Ghazipur
-
మాటలకందని విషాదం, మ్యాన్‌హోల్ పడి..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) పని తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న సివిల్స్ కోచింగ్ అభ్యర్థులు ముగ్గురు మరణించిన ఘటనలో ఎంసీడీపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత జరిగినా యంత్రాంగం మొద్దు నిద్రతో ఉండిపోయింది. ఫలితంగా.. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఇందులో ఘాజిపూర్ ఘటన అయితే మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. అప్పటిదాకా ఇంట్లో నానమ్మతో ఆడుకున్న చిన్నారి.. తల్లి బయటకు వెళ్తుంటే తాను మారాం చేశాడు. ‘‘వర్షం పడుతుంది వద్దులే మున్నా..’’ అని చెప్పినా మారాం వీడలేదు. చేసేది లేక ఆ కొడుకును వెంటపెట్టుకెళ్లిందామె. అయితే.. బోరు వర్షంలో బయటకు వెళ్లిన ఆ తల్లీకొడుకుల్ని మృత్యువు మ్యాన్‌హోల్ రూపంలో కబళించింది.ఢిల్లీ ఘాజిపూర్లో బుధవారం సాయంత్రం విషాదకర ఘటన చేసుకుంది. తనూజా బిష్ట్ అనే మహిళ మూడేళ్ల కొడుకుతో సహా తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయింది. ఆ ఇద్దరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గంటల తరబడి గాలించి.. చివరకు 500 మీటర్ల దూరంలో మృతదేహాల్ని గుర్తించాయి. అయితే.. మరణంలోనూ ఆ అమ్మ ఆ బిడ్డను తన ఒడి నుంచి వీడలేదు. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.ఇదిలా ఉంటే.. అధికారులు త్వరగతిన స్పందించి ఉంటే తన భార్యాబిడ్డలు బతికి ఉండేవాళ్లని.. ఆమె భర్త హరీష్ రావత్ రోదిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం అందిందని, రెండు గంటల తర్వాత సిబ్బంది వచ్చారని, పైగా సరైన పరికరాలు లేవని మరో గంట తర్వాతే సహాయక చర్యలను ప్రారంభించారని చెబుతున్నాడాయన. స్థానికులు సైతం మున్సిపల్ సిబ్బంది స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. అయితే ఆ ఆరోపణల్ని ఖండించిన మున్సిపల్ సిబ్బంది.. ఆ మ్యాన్ హోల్ మూడు నెలలుగా తెరిచే ఉందని అధికారులు చెబుతుండడం గమనార్హం.#Ghazipur, #UttarPradesh: "Yesterday, a mother and her daughter died after falling into a drain. Due to waterlogging, they couldn't figure out where to go. There are no facilities here. pic.twitter.com/YcWEau5J6j— Siraj Noorani (@sirajnoorani) August 1, 2024#delhirain fury claims life of a young mother & child 22YO Tanuja was on her way home carrying her 3yr old son Priyansh. She tripped into an open drain in #Ghazipur. pic.twitter.com/1bj3ZR4CY2— The Munsif Daily (@munsifdigital) August 1, 2024 -
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘాజీపూర్ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిజేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. यूपी के गाजीपुर में हाइटेंशन तार की चपेट में आने से बस में आग लग गई! बस में करीब 50 बाराती सवार थे , कई लोगों के जिंदा जलने की खबर है! ग्रामीणों ने दो थाने की पुलिस को भगा दिया है! एक महिला के अनुसार पुलिस ने रूट डायवर्ट किया था!#Ghazipur #accident pic.twitter.com/FsCDegtzdw — ShivRaj Yadav (@shivayadav87_) March 11, 2024 -
ఎమ్మెల్యే హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హతవేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో అఫ్జల్‌ను దోషిగా తేల్చిన ఘాజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం వెల్లడించింది. కాగా అఫ్జల్ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే 2005 నవంబర్ 29న అప్పటి ఘాజీపూర్ ఎమ్మెల్యే కృష్ణనాద్ రాయ్ హత్యకు సంబంధించి అఫ్జల్ అన్సారీతోపాటు అతని సోదరుడిపై యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా వీరిద్దరు దోషులుగా తేలారు. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష, అతని సోదరుడు, గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. చదవండి: ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్ -
ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీGhazipur ల్లో దారుణం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ఘజీపూర్ ప్రాంతంలో బీజేపీ నేత జీతు చౌదరిని ఆయన ఇంటి ముందే దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8. 15 నిమిషాల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు జితు చౌదరి తన ఇంటి ముందు రోడ్డుపై తుపాకీ గాయాలతో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా జితూ చౌదరి బీజేపీ మాయూర్ విహార్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జ్, ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. -
రిపబ్లిక్ డే టార్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు -
11 నెలలకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్‌లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్‌కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్ బారికేడ్లను నిర్మించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్ ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్ గాంధీ రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ యూపీలోని లలిత్‌పూర్‌లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. -
వారణాసి రైలు ఉలిక్కిపడింది
ఉత్తరప్రదేశ్ గాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ మంగళవారం (ఫిబ్రవరి 2) రాత్రి వారణాసి రైలెక్కింది. ఫిబ్రవరి 3– బుధవారం మధ్యాహ్నం వారణాసిలో ఆమెకు టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంది. లెక్కప్రకారం అయితే రైలు వారణాసికి ఉదయం తొమ్మిదికి చేరుకోవాలి. కాని తెల్లారి పొగమంచు కమ్ముకుంది. వారణాసికి రెండు గంటల దూరంలోని ‘మౌ’ అనే ఊరిలో రైలు ఆగిపోయింది. నాజియా ఎగ్జామ్ తప్పిపోయేలా ఉంది. కాని అప్పుడొక చిత్రం జరిగింది. నాజియా ఎగ్జామ్ రాసింది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల పక్షాన ఉన్నాయని ఈ ఉదంతం చెబుతోంది. ప్రతి తమ్ముడికి ఒక అక్క ఉంటే బాగుంటుంది నిజమే కాని ప్రతి అక్కకు కూడా ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందని ఇది చదివితే అర్థమవుతుంది. ‘ఏం చేయన్రా తమ్ముడూ... ఎగ్జామ్ మిస్ అయ్యేలా ఉంది’ అని అక్క ఆందోళన చెందితే తమ్ముడు రంగంలోకి దిగాడు. అతడు చేసిన పని ఫలితం ఇచ్చింది. అక్కకు గండం గట్టెక్కింది కూడా. పొగమంచులో భవిష్యత్తు ఉత్తర ప్రదేశ్‌లో ఘాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ వారణాసిలో బుధవారం (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష రాయాలి. టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ అది. అంటే టీచరు కావాలనే నాజియా తబస్సుమ్ కల నెరవేరాలంటే ఆ ఎగ్జామ్ రాయకతప్పదు. అందుకే ఆమె ఘాజీపూర్‌లో మంగళవారం రాత్రి వారణాసి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. దాదాపు 10 గంటల ప్రయాణం. రైలు మరుసటి రోజు ఉదయం 9.30 గం. లోపు చేరుకున్నా ఎగ్జామ్ రాయడానికి మధ్యలో రెండు గంటల టైమ్ ఉంటుంది. కొంచెం లేటైనా పర్వాలేదనుకుని రైలు ఎక్కింది తబస్సుమ్. కాని పొగమంచులో రైలు ప్రయాణం నత్త నడకన సాగింది. వారణాసికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మౌ’ అనే జంక్షన్లో ట్రైను పూర్తిగా ఆగిపోయింది. అక్కడి నుంచి మామూలు రోజుల్లో ప్రయాణం దాదాపు 2 గంటలు. పొగమంచు వల్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టేలా ఉందని రైల్వే అధికారులు, ప్రయాణికులు కూడా నిర్థారణకొచ్చేశారు. కాని ట్రైన్లో ఉన్న నాజియాకు పరీక్ష ఎలాగైనా రాయాలన్న పట్టుదల. ఏం చేయాలి? ఏం చేద్దాం తమ్ముడూ..? అక్కకు తోడుగా ట్రైన్లో ఉన్న ఆమె తమ్ముడు అన్వర్ జమాల్ పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని గ్రహించాడు. వెంటనే ‘రైల్వేసేవ’ ట్విటర్ అకౌంట్లో పరిస్థితి వివరించాడు. అక్క హాల్ టికెట్, ట్రైన్ నంబర్ పెట్టి ‘సాయం చేయండి’ అని కోరాడు. నిజానికి అది చిగురంత ఆశతో చేసిన పనే. కాని ఆ పని ఫలితం ఇచ్చింది. అన్వర్ జమాల్ ట్వీట్‌కు రైల్వేశాఖ తక్షణమే స్పందించింది. రంగంలో దిగిన రైల్వేశాఖ వారణాసిలో ఉన్న రైల్వే అధికారులు వెంటనే రంగంలో దిగారు. ట్రైన్ ఎక్కడ ఉందో ఆరా తీశారు. ‘మౌ’ జంక్షన్లో ఉన్న ట్రైను వారణాసికి చేరాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయని గ్రహించారు. వారణాసి ఎక్స్‌ప్రెస్ ‘మౌ’ నుంచి వారణాసి చేరే మధ్యలో 4 స్టాపుల్లో ఆగాలి. ఆ స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులకు ఇబ్బంది రాకూండా ఉండేందుకు ఆ నాలుగు స్టేషన్లలో రైలు ఆపడానికే నిశ్చయించుకున్నారు. కాని మౌ వారణాసిల మధ్య సింగిల్ లైన్లో ఇంకో ట్రైన్ ఏదీ లేకుండా చూసుకున్నారు. స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఖాళీ లేకపోతే ఈ ట్రైనును లూప్లైన్లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని స్టేషన్ల నుంచి సిగ్నల్ సకాలంలో అందేలా శ్రద్ధ పెట్టారు. ట్రైను డ్రైవర్‌కు, గార్డ్‌కు సమాచారం అందించారు. ట్రైను చకచక కదిలింది. మధ్యలోని నాలుగు స్టేషన్లలో ఆగి వెంటనే బయలుదేరి నాజియాను వారణాసి చేర్చింది. ‘అందరికీ కృతజ్ఞతలు. మేము సమయానికి చేరుకున్నాం’ అని అన్వర్ జమాల్ సంతోషంగా ట్వీట్ చేశాడు. నాజియా ఎగ్జామ్ రాసింది. రేపు ఆమె టీచర్ అయితే అందరూ ఆమెను రైలు టీచరమ్మ అని పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు. అలా ఆమె ప్రయాణం అందరికీ గుర్తుండిపోయింది. – సాక్షి ఫ్యామిలీ -
ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ/రాంపూర్: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ నిరసన కేంద్రం వద్దకు వెళ్లిన విపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటి, రైతులను కలుసుకునే అవకాశం ఎంపీలకు కల్పించలేదు. శిరోమణి అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ సహా 10 విపక్ష పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు గురువారం ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లారు. ఎంపీల బృందంలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్, సుప్రియ సూలే(ఎన్సీపీ), కణిమొళి(డీఎంకే), తిరుచ్చి రవి(డీఎంకే), సౌగత రాయ్(టీఎంసీ) తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఘాజీపూర్ భారత్– పాకిస్తాన్ సరిహద్దులా ఉందని, రైతులు జైళ్లో ఉన్న ఖైదీలుగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రైతులను కలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులమైన తమను పోలీసులు అనుమతించలేదని వివరించారు. గురువారం లోక్‌సభ భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు సుప్రియ సూలే, సౌగత రాయ్ స్పీకర్‌కు స్వయంగా ఈ లేఖను అందజేశారు. మరోవైపు, ఢిల్లీ–యూపీ మార్గంలో ఉన్న ఘాజీపూర్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయినా, వేలాది మంది రైతులు తీవ్ర చలిని తట్టుకుంటూ నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ– మీరట్ హైవేపైనే కొందరు విశ్రమిస్తున్నారు. మరోవైపు, జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల సమయంలో మృతి చెందిన రైతు నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పరామర్శించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఉన్న దిబ్డిబ గ్రామంలో నవ్రీత్సింగ్ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చి, వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులని, వారి ఉద్యమాన్ని రాజకీయ కుట్ర అని అవమానించడం ఆపేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. రైతులు, పేదల బాధను గుర్తించలేని నాయకులతో ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. నవ్రీత్ సింగ్ త్యాగం వృధా పోదని వారి కుటుంబసభ్యులకు చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. దిబ్డిబ వెళ్తుండగా, ప్రియాంక వాహన శ్రేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని 4 వాహనాలుæ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. -
టాయిలెట్ గదిలో రైతు ఆత్మహత్య
లక్నో : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం కాశ్మీర్ సింగ్ (75) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఘాజిపూర్ సరిహద్దు వద్ద గత కొన్ని రోజులుగా రైతులు నిరసనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కాశ్మీర్ సింగ్ అనే రైతు టాయిలెట్ గది లోపల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతును ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నివాసిగా గుర్తించారు. రైతుల పట్ల కేంద్రం చాలా దారుణంగా వ్యవహరించిందని కాశ్మీర్ సింగ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. రైతు నిరసనలు చేస్తున్న స్థలంలోనే తనకు దహన సంస్కారాలు నిర్వహించాలని నోట్లో తెలిపాడు. గతంలోనూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో హర్యానాకు చెందిన ఓ పూజారి ఢిల్లీ సింఘు సరిహద్దు సమీపంలో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. (కేంద్ర చట్టాలపై కేరళ అసెంబ్లీ తీర్మానం ) కాగా వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.(సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య ) -
ఉత్తర్‌ప్రదేశ్: ఘాజీపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
-
మైనర్ గ్యాంగ్‌రేప్ కేసులో అనూహ్య మలుపు
లక్నో, ఉత్తరప్రదేశ్: ఘాజీపూర్ మైనర్ బాలిక కిడ్నాప్, ఆత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది మైనర్ అని చెప్పడంతో తొలుత అతడిని జువెనైల్ (బాల నేరస్తుడు) అని నమ్మించే యత్నం జరిగింది. కానీ వైద్య పరీక్షల్లో వాస్తవం వెలుగుచూసింది. అతడు బాల నేరస్తుడు కాదని, నిందితుడి వయసు 20 ఏళ్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని ఘాజీపూర్‌లో గత నెల (ఏప్రిల్) 21న స్థానిక మార్కెట్‌కు వెళ్తున్న 11 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి, మదర్సాలో బంధించాడు. ఆ చిన్నారిపై డ్రగ్స్ ఇచ్చి కొందరు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం గుర్తించారు. అతని ఫోన్ కాల్ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో మదర్సాలో ఉన్న యువకుడు, మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అని చెప్పడంతో యువకుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో మౌల్వీ ఉండటంతో ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. కొందరు హిందువులు మౌల్వీ ఇంటిపై దాడులు చేస్తామని బెదిరించినట్లు అతడి భార్య గతంలో మీడియాకు తెలిపారు. ఓవైపు మతం రంగుతో పాటు మరోవైపు బాల నేరస్తుడు కావడం కేసు క్లిష్టంగా మారింది. కానీ తాజాగా వైద్య పరీక్షల్లో యువకుడి ఎముకల బలాన్ని చెక్ చేయగా, 20 ఏళ్ల యువకుడిగా గుర్తించడంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. ఆ నిందితుడిని జువెనైల్ హోం నుంచి జైలుకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. -
ప్రియుడిని చూసిందని.. కుమార్తె హత్య
సాక్షి, న్యూఢిల్లీ : మానవ సంబంధాలు రోజురోజుకూ మరింత దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాలు.. హత్యలకు దారితీస్తున్నాయి. ఈ కోవలోకే ఆరేళ్ల చిన్నారి కాజల్ హత్య కూడా చేరిపోయింది. దారుణం ఏమిటంటే.. కన్నతల్లే చిన్నారిని కడతేర్చడం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీలు చెబుతున్న వివరాలు ఇవి. బుధవారం రాత్రిమున్నీదేవి కుటుంబం.. తమ ఆరేళ్ల చిన్నారి కాజల్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించారు. కాజల్ ఫొటోలను వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేయడంతో పాటూ, గల్లీగల్లీ వెదికారు. చిన్నారికోసం తీవ్రంగా సోదాలు చేస్తున్న పోలీసులకు ఓ ఇంటిపైన కాజల్ మృత దేహం కనిపించింది. చిన్నారి కాజల్ గొంతు కోసి మరీ చంపారు. దీనిపై పోలీసులు తమ స్టైల్లో దర్యాప్తు చేసేసరికి తానే హత్య చేసినట్లు తల్లి మున్నీ దేవి(30) ఒప్పుకుంది. భర్త, పిల్లలు బయటకు వెళ్లాక మున్నీదేవి ప్రియుడు సుధీర్ (22) ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. సుధీర్‌తో మున్నీదేవి చాలా సన్నిహితంగా ఉంది. ఈ దృశ్యాన్ని చిన్నారి కాజల్ అనుకోకుండా చూడడం జరిగింది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పేందుకు కాజల్ పరుగు తీసింది. కాజల్ కంటే వేగంగా మున్నీదేవి పరుగుల తీసి చిన్నారిని పట్టుకుంది. అంతలోనే కత్తిని తీసుకుని సుధీర్ వచ్చాడు. సుధీర్ కాజల్ కాళ్లు చేతులు పట్టుకుని ఉండగా.. తల్లి మున్నీదేవి గొంతుకోసి ప్రాణం తీసింది. చిన్నారిని హత్య చేసి ఏమీ ఎరుగన్నట్లు ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లారు. ఈ కేసుపై విచారణ చేసిన డీసీపీ ఓమ్‌వీర్ సింగ్ మున్నీదేవి, సుధీర్‌లపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘వాళ్లే నిద్రమాత్రలు వేసుకుంటున్నారు’
-
'నా చాయ్ అంత స్ట్రాంగ్‌గా నిర్ణయాలుంటాయ్'
ఘాజిపూర్: మాములుగానే మంచి మాటకారి అయిన ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన సభకు వచ్చిన ప్రజలను తన వాక్చాతుర్యంతో కట్టిపడేశారు. పంచ్ డైలాగ్‌లు విసరడంతో వారంతా సందడి చేశారు. సోమవారం బీజేపీ పరివర్తన ర్యాలీ సందర్భంగా మాట్లాడిన మోదీ తాను చాయ్ అమ్మిన రోజులు గుర్తు చేసుకున్నారు. తన నిర్ణయాలు కూడా తన చాయ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయని అన్నారు. ఈ మాట వినగానే సభ ముందు ఉన్నవారంతా మోదీ మోదీ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. 'నేను చిన్న పిల్లాడిలా ఉన్న రోజుల్లో చాయ్ మరింత్ స్ట్రాంగ్‌గా తయారు చేయమని కోరేవారు.. ఇప్పుడు నా నిర్ణయాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. నేను రైల్వే ఫ్లాట్ ఫాంలపై చాయ్‌లు అమ్మేవాడిని' అని మోదీ బహిరంగ సభలో చెప్పారు. రూ.2.5లక్షలు జమ చేసేవారిని అధికారులు ఏమీ అనబోరని, కానీ, 2.5కోట్లు ఉన్నవారిని మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు తమ మంచాల పరుపుల కింద దాచినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అంతకుముందు దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని మోదీ అన్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయానికి సామాన్యులు సహకరిస్తుంటే.. నల్ల కుబేరులు మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. -
పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: మోదీ
ఘజీపూర్: దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం ఉత్తరప్రదేశ్ ఘజీపూర్‌లో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయాన్ని సామాన్యులు సహకరిస్తుంటే... నల్ల కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ ప్రధాని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బ్లాక్ మనీ విషయాన్ని హస్తం పార్టీ తప్పుదోవ పట్టిస్తోందన్న ఆయన కాంగ్రెస్ టెర్రరిస్టులకు మద్దతు పలుకుతుందా అని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదల కష్టం గురించి వాళ్లందరి కంటే తనకే బాగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబ సభ్యులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ...దేశాన్ని జైల్లో పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు పెద్ద సమస్య వచ్చిందంటూ మోదీ ఎద్దేవా చేశారు. దేశంలో డబ్బుకు కొదవ లేదని, కాకపోతే ఉండాల్సిన చోటే డబ్బు లేదని అన్నారు. పేదల త్యాగం వృథా కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఓటు ద్వారానే మార్పు సాధ్యమని మోదీ ఉటంకించారు. తమది పేదల ప్రభుత్వమని ఆయన అన్నారు. అవినీతిపరులే నల్లధనం గురించి ఆందోళన చెందుతున్నారని, సామస్యుల ఇబ్బందులు తనకు తెలుసునని మోదీ పేర్కొన్నారు. సామాన్యుల పరిరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, దేశంలో అవినీతికి తావులేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఓటు ద్వారా అవినీతి వద్దని చెప్పాలని ఆయన కోరారు. నల్లధనంపై యుద్ధనికి సహకరించాలన్నారు. తాను కేవలం 50రోజుల వ్యవధి మాత్రమే అడిగానని మోదీ తెలిపారు. -
కోర్టు ఆవరణలో కాల్పుల కలకలం
ఘాజీపూర్: కోర్టు ఆవరణలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడటం కలకలం సృష్టించింది. హత్యకేసులో ప్రధాన నిందితుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేందుకు యత్నంచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రామ్ కిషోర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ హత్యకేసులో నిందితుడు చందన్ సింగ్ ను జిల్లా జైలులో పోలీసు కస్గడీలో ఉన్నాడు. ఈ క్రమంలో చందన్ సింగ్ ను కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో కేసు విచారణ పూర్తికాగానే అతడిని స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇంతలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు చందన్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చదన్ వీపు భాగంలో గాయాలుకాగా, చికిత్స నిమిత్తం అతడిని వారణాసిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గతేడాది జూలైలో జరిగిన ఓ హత్య కేసులో చందన్ ప్రధాన నిందితుడని, పాతకక్షలతోనే ఈ కాల్పులకు పాల్పడి ఉంటారని ఎస్పీ రామ్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
'మా టీచర్ వినలేదు.. అందుకే చనిపోతున్నా'
న్యూఢిల్లీ: ఓ టీచర్ ఆగ్రహంతో వ్యవహరించడంతో అవమానంగా, ఒత్తిడిగా భావించిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని నిండు ప్రాణాలు బలితీసుకున్నాడు. అక్కడే ఓ సూసైడ్ నోట్ రాసి తన చావుకు మా టీచరే కారణమంటూ అందులో పేర్కొన్నాడు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం.. ఢిల్లీలోని ఘాజిపూర్లో తరుణ్ అనే విద్యార్థి చదువుతున్నాడు. అతడు స్కూల్ కి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో అక్కడి టీచర్‌కు ఆగ్రహం కలిగింది. అతడి చేతిలోని ఫోన్ లాగేసుకుని ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకెప్పుడూ తాను మొబైల్ ఫోన్ తీసుకురానని ఆ విద్యార్థి బ్రతిమిలాడుకున్నా ఆ టీచర్ మాత్రం అలా ఇవ్వడం కుదరదని వెళ్లి తల్లిదండ్రులను తీసుకొని రా అనే గట్టిగా అతడికి చెప్పడంతో అవమానంగా భావించిన అతడు ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. శనివారం టీచర్, విద్యార్థికి మధ్య ఈ ఘటన చోటుచేసుకోగా అతడు ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.