సాక్షి, హైదరాబాద్: ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని.. పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు
‘‘తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండేది. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. మేము అధికారంలోకి రాగానే వైట్ పేపర్ విడుదల చేశాం. కాంగ్రెస్‌పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు, వివరించలేదు.
మరింత మెరుగైన పాలన అందిస్తాం..
..వానాకాలంలో కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే మేము వచ్చాక రైతు బంధు నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం. నెలనెలా అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రైతు పండగ ఇచ్చిన ఉత్సాహంలో మరింత మెరుగైన పాలన అందిస్తాం. రైతుల మద్దతుతో మరో తొమ్మిదేళ్లు పాలన కొనసాగిస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.
రైతు భరోసాపై కీలక ప్రకటన
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కొనసాగిస్తామని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం. వరికి రూ.500 బోనస్ఇ స్తాం. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశాం. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా ఇస్తాం. మారువేషంలో వచ్చే మారీచులను నమ్మకండి. రైతులు నాణ్యమైన సన్న వడ్లు పండించాలి. తెలంగాణ, సోనా, బీపీటి, హెచ్‌ఎంటీ వరిని పండిస్తే రైతులకు లాభదాయకం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment