ఢిల్లీలో ఘోరం.. అమెజాన్‌ మేనేజర్‌ దారుణ హత్య.. | 36-Year-Old Amazon Manager Shot Dead In Delhi Bhajanpura - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఘోరం.. అమెజాన్‌ మేనేజర్‌ దారుణ హత్య..

Published Wed, Aug 30 2023 2:25 PM | Last Updated on Wed, Aug 30 2023 3:02 PM

Amazon Manager 36 Shot Dead By 5 Men in Delhi Bhajanpura - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఉద్యోగిని గుర్తు తెలియని దుండుగులు హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలోని భజన్‌పురలో చోటుచేసుకుంది. మృతుడిని హర్‌ప్రీత్‌ గిల్‌గా గుర్తించారు.

వివరాలు.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్‌ గిల్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామతో కలిసి భజన్‌పురలోని సుభాష్‌ విహార్‌ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది దుండగులు ఇద్దరిపై అడ్డగించి కాల్పులు జరిపారు. అనంతరం స్థానికులు గమనించి వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. గిల్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామకు చికిత్స అందిస్తున్నారు. 

మృతుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయిదుగురు వ్యక్తులు తనపై, తన అల్లుడిపై కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హర్‌ప్రీత్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తూ 10 నిమిషాల్లో తిరిగి వస్తానని తమ తల్లిదండ్రులకు తెలిజయేశారు. దుండగుల కాల్పుల్లో గిల్‌ తలపై కుడి వైపు, బుల్లెట్‌ గాయాలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్టున్నట్లు వెల్లడించారు. 

మృతుడి మేనమామ భజన్‌పురా నివాసి.  అతడికి కూడా తలపై కాల్పులు జరగడంతో లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు డీసీపీ తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో యాక్టివ్‌గా ఉందని, నగరంలో పెద్ద  డాన్ కావాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధాలతో తమ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారని తెలిపారు.
చదవండి: Chandrayaan-3: తొలిసారి విక్రమ్‌ను ఫోటో తీసిన రోవర్‌.. ఇదిగో ఫోటో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement