
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్‌ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్‌కు కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.