లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం | Video: Lawyers Fire In The Air After Quarrel At Delhi Tis Hazari Court | Sakshi
Sakshi News home page

Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం

Published Wed, Jul 5 2023 3:04 PM | Last Updated on Wed, Jul 5 2023 3:25 PM

Video: Lawyers Fire In The Air After Quarrel At Delhi Tis Hazari Court - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ కోర్టులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం చెలరేగింది. తీస్‌ హాజారీ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తుపాకీ చేతబట్టి కాల్పులకు తెగబడ్డారు. . అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు.

ఏదో విషయంపై  రెండు వర్గాల లాయర్ల మధ్య వాగ్వాగం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఓ వర్గం న్యాయవాదులు తమ వద్ద ఉన్న పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదని పేర్కొన్నారు. కోర్టు వద్ద పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు.

కోర్టులో కాల్పులు జరపడాన్ని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కేకే మనన్‌ ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. అయితే సదరు గన్‌లకు లైసెన్స్‌ ఉందా లేదాన అనే కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఒకవేళ లైసెన్స్‌డ్‌ ఆయుధాలు అయినప్పటికీ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు కానీ ఇతరులు కానీ కాల్పులు జరపడం నేరమని పేర్కొన్నారు.
చదవండి: మొత్తం శరద్‌ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement