సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఆశావహుల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎనిమిది రోజులు పాటు కొనసాగిన ఈ ప్రక్రియలో అభ్యర్థుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహుల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్‌కు 38 దరఖాస్తులు రాగా, వచ్చిన దరఖాస్తులను రేపటి నుంచి స్క్రూటిని చేయనున్నారు. జానారెడ్డి, రేణుక చౌదరి, నాగం జానార్ధన్‌రెడ్డి, గీతారెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు.
మధిర అసెంబ్లీ స్థానానికి భట్టి విక్రమార్క, సంగారెడ్డి నుంచి జాగ్గారెడ్డి తరఫున భార్య దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు.. కరీంనగర్ నుంచి నుంచి రమ్యారావు, కుమారుడు రితేష్.. ముషీరాబాద్ నుంచి అంజన్‌కుమార్, కొడుకు అనిల్.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సర్వే సత్యనారాయణ.. ఎల్‌బీ నగర్ నుంచి మధుయాష్కీ, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ నుంచి పద్మావతి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: తలవంచేది లేదు.. ఎన్నికల్లో నిలబడతా: తుమ్మల
Comments
Please login to add a commentAdd a comment