ఎమ్మెల్యే హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు | Afzal Ansari Disqualified As MP After Conviction In Kidnapping Murder Case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష.. బీఎస్పీ అన్సారీపై అనర్హత వేటు

Published Mon, May 1 2023 9:29 PM | Last Updated on Mon, May 1 2023 9:56 PM

Afzal Ansari Disqualified As MP After Conviction In Kidnapping Murder Case - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హతవేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ను కిడ్నాప్‌ చేసి హత్యచేసిన కేసులో అఫ్జల్‌ను దోషిగా తేల్చిన ఘాజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం వెల్లడించింది. కాగా అఫ్జల్‌ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు.

అయితే  2005 నవంబర్ 29న అప్పటి ఘాజీపూర్ ఎమ్మెల్యే కృష్ణనాద్ రాయ్ హత్యకు సంబంధించి అఫ్జల్‌ అన్సారీతోపాటు అతని సోదరుడిపై యూపీ గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసు నమోదైంది.  ఈ కేసులో తాజాగా వీరిద్దరు దోషులుగా తేలారు. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష, అతని సోదరుడు, గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్‌ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.
చదవండి: ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement