ఇరు వర్గాల ఘర్షణ.. పోలీసు కేసు నమోదు | bareilly violence up police fir | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల ఘర్షణ.. పోలీసు కేసు నమోదు

Published Sun, Oct 20 2024 12:09 PM | Last Updated on Sun, Oct 20 2024 12:09 PM

bareilly violence up police fir

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బరేలీ జిల్లాలో రెండు వర్గాలు పరస్పరం ఇటుకలు, రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘర్షణలకు కారకులుగా అనుమానిస్తున్న 20 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటన బరేలీలోని కిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్మశాన వాటికలోని వాల్మీకి ప్రాంతంలో చోటుచేసుకుంది. మద్యం సేవించే విషయమై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం  చివరికి ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ  ఉదంతంపై అటుగా వెళ్తున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఇరు వర్గాలవారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు గుంపును లాఠీలతో చెదరగొట్టారు. ఈ కేసులో బాకర్‌గంజ్ అవుట్‌పోస్టు ఇన్‌చార్జి ప్రమోద్ కుమార్‌తో పాటు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement