ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ | Meghana travels Bus break down in ashok nagar | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్

Published Sun, May 24 2015 9:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

Meghana travels Bus break down in ashok nagar

హైదరాబాద్ : ప్రయాణికుల పట్ల ప్రయివేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో  ప్రయివేట్ ట్రావెల్స్‌ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళుతున్న మేఘన ట్రావెల్స్ బస్సు సాంకేతికలోపంతో అశోక్నగర్ వద్ద  నిలిచిపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గత అర్థరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు.

మరో బస్సులో తమను తరలించేలా ట్రావెల్స్ యాజమాన్యానికి తెలియజేయాలని డ్రైవర్, క్లీనర్కు ప్రయాణికులు సూచించారు. అందుకు వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కూడా ఇదే ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళ్తు కంచికచర్ల సమీపంలో బ్రేక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement