
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌పీ గార్గ్ న్యాయ విచారణ చేస్తారని తెలిపింది. విచారణ సమయంలో స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్, అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్‌లను బదిలీ చేయాలని ఆదేశించింది. లాయర్లపై ఎలాంటి నిర్భందపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఘటనకు కారకులుగా భావిస్తున్న ఓ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశామని, మరొకరిని బదిలీ చేశామని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు తెలిపారు.