ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిందితులు ముసుగులు వేసుకుని బీజేపీ నేతపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ ఘటన ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర మటియాలాను శుక్రవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ద్వారకలోని తన ఆఫీసులో రాత్రి 7.30 నిమిషాలకు టీవీ చూస్తున్న సమయంలో.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చారు. తొలుత సురేంద్రను కొట్టి.. ఆ తర్వాత ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన సంబంధించిన ముగ్గురు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటన సందర్భంగా ఇద్దరు ఆఫీసులోకి వెళ్లగా, మరో వ్యక్తి బైక్‌పై ఆఫీసు బయట ఉన్నట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన తర్వాత ముగ్గురూ అక్కడ నుంచి బైక్‌పై పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. సీసీ ఫుటేజీతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్ష వర్ధన్ తెలిపారు.
మరోవైపు.. సురేంద్ర మటియాలా హత్యపై కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆయన కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రికి శత్రవులులేరని తెలిపాడు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అయితే, ఓచోట భూమికి సంబంధించిన వివాదంలో బీజేపీ నేత సురేంద్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment