
సాక్షి, న్యూఢిల్లీ : మానవ సంబంధాలు రోజురోజుకూ మరింత దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాలు.. హత్యలకు దారితీస్తున్నాయి. ఈ కోవలోకే ఆరేళ్ల చిన్నారి కాజల్ హత్య కూడా చేరిపోయింది. దారుణం ఏమిటంటే.. కన్నతల్లే చిన్నారిని కడతేర్చడం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీలు చెబుతున్న వివరాలు ఇవి.
బుధవారం రాత్రిమున్నీదేవి కుటుంబం.. తమ ఆరేళ్ల చిన్నారి కాజల్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించారు. కాజల్ ఫొటోలను వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేయడంతో పాటూ, గల్లీగల్లీ వెదికారు. చిన్నారికోసం తీవ్రంగా సోదాలు చేస్తున్న పోలీసులకు ఓ ఇంటిపైన కాజల్ మృత దేహం కనిపించింది. చిన్నారి కాజల్ గొంతు కోసి మరీ చంపారు.
దీనిపై పోలీసులు తమ స్టైల్లో దర్యాప్తు చేసేసరికి తానే హత్య చేసినట్లు తల్లి మున్నీ దేవి(30) ఒప్పుకుంది. భర్త, పిల్లలు బయటకు వెళ్లాక మున్నీదేవి ప్రియుడు సుధీర్ (22) ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. సుధీర్‌తో మున్నీదేవి చాలా సన్నిహితంగా ఉంది. ఈ దృశ్యాన్ని చిన్నారి కాజల్ అనుకోకుండా చూడడం జరిగింది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పేందుకు కాజల్ పరుగు తీసింది. కాజల్ కంటే వేగంగా మున్నీదేవి పరుగుల తీసి చిన్నారిని పట్టుకుంది. అంతలోనే కత్తిని తీసుకుని సుధీర్ వచ్చాడు. సుధీర్ కాజల్ కాళ్లు చేతులు పట్టుకుని ఉండగా.. తల్లి మున్నీదేవి గొంతుకోసి ప్రాణం తీసింది. చిన్నారిని హత్య చేసి ఏమీ ఎరుగన్నట్లు ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లారు. ఈ కేసుపై విచారణ చేసిన డీసీపీ ఓమ్‌వీర్ సింగ్ మున్నీదేవి, సుధీర్‌లపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment