Tis Hazari Court
-
ఢిల్లీ: ఆ మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు
ఆమె అతన్ని నమ్మింది. అన్నా అని ఆప్యాయంగా పిలిచి.. ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేది. కానీ, అతడిలోని ఉన్మాదం బయటపడింది. మరో ఇద్దరితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగలేదు. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ఇద్దరు బిడ్డలను(7, 6 ఏళ్ల వయసు) వదల్లేదు. ఘోరమైన ఈ కేసులో చివరకు ఆ మానవ మృగాలకు న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఖ్యాలా ట్రిపుల్ మర్డర్(వివాహిత హత్యాచారం) కేసులో ముగురు నిందితులకు మరణశిక్ష పడింది. మంగళవారం తీస్ హజారీ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2015లో మొహమ్మద్ అక్రమ్, షాహిద్, రఫత్ అలీ అనే ముగ్గురు.. తమకు పరిచయం ఉన్న వివాహితపై హత్యాచారానికి(గ్యాంగ్ రేప్, మర్డర్) పాల్పడడంతో పాటు ఆమె పిల్లలిద్దరిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఆపై ఇంట్లోని డబ్బు, నగదుతో పరారయ్యారు. అదే ఏడాదిలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. కోర్టు విచారణ మాత్రం ఎనిమిదేళ్లపాటు సాగింది. సుదీర్ఘ దర్యాప్తు కొనసాగిన అనంతరం ఈ కేసులో పక్కా ఆధారాల్ని పోలీసులు కోర్టులో సమర్పించడంతో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అంచల్ మంగళవారం శిక్ష ఖరారు చేశారు. జడ్జి వ్యాఖ్యలు.. తీర్పు చదివే సమయంలో జడ్జి.. ‘‘ఆమె భర్త పని మీద ఊరు వెళ్తున్నాడని నిందితులకు తెలుసు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల కుట్ర ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె బిడ్డలను కూడా చంపి.. అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు ఈ ముగ్గురు. అన్నింటికి మంచి ప్రధాన నిందితుడు అక్రమ్‌పై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. అన్నా అనే పిలుపునకు కళంకం తెచ్చాడు అంటూ మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. పక్కా స్కెచ్ వేసి.. 2015లో ఢిల్లీ రఘువీర్ నగర్‌లోని బాధిత కుటుంబం ఉంటోంది. అదే కాలనీలో ఉండే మొహమ్మద్ అక్రమ్ ఆ కుటుంబంతో చనువుగా ఉంటూ వచ్చేవాడు. సదరు వివాహిత అతన్ని అన్నగా పిలుస్తూ.. ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. ఈ క్రమంలో పని మీద జైపూర్ వెళ్లి తిరిగొచ్చిన భర్తకు.. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం కనిపించింది. భార్య మెడకు దుపట్టా, కూతురి మెడకు కర్చీఫ్‌తో ఉరేసి ఉంది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు స్పష్టంగా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. 2015, సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఘటన జరిగింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలడంతో పాటు పదునైన ఆయుధంతో ఆమెను హతమార్చినట్లు తేలింది. ఈ కేసులో దర్యాప్తులోతుకి వెళ్లిన పోలీసులకు అక్రమ్‌పైనే అనుమానాలు మళ్లాయి. అదే ఏడాది అక్టోబర్‌లో షాహిద్, అక్రమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లిచ్చిన సమాచారంతో.. రఫత్(అప్పుడు మైనర్‌గా ఉన్నాడు)అనే మరో నిందితుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, నిందితుల ఫోన్‌కాల్స్ రికార్డయిన సమయం.. ప్రాంతం.. ఇలా అన్నింటిని పోలీసులు పరిశీలించారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత.. 2023, ఆగష్టు 22న ఈ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. -
లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ కోర్టులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం చెలరేగింది. తీస్ హాజారీ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తుపాకీ చేతబట్టి కాల్పులకు తెగబడ్డారు. . అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ఏదో విషయంపై రెండు వర్గాల లాయర్ల మధ్య వాగ్వాగం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఓ వర్గం న్యాయవాదులు తమ వద్ద ఉన్న పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదని పేర్కొన్నారు. కోర్టు వద్ద పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. #WATCH | An incident of firing was reported at Tis Hazari Court premises in Delhi this afternoon. No injuries were reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/AkRYOoyQPe — ANI (@ANI) July 5, 2023 కోర్టులో కాల్పులు జరపడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేకే మనన్ ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. అయితే సదరు గన్లకు లైసెన్స్ ఉందా లేదాన అనే కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఒకవేళ లైసెన్స్డ్ ఆయుధాలు అయినప్పటికీ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు కానీ ఇతరులు కానీ కాల్పులు జరపడం నేరమని పేర్కొన్నారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు Delhi | A firing incident reported at Tis Hazari Court premises, no injuries reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/MMPOQwpWaZ — ANI (@ANI) July 5, 2023 -
కోర్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత?
న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలను నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక తరగతికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ నిర్ణయం తరువాత ప్రత్యేక సీఐఎస్ఎఫ్ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. -
లాయర్లు, పోలీసుల్లో ఎవరు అధికులు!?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ జరిగి పది రోజులు గడుస్తున్నా న్యాయవాదులు ఇప్పటికీ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. నవంబర్ రెండవ తేదీ నాడు ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడడం, పలు వాహనాలు దగ్ధమవడం తెల్సిందే. ఆ రోజు తమపై దాడి జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈమధ్య వెలుగులోకి వచ్చిన ఆనాటి ఓ వీడియోను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో డిప్యూటీ పోలీసు కమిషనర్ మోనికా భరద్వాజ్ సహా కొంత మంది పోలీసులను ఓ లాయర్ల బృందం తరమడం కనిపించింది. అలాగే పలు పోలీసు వాహనాలకు లాయర్లు నిప్పు పెట్టడం కనిపించింది. మరో వీడియోలో నలుగురు పోలీసు అధికారుల వెంటపడగా రెండు చేతులు జోడించి ఆందోళన చేస్తున్న లాయర్లను మోనికా భరద్వాజ్ వేడుకోవడం, తన తుపాకీని ఎవరో కాజేశారంటూ తన సబార్డినేట్‌కు చెప్పుకోవడం కనిపించింది. ఆ తుపాకీ జాడ ఇప్పటికీ లేదు. నాటి ఘర్షణల్లో పది మంది పోలీసులు గాయపడినప్పటికీ, వీడియో సాక్ష్యాలు లభించినప్పటికీ ఇప్పటి వరకు సదరు న్యాయవాదులపై నమోదు చేయక పోవడం ఆశ్చర్యకరమైతే, న్యాయవాదులే ఇప్పటికీ ఆందోళన చేయడం మరింత ఆశ్చర్యకరం. ఇదే మొదటి సారి కాదు ఢిల్లీలో లాయర్లు, పోలీసులు ఘర్షణ పడడం ఇదే మొదటి సారి కాదు. 1988లో ప్రస్తుతం పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ నార్త్ ఢిల్లీకి డిప్యూటి పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఓ లాయర్‌ను ఓ పోలీసు అధికారి అరెస్ట్ చేసినప్పుడు లాయర్లు పెద్ద గొడవ చేశారు. కిరణ్ బేడీ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆమె ఆఫీసులోకి దూసుకుపోయి ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఢిల్లీలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగడం చాలా సాధారణమని ఢిల్లీలో 1985 నుంచి 2004 వరకు పలు సీనియర్ పదవుల్లో పనిచేసిన రిటైర్డ్ పోలీసు మాక్సివెల్ పెరీరా తెలిపారు. 1980వ దశకంలో హత్య కేసులో ఓ న్యాయవాదే ప్రధాన నిందితుడని తేలినప్పటికీ ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఓ జడ్జీపై న్యాయవాదులు ఒత్తిడి చేసి సంతకం చేయించుకున్నారని ఆయన చెప్పారు. చట్టానికి లాయర్లు అతీతులు కానప్పటికీ ఢిల్లీ న్యాయ వ్యవస్థలో మాత్రం పక్షపాతం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. లాయర్లు, పోలీసుల మధ్య ఢిల్లీలో నవంబర్ రెండవ తేదీన ఘర్షణ జరగ్గా, మూడవ తేదేనీ ఆ సంఘటనపై ప్రత్యేక విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులపై లాఠీచార్జి జరిపి, కాల్పులకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాల్సిందిగా పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నవంబర్ ఏడవ తేదీన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ‘న్యాయవాదులకు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకోరు. ఏ అధికారం లేకుండా పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తారు. ఇదేమీ న్యాయమో అర్థం కావడం లేదు’ అని పెరీరా వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరగాలంటే నవంబర్ ఐదవ తేదీన పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు వేల సంఖ్యలో పోలీసు నిరసన ప్రదర్శన జరిపినా లాభం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా అబద్ధమని, జడ్జీలేమీ తమ పట్ల పక్షపాతం చూపడం లేదని, చట్ట ప్రకారమే వారు ఉత్తర్వులు జారీ చేశారని పాటియాలా హౌజ్ కోర్టులో గత 11 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అజయ్ కుమార్ ఖండించారు. సీనియర్ న్యాయవాది చిదంబరమే నేడు జైల్లో ఉన్నారని, నేరం చేసినప్పుడు మాత్రమే ఎవరైనా జైలుకు వెళతారని ఆయన వ్యాఖ్యానించారు. లాయర్ల వద్ద ఎలాంటి అధికారం లేదని, పోలీసుల వద్ద అధికారం ఉంది కనుకనే వారి వద్ద ఆయుధాలు, కర్రలు ఉన్నాయని మరో సీనియర్ న్యాయవాది యోగేంద్ర సింగ్ తోమర్ మీడియాతో వ్యాఖ్యానించారు. వీడియోల గురించి ప్రస్తావించగా, అవి ఏకపక్షంగా తీసిన వీడియోలని చాలా మంది న్యాయవాదులు ఖండించారు. -
మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!
-
మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!
సాక్షి, న్యూఢిలీ : పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ ఢిల్లీ పోలీసులు, లాయర్లకు మధ్య ఘర్షణలకు దారితీసింది. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన ఈ ఘటనలో 30 మంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన ఈ గల్లీ ఫైటింగ్ సంచలనం రేపింది. ఇక ఈ ఘటనకు సంబంధించి తాజగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, ఆడియో క్లిప్పింగ్‌లలో లాయర్ల జులుం బయటపడింది. వాటి ప్రకారం.. (చదవండి : రణరంగంగా తీస్‌హజారీ కోర్టు) ఓ మహిళా డీసీపీని కొందరు లాయర్ల గుంపు తరుముకుంటూ వస్తోంది. మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది ఆమెకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తున్నారు. తన సహాయక సిబ్బందిలో ఒకరి పిస్టోల్‌ను ఎవరో కొట్టేశారని సదరు డీసీపీ ఆందోళనగా చెప్తున్నారు. సిబ్బంది సహాయంతో ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడగలిగారు. మేడమ్‌ను బయటకు తీసుకొస్తున్న క్రమంలో లాయర్ల దాడిలో తన భుజానికి బలమైన గాయమైందని ఆమెకు రక్షణగా ఉన్న ఓ పోలీసు ఆవేదన వ్యక్తం చేశాడు. మేడమ్ సబార్డినేట్లలో ఒకరిది పిస్టోల్ కనిపించడం లేదని చెప్పాడు. వీటితోపాటు ఫుటేజ్‌లో కనిపించిన మరో దృశ్యం ఘటన తీవ్రతను వెల్లడిస్తోంది. దాంట్లో లాయర్లు ఓ మోటార్ సైకిల్‌కు నిప్పుపెట్టడం కనిపించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పివేశారు. లేదంటే ఆ పరిసరాల్లోని లాకప్‌లో ఉన్న 150 మంది ఖైదీల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే..! (చదవండి : ‘తీస్ హజారీ’ ఘటనపై న్యాయ విచారణ) ఇక కొందరు లాయర్లు సోమవారం మరో పోలీసుపై దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. పోలీసులు ఉన్నతాధికారులు లాయర్లకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఖాకీ సిబ్బంది ఒక్కటయ్యారు. గత మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. మహిళా పోలీసు అధికారి ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా స్వీకరించారు. -
పోలీసుల పోరు!
దేశ రాజధాని మంగళవారం విస్తుపోయింది. పదకొండు గంటలపాటే కావొచ్చుగానీ... ఎప్పుడూ ఆందోళనలను, నిరసనలను అణచడం కోసం రంగంలోకి దిగే పోలీసులు ఈసారి తామే ఆందోళన చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించారు. వారి కుటుంబసభ్యులను సైతం రంగంలోకి దించి న్యూఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినాదాలు చేశారు. తమను సముదాయించడానికొచ్చిన ఉన్నతాధికారులను ‘గో బ్యాక్..గోబ్యాక్’ అంటూ తృణీకరించారు. ఇంత ఆందోళనకు కారణం ఈ నెల 2న ఢిల్లీలోని తీస్‌హజారి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదు లకూ, పోలీసులకూ మధ్య తలెత్తిన వివాదం. ఒక వాహనాన్ని పార్క్ చేయడం దగ్గర రాజుకున్న వివాదం చూస్తుండగానే ముదిరి రెండు వర్గాలూ కొట్టుకునే స్థాయికి చేరింది. అటు న్యాయ వాదులు, ఇటు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమ య్యాయి. పోలీసులు కాల్పులు కూడా జరిపారు. పోలీస్ పిస్తోలు కూడా మాయమైందంటున్నారు. శనివారం జరిగిన ఈ గలాటా ఆదివారంనాడు ఢిల్లీ హైకోర్టు ముందుకెళ్లింది. ఇద్దరు ఏఎస్ఐ స్థాయి అధికారుల సస్పెన్షన్‌కు ఆదేశాలివ్వడంతోపాటు అదనపు డీసీపీని, స్పెషల్ కమిషనర్‌ను బదిలీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిగిన ఉదంతంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేశారు. న్యాయవాదులపై మళ్లీ ఆదేశాలిచ్చేవరకూ చర్యలు తీసుకోవద్దన్నారు. ఈ ఆదే శాలన్నీ న్యాయవాదులకు ఉపశమనం కలిగించేవే. సాధారణంగా అయితే ఇక్కడితో అంతా సద్దు మణిగేది. కానీ అంతవరకూ బాధితులుగా కనబడ్డ న్యాయవాదుల పరిస్థితి సామాజిక మాధ్య మాల్లో ప్రచారంలోకొచ్చిన కొన్ని దృశ్యాల పర్యవసానంగా తిరగబడింది. న్యాయవాదులు తీస్ హజారి కోర్టు లాకప్పైకి దూసుకెళ్లి ఒకరిద్దరు కానిస్టేబుళ్లను చితకబాదడం, అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడం వగైరాలన్నీ ఆ దృశ్యాల్లో ఉన్నాయి. అంతేకాదు... సోమవారం కోర్టుకు రికార్డు సమర్పించడానికెళ్లిన కానిస్టేబుల్‌పై కొందరు న్యాయవాదులు అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించినరోజే పోలీసులు కూడా తమపై జరిగిన దౌర్జన్యం గురించి చెబితే వేరేవిధంగా ఉండేదేమో! కానీ ఈ దృశ్యాలు బయ టపడేవరకూ వారికి కూడా జరిగిన ఘటనపై స్పష్టత లేనట్టు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన దృశ్యాలు న్యాయవాదుల ప్రతిష్టను పెంచవు. పోలీసుల వల్ల వారికి అన్యాయమే జరిగి ఉండొచ్చు. న్యాయవాదులు కూడా సంయమనం కోల్పోయి రౌడీయిజానికి దిగడం సమస్య పరి ష్కారానికి దోహదపడదు. ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించుకోవటంలో ఇరువర్గాల్లోనూ చాక చక్యం లోపించి ఇదంతా సంక్లిష్ట వ్యవహారంగా మారింది. దేశ రాజధానిలో పోలీసులే ఆందోళనకు దిగడం పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆ నగరంలో శాంతిభద్రతల వ్యవహారాలు చూసే కేంద్ర హోంశాఖను కూడా ఇరకాటంలో పడేసింది. రెండు వర్గాల మధ్య విశ్వసనీయత కొరవడటం ఈ ఉదంతంలో ప్రధాన సమస్య. న్యాయ వాదులు–పోలీసుల మధ్య మాత్రమే కాదు... పోలీసులకూ, పోలీసు ఉన్నతాధికారులకూ మధ్య కూడా సంబంధాలు సక్రమంగా లేవని ఢిల్లీ ఉదంతం చెబుతోంది. ఒకపక్క తమ సహచరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సమయంలోనేæ కొందరు న్యాయవాదులు దౌర్జన్యానికి దిగి తాము కూడా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడంలో ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఇదే ఢిల్లీలో గతంలో పాత్రికేయులపై కూడా వారు దౌర్జన్యానికి దిగారు. తాజా ఉదంతంలో పోలీసులు సైతం తమ విధి నిర్వహణ రీత్యా క్రమశిక్షణతో మెలగవలసి ఉండగా అందుకు భిన్నంగా ప్రవర్తించారు. కేటా యించిన స్థలంలో కాక వేరే చోట న్యాయవాది వాహనం ఉంచటం పరిష్కరించవీలులేనంత పెద్ద సమస్యా? గోటితో పోయేదానికి గొడ్డలి తీసుకెళ్లినట్టు న్యాయవాదులతో అంత దురుసుగా ప్రవ ర్తించడం అవసరమా? శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రాథమిక కర్తవ్యం అన్న సంగతిని పోలీ సులు గుర్తుంచుకుంటే ఇలా దురుసుగా ప్రవర్తించి చిన్న వివాదాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చేవారు కాదు. తీస్‌హజారి కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఎలాంటి నిబంధనలూ పాటిం చరని, భద్రతా తనిఖీలను సైతం ఖాతరు చేయరని ఎప్పటినుంచో పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆ అవరణను తమ సొంతాస్తిగా న్యాయవాదులు భావిస్తారన్నది వారి ప్రధాన ఫిర్యాదు. తీస్‌హజారి కోర్టు, న్యాయవాదులు–పోలీసుల ఘర్షణ అనగానే ఎవరికైనా 1988నాటి ఉదంతం గుర్తుకొస్తుంది. కిరణ్ బేడీ గుర్తొస్తారు. అప్పట్లో ఒక న్యాయవాదిని దొంగతనం ఆరోపణతో అరెస్టు చేసిన పోలీ సులు ఆయనకు సంకెళ్లు వేసి న్యాయస్థానానికి తీసుకురావడం వివాదానికి మూలం. ఈ కేసులో న్యాయవాదికి మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ వెంటనే బెయిల్ మంజూరు చేయడంతోపాటు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. న్యాయవాదికి సంకెళ్లు వేయడాన్ని కిరణ్‌బేడీ సమర్థించడం, న్యాయవాదుల ఆందోళన అణచడానికి బలప్రయోగా నికి దిగడం పరిస్థితిని దిగజార్చింది. రెండు నెలలపాటు కోర్టులు స్తంభించిపోయాయి. దాని ప్రభావం ఎంతగా ఉందంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిరణ్‌బేడీని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించినప్పుడు ఆరు జిల్లాల్లోని న్యాయవాదులంతా ఏకమై ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రత్యర్థిగా కిరణ్ బేడీ ఆగమనం కూడా ఆప్ ఘనవిజయానికి ఒక కారణం. శాంతి భద్రతల పరిరక్షణకు తమపై ఆధారపడే ప్రభుత్వాలు, ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో తమకు రక్షణగా నిలబడవన్నది పోలీసులు ఎప్పటినుంచో చేస్తున్న ఫిర్యాదు. జరిగిన ఉదంతం విషయంలో పోలీసుల అసంతృప్తిని సకాలంలో పసిగట్టలేకపోవడం ఉన్నతాధికారగణం వైఫల్యం. కనీసం ఇకముందైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏం చర్యలు అవసరమో వారు గ్రహించాలి. -
‘తీస్ హజారీ’ ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ న్యాయ విచారణ చేస్తారని తెలిపింది. విచారణ సమయంలో స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్, అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్‌లను బదిలీ చేయాలని ఆదేశించింది. లాయర్లపై ఎలాంటి నిర్భందపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఘటనకు కారకులుగా భావిస్తున్న ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశామని, మరొకరిని బదిలీ చేశామని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు తెలిపారు. -
రణరంగంగా తీస్‌హజారీ కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు ఆవరణ శనివారం రణరంగాన్ని తలపించింది. లాయర్లు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలో పదిమంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఒక పోలీస్ వ్యానుకు నిప్పుపెట్టారు. మరో 17 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీస్‌హజారీ బార్ అసోసియేషన్ సెక్రటరీ జైవీర్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘కోర్టు ఆవరణలో ఉన్న పోలీస్ జైలు జీప్‌కు ఓ న్యాయవాది కారు పొరపాటున ఢీకొట్టడంతో ఈ గొడవ మొదలైంది. సదరు లాయర్‌ను స్టేషన్లోకి తీసుకెళ్లి పోలీసులు విపరీతంగా కొట్టారు. ఎస్‌హెచ్‌వో మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వలేదు. సెంట్రల్, వెస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీలు వెళ్లి చెప్పినా పోలీసులు లాయరును విడిచిపెట్టలేదు’అని ఆయన ఆరోపించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత, నిరసన తెలుపుతున్న లాయర్లపైకి పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రంజిత్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. మరో నలుగురు లాయర్లు గాయపడ్డారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాపై చేయి చేసుకున్నారు’అని చౌహాన్ పేర్కొన్నారు. అరగంట తర్వాత అరెస్టు చేసిన లాయరును పోలీసులు విడిచిపెట్టారని వివరించారు. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ లాయర్లు కోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. లాయర్లు ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతోపాటు, మరో 17 ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనకు నిరసనగా 4న ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో బంద్ పాటించనున్నట్లు ఢిల్లీ బార్ అసోసియేషన్ తెలిపింది. తాము కాల్పులు జరిపామన్న లాయర్ల ఆరోపణను పోలీసు అధికారులు ఖండించారు. లాయర్ల దాడిలో అడిషనల్ కమిషనర్ హరీందర్ కుమార్, సివిల్, కొత్వాల్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వో తదితరులు 10 మంది గాయపడ్డారని తెలిపారు. -
కోర్టు బయటే కుమ్ముకున్న లాయర్లు, పోలీసులు..!
-
కోర్టు బయటే కుమ్ముకున్న లాయర్లు, పోలీసులు..!
న్యూఢిల్లీ : కారు పార్కింగ్ విషయంలో లాయర్లు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటన తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో లాయర్లు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఒకర్నొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక లాయర్‌కు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్తులకు నష్టం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి కారణాలు చూపుతూ పలువురు లాయర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, పార్కింగ్ స్థలం విషయంలో గొడవ జరిగిందా.. మరైదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. కేసులు కూడా పెట్టారని ఆరోపిస్తూ.. కింది కోర్టుల న్యాయవాదులు ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్, హోంశాఖకు మెమోరాండమ్ సమర్పిస్తామని తెలిపారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేసీ మిట్టల్ లాయర్లపై దాడిని ఖండించారు. ఈదాడిలో ఒక లాయర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసుల తీరుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగితే గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని ఊరికే వదిలేయదని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌ను కోరామని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని లాయర్లకు సూచించారు. గొడవను కవర్ చేసే క్రమంలో ఓ కెమెరామెన్‌పై లాయర్లు దాడి చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. -
జడ్జి కోసం పరుగో పరుగు
న్యూఢిల్లీ: ఎన్నికల అధికారికి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ లంచం ఇచ్చిన అరెస్ట్ చేసిన మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ను కోర్టులో హాజరుపరిచేందుకు ఢిల్లీ పోలీసులు శ్రమించాల్సివచ్చింది. న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. సోమవారం సుఖేష్ ను అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ ప్రొసీడింగ్స్ కోసం పాటియాలా హౌస్ కోర్టు తీసుకొస్తారని భావించారు. అయితే అతడిని టిజ్ హజారీ కోర్టుకు తరలించారు. సోమవారం సాయంత్రం 4.40 గంటలకు అతడిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి పోలీసులకు కష్టాలు మొదలయ్యాయి. స్పెషల్ జడ్జి పూనమ్ చౌధరి ముందు హాజరుపరిచేందుకు 25 నంబరు కోర్టు గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ జడ్జి కనబడకపోవడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆమె హాఫ్ డే లీవు పెట్టారని తెలుసుకుని మరో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు హాజరుపరిచేందుకు నిందితుడిని 313 నంబరు కోర్టు రూములోకి తీసుకెళ్లారు. అక్కడ కూడా జడ్జి లేరు. చేసేది లేక నిందితుడితో పాటు 139 నంబరు కోర్టు గదికి వెళ్లారు. అక్కడ కూడా సేమ్ సీన్. ప్రత్యేక న్యాయమూర్తి హేమాని మల్హోత్రా లోకపోవడంతో ఉస్సూరుమన్నారు. ఇక లాభం లేదనుకుని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సతీశ్ కుమార్ అరోరా విధులు నిర్వహిస్తున్న 38 నంబరు కోర్టు రూములోకి ప్రవేశించారు. ఇక్కడ కూడా వారికి చుక్కెదురైంది. అరగంట పాటు తంటాలు పడిన తర్వాత పోలీసులు నిందితుడిని స్పెషల్ జడ్జి పూనమ్ చౌధరి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరిచారు. సుఖేష్ ను 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలివ్వడంతో పోలీసులు ఊపరి పీల్చుకున్నారు.