![BRS KTR Serious Comments Over Congress Govt](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/7/KTR.jpg.webp?itok=0fOeRtEc)
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగిందని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
‘రైతే రాజు నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానం
అడగకుండానే రైతుబంధు
అడగకుండానే రైతుబీమా
అడగకుండానే సాగునీళ్లు
అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు
అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు
దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి
బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపి
వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది
కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిది
ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిది
రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి
రైతు బీమాను మాయం చేసి.. 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి.. పంటల కొనుగోళ్లకు పాతరవేసి.. సాగునీళ్లను సాగనంపి
అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారుల పైకి లాగిన
మీరా.. రైతుల గురించి మాట్లాడేది!
రైతుభరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసినా మీరా .. రైతుల గురించి మాట్లాడేది !
ఇల్లిల్లూ తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది
అధికారం దక్కాక ఇల్లిల్లూ తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని, కొనుక్కున్న చరిత్ర మీది
రైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరు
సమయం రాక పోదు మీకు గుణపాఠం చెప్పక పోరు
జాగో తెలంగాణ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment