'మా టీచర్ వినలేదు.. అందుకే చనిపోతున్నా' | Boy hangs self after teacher rebukes him for carrying mobile | Sakshi
Sakshi News home page

'మా టీచర్ వినలేదు.. అందుకే చనిపోతున్నా'

Published Mon, Nov 30 2015 9:50 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

'మా టీచర్ వినలేదు.. అందుకే చనిపోతున్నా' - Sakshi

'మా టీచర్ వినలేదు.. అందుకే చనిపోతున్నా'

న్యూఢిల్లీ: ఓ టీచర్ ఆగ్రహంతో వ్యవహరించడంతో అవమానంగా, ఒత్తిడిగా భావించిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని నిండు ప్రాణాలు బలితీసుకున్నాడు. అక్కడే ఓ సూసైడ్ నోట్ రాసి తన చావుకు మా టీచరే కారణమంటూ అందులో పేర్కొన్నాడు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం.. ఢిల్లీలోని ఘాజిపూర్లో తరుణ్ అనే విద్యార్థి చదువుతున్నాడు.

అతడు స్కూల్ కి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో అక్కడి టీచర్కు ఆగ్రహం కలిగింది. అతడి చేతిలోని ఫోన్ లాగేసుకుని ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకెప్పుడూ తాను మొబైల్ ఫోన్ తీసుకురానని ఆ విద్యార్థి బ్రతిమిలాడుకున్నా ఆ టీచర్ మాత్రం అలా ఇవ్వడం కుదరదని వెళ్లి తల్లిదండ్రులను తీసుకొని రా అనే గట్టిగా అతడికి చెప్పడంతో అవమానంగా భావించిన అతడు ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. శనివారం టీచర్, విద్యార్థికి మధ్య ఈ ఘటన చోటుచేసుకోగా అతడు ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement