ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. వ్యాపారి మృతి | Delhi Businessman Sunil Jain Shot Dead While On Morning Walk In Farsh Bazar, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. వ్యాపారి మృతి

Dec 7 2024 11:04 AM | Updated on Dec 7 2024 12:47 PM

Delhi Businessman Sunil Jain Shot Dead

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఓ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్‌ బజార్‌ ఏరియాతో శనివారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి.. వ్యాపారి సునీల్‌ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. దుండుగులు ఎనిమిది రౌండ్స్‌ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

ఇక, స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీల్‌ జైన్‌ను కృష్ణా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని రాణిభాగ్‌లో భామ్‌భీనా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాల్పుల ఘటన తీవ్ర​ కలకలం సృష్టిస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement