
సాక్షి, సత్యసాయి: ఓడీ చెరువు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి కుమార్తె సుప్రజ (26) కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సుప్రజ కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది.
కాగా, ఆదివారం తెల్లవారుజామున కడుపునొప్పి తీవ్రమై భరించలేక ఇంటి పైకప్పు కొండీకి చీరతో ఉరి వేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నాన్న దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి, తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment