![Delhi Gym Owner Stabbed To Death Attacked 21 Times On Face](/styles/webp/s3/article_images/2024/07/11/gym.jpg.webp?itok=ChdpkjmE)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. భజన్‌పురా ప్రాంతంలో 28 ఏళ్ల జిమ్ యజమానికి కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్‌గా గుర్తించారు. బుధవారం అర్థరాత్రి గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని అతని ఇంటి వెలుపల ఈ దాడి జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని జేపీసీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
బాధితుడు సుమిత్ జిమ్‌తోపాటు టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారం చేస్తున్నాడని, ఇటీవల హత్యాయత్నం కేసులో దోషిగా తేలి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి చౌదరి తన ఇంటి బయట కూర్చున్నప్పుడు మరో ను ముగ్గురు, నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి గొడవ పడినట్లు పేర్కొన్నారు.
సుమిత్‌పై కత్తితో దాడి చేసి ముఖం, మెడ, ఛాతీ, పొత్తికడుపుపై పలుమార్లు పొడిచారని, ముఖంపై 21కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. చౌదరికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment