ్యర్థులు
- ఉదయం 10.15 తరువాత అనుమతించరు
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆమె శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అనంతపురంలోని 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. 7,326 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 9.30 నుంచి 10.15 గంటల్లోపు పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. 10.15 తరువాత లోపలికి అనుమతించరు.
పరీక్ష నిర్వహణకు 34 మంది సిబ్బందిని నియమించారు. 13 కేంద్రాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. స్పెషలాఫీసర్లుగా ముగ్గురు జిల్లా అధికారులను, లైజన్ అధికారులుగా ఐదుగురు తహసీల్లార్లను, సహాయ లైజన్ అధికారులుగా 13 మంది ఎంపీడీఓలను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. అభ్యర్థులు ఏపీపీఎస్‌సీ నిబంధనలు, సూచనలను పాటించాల్సి ఉంటుంది.
నేడు గ్రూప్–1 పరీక్ష
Published Sun, May 7 2017 12:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement