సాక్షి, హైదరాబాద్: గ్రూ ప్–1 పరీక్షలను రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశా రు. ‘మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫ లమే ఈ దుస్థితి.
మీ అన్యాయమైన, దుర్మార్గ మైన పాలనకు విద్యార్థులు, నిరుద్యోగుల చేతిలో మీకు శిక్ష తప్పదు. తెలంగాణ ఏర్పా టైన నాటి నుంచి నిరుద్యోగ, విద్యార్థులకు అడుగడుగునా పరాభవమే ఎదురవుతోంది. ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో తప్పులు, సింగరేణి, ఎంసెట్ పేపర్ల లీకేజీ, విద్యుత్ సంస్థల నియామక పరీక్షలు, పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో మోసం పరాకాష్టకు చేరింది.
ఏం జరిగినా మీరు పట్టించుకున్న పాపాన పో లేదు. లక్షలాది మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారన్న ఆలోచన మీకు ఏ కోశానా లేదు. అసలు పరీక్షలు రద్దు కాదు. మీ సర్కారును రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది’ అని ఆ లేఖలో రేవంత్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment