సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..
‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment