
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీGhazipur ల్లో దారుణం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ఘజీపూర్ ప్రాంతంలో బీజేపీ నేత జీతు చౌదరిని ఆయన ఇంటి ముందే దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8. 15 నిమిషాల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు జితు చౌదరి తన ఇంటి ముందు రోడ్డుపై తుపాకీ గాయాలతో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా జితూ చౌదరి బీజేపీ మాయూర్ విహార్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జ్, ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment