bareilly
-
మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు
బరేలీ: యూపీలోని బరేలీ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇద్దరు విదేశీయులకు గూగుల్ మ్యాప్ చుక్కలు చూపించింది. జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, వారి విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.వివరాల్లోకి వెళితే ఇద్దరు విదేశీ పర్యాటకులు గూగుల్ మ్యాప్ సాయంతో నేపాల్ వెళ్తుండగా దారి తప్పారు. ఢిల్లీ నుండి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళుతున్న ఈ ఫ్రెంచ్ పర్యాటకులు దారి తప్పి, యూపీలోని చురైలి ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. కొందరు గ్రామస్తులు వీరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ చురైలి పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారించారు.ఈ ఘటన గురించి సర్కిల్ ఆఫీసర్ (సీఓ) బహేరి అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రెంచ్ పౌరులు బ్రియాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గాబ్రియేల్ జనవరి 7న ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. వారు పిలిభిత్ నుండి తనక్‌పూర్ మీదుగా నేపాల్‌లోని ఖాట్మండు వెళ్ళవలసి ఉంది. అయితే గూగుల్ మ్యాప్ వారికి బరేలీలోని బహేరికి రూటును చూపించింది. దీంతో ఆ విదేశీయులు ఇద్దరూ దారితప్పి బరేలీలోని చురైలి ఆనకట్టకు చేరుకున్నారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు విదేశీయులు నిర్మానుష్య ప్రదేశంలో సైకిల్‌పై వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తరువాత గ్రామస్తులు ఆ విదేశీయులను ఆపి, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.అయితే వారు చెప్పేది గ్రామస్తులకు అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు విదేశీయులను చురైలి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య సైతం ఆ ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులను విచారించి,వారిని నేపాల్‌కు సురక్షితంగా పంపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో -
ఇరు వర్గాల ఘర్షణ.. పోలీసు కేసు నమోదు
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బరేలీ జిల్లాలో రెండు వర్గాలు పరస్పరం ఇటుకలు, రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘర్షణలకు కారకులుగా అనుమానిస్తున్న 20 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన బరేలీలోని కిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్మశాన వాటికలోని వాల్మీకి ప్రాంతంలో చోటుచేసుకుంది. మద్యం సేవించే విషయమై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చివరికి ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఉదంతంపై అటుగా వెళ్తున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఇరు వర్గాలవారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు గుంపును లాఠీలతో చెదరగొట్టారు. ఈ కేసులో బాకర్‌గంజ్ అవుట్‌పోస్టు ఇన్చార్జి ప్రమోద్ కుమార్‌తో పాటు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు.. -
బరేలీ యువకునితో ఇంగ్లండ్ యువతి వివాహం
బరేలీ: స్వచ్ఛమైన ప్రేమకు భాష, దేశం, మతం..ఏవీ అడ్డుకాదంటారు. ఈ కోవలోకే వస్తుంది యూపీలోని బరేలీకి చెందిన యువకుడు.. ఇంగ్లండ్‌కు చెందిన యువతి మధ్య నడిచిన ప్రేమ కథ. ఇప్పుడు వారు పెళ్లి పేరుతో ఒకటి కాబోతున్నారు.బరేలీకి చెందిన చెందిన శివం మిశ్రా నగరంలోనే పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించాడు. తరువాత ఉద్యోగం కోసం చైనా వెళ్లాడు. అక్కడ అతనికి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లూసీ రాలింగ్తో పరిచయం ఏర్పడింది. కొద్దికాలానికే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు మతాలైనప్పటికీ ప్రేమ ముందు వారికి ఇవన్నీ చిన్నవిగా కనిపించాయి.శివం తన ప్రియురాలు లూసీతో పాటు ఇంగ్లాండ్ నుండి బరేలీకి చేరుకున్నాడు. వారు న్యాయవాది శంతను మిశ్రా సహాయంతో కోర్టులో తమ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కోర్టు వీరి వివాహంపై నోటీసు జారీ చేసిన తర్వాత, ఎవరి నుంచి అభ్యంతరాలు లేనిపక్షంలో కోర్టు నుండి వీరి వివాహానికి ఆమోదం లభిస్తుంది. అనంతరం వివాహ ధృవీకరణ పత్రం జారీ అవుతుంది. -
13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్ కిల్లర్ హస్తం?
ఉత్తరప్రదేశ్‌లో మహిళల వరుస హత్యలు ఆందోళన రేపుతున్నాయి. బరేలీజిల్లాల్లోని గ్రామీణప్రాంతాల్లో గత 14 నెలలుగా 9 మంది మహిళలు ఒకేలా హత్యకు గురుయ్యారు. మరణించిన మహిళల వయసు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉండటం గమనార్హం. అయితే వీరందరి మరణాల వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.షాహీ, షీష్‌గఢ్, షెర్‌గఢ్.. ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళలే టార్గెట్‌గా ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న మహిళలను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి వారి చీరలతోనే గొంతు నులిమి చంపినట్లు బయటపడింది. . అయితే మృతులను దుస్తులు చిందరవందర అయిన స్థితిలో గుర్తించారు. కానీ.. ఎవరిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. వరుస హత్యలతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గత ఏడాది జూన్‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్లలో ఒక్కొక్కటి, నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి. అయితే హత్యల వెనక అనేక అంశాలు ఒకేలా ఉండటంతో ఈ కేసుల్లో సీరియల్ కిల్లర్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే 8వ హత్య జరిగిన తర్వాత 300 మంది పోలీసులతో కూడిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. యూనిఫారంతో కొందరు, సివిల్ దుస్తుల్లో కొందరు మొత్తం 14 బృందాలుగా విడిపోయి ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. దీంతో కొంతకాలం హత్యలు జరగలేదు. గతేడాది నంబర్ నుంచి ఒక్క హత్య కూడా జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఈ నెల ఆగస్టులో జరిగింది. మరో హత్యతో..7 నెలలపాటు ఎలాంటి హత్యా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ గడిచిన నెల జూలై 9వ హత్య జరిగింది. అనిత అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మునుపటి హత్యల మాదిరిగానే ఆమె మృతదేహాన్ని కూడా చెరకు తోటలోనే గుర్తించారు. షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఖిర్కా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. జులై 2న డబ్బు విత్ డ్రా చేయడానికి ఇంటి నుంచి బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. చెరకు తోటలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్గంలో తేలింది.దీంతో గతేడాది జరిగిన హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో జరిగిన హత్యను గమనించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని ఓ అధికారి తెలిపారు. హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన పలువురితో మాట్లాడిన పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్లను తాజాగా విడుదల చేశారు. ఏమైనా సమాచారం తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయాన్ని సంపద్రించాలని కోరారు. -
మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా
గత ప్రభుత్వంలో నేరస్తులు సురక్షితంగా ఉండేవారు. కానీ పరిస్థితులు మారాయి. బీజేపీ ప్రభుత్వంలో నేరస్తులు లొంగిపోవాలని చూస్తున్నారు. లేదంటే వారి ప్రాణాల్ని తృణ ప్రాయంగా వదిలేసుకుంటున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బరేలీలో జరిగిన బహిరంగ ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఇది మన (బీజేపీ) ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ రక్షణలో ఉన్న మాఫియా ఇప్పుడు లొంగిపోవాలని చూస్తుందని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ మాఫియాలు, నేరగాళ్ల పట్ల సానుభూతి చూపుతోందని సీఎం యోగి ఆరోపించారు .జీవితం అంతా రాష్ట్ర సేవలో, అయోధ్య సేవలో గడిపిన కళ్యాణ్ సింగ్ మరణంపై సమాజ్ వాదీ పార్టీ సంతాపం తెలపకపోవడంపై సీఎం యోగి మండిపడ్డారు. కానీ, ఆయన మరణంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రజలు మొసలి కన్నీరు కారుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రాముడు, అయోధ్య రామ మందిరంపై అవాకులు చెవాకులు పేల్చారు. ఇప్పడు ఆ పార్టీలు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటాయో.. అధికారం లేని ఆ పార్టీలు అలాగే గిలగిల కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.లోక్‌సభలో అత్యధికంగా 80 మంది ఎంపీలతో ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ఏప్రిల్ 19న ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న ముగిసింది. ఆ తర్వాత మే 7, మే 13 ,మే 20, మే 23, జూన్ 1 తేదీల్లో ఐదు, ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. వరుసగా మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. -
‘స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నా’.. జైలు నుంచి హత్య కేసు ఖైదీ వీడియో
లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్ रामराज्य हैं उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024 -
పట్టపగలు బైక్‌కు తాడుతో కట్టేసి.. యువకుడిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో అమానుష ఘటన వెలుగుచూసింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని రోడ్డుపై విచక్షణారహితంగా లాక్కెళ్లారు. యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్‌పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు యువకుడిని తాడుతో కట్టి లాక్కెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడం మరింత విచారకరం. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే దుండగులు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్లో ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ చర్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు बरेली में दबंगों ने युवक को स्कूटी के पीछे बांधकर घसीटा ◆ सीसीटीवी में कैद हुई घटना #Bareilly | CCTV Video Bareilly #CrimeNews pic.twitter.com/NhZnCdI9lQ — News24 (@news24tvchannel) July 28, 2023 -
గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత సమన్లు
లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో.. ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్ షాక్ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు. ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం -
రన్నింగ్ రైలు నుంచి నెట్టివేత.. విషమంగా సైనికుడి పరిస్థితి
క్రైమ్: టికెట్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అయితే కోపంతో వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు నెట్టేయడంతో.. భారత సైన్యంలో పని చేసే ఆ వ్యక్తి తన కాలును కోల్పోయాడు. అంతేకాదు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్ బోర్ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన టికెట్ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపం కట్టలు తెంచుకున్న సుపాన్.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు. దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్ బోర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సోనూని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతని కాలిని తొలగించినట్లు తెలుస్తోంది. సోను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మర్డర్ అటెంప్ట్ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుపాన్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏం జరిగిందో పరిశీలిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే -
అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. అంతలోనే
వైరల్: మనిషి జీవితం నీటి బుడగలాగా మారిపోయింది. ఎప్పుడు.. ఎలా ముగుస్తుందో చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మారుతున్న లైఫ్ స్టయిల్‌కు తగ్గట్లే రకరకాల రోగాలు.. కొత్త కొత్త వైరస్లు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. ముఖ్యంగా సడన్ స్ట్రోక్‌లతో ప్రాణాలు పోతున్న ఘటనలు మన కళ్లముందే జరుగుతున్నాయ్. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటన.. వేడుకలో విషాదం నింపింది. ప్రభాత్ ప్రేమి (45).. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. ఉత్తర ప్రదేశ్ బరేలీ ఓ హోటల్లో పార్టీ నిర్వహించారు. మంచి డ్యాన్సర్ అయిన ప్రభాత్.. హుషారుగా బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులేశాడు. అది చూసి అంతా విజిల్స్, గోలతో ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అయితే.. ఉన్నట్లుండి ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. बरेली: खुश दिल इंसान की पल भर में मौत.... ◆डांस करते-करते शख्स अचानक गिरा नीचे, डॉक्टरों ने मृत घोषित किया pic.twitter.com/AIOle7W9BA — News24 (@news24tvchannel) September 2, 2022 అలా కుప్పకూలిపోయి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చాలామంది ఆయనకు సీపీఆర్ లాంటి చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కుప్పకూలిన ప్రభాత్ దగ్గరకు వెళ్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు అంతా. కానీ ఆయనలో చలనం లేదు. పార్టీలో ఉన్న మనీష్ మరో స్నేహితుడు డాక్టర్ వినోద్ పగ్రానీ.. ప్రభాత్‌కు సీపీఆర్, కార్డియాక్ ప్రెజర్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే కార్డియక్ అరెస్ట్‌తో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదీ చదవండి: నిప్పుతో గేమ్స్.. బెడిసి కొట్టడంతో చివరకు.. -
కోతుల దాడి: తండ్రి చేతుల్లోంచి ఎత్తుకెళ్లి మరీ..
లక్నో: ఉత్తర ప్రదేశ్ బరేలీ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలోంచి అతని నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన కోతులు.. భవనం నుంచి కింద పడేశాయి. ఈ దుర్ఘటనలో చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలోని డుంకా ప్రాంతంలో బాధిత కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తి తన బిడ్డను ఎత్తుకుని బిల్డింగ్ పైన నడుస్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు అతనిపై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచి.. బిడ్డను ఎత్తుకెళ్లాయి. సాయం కోసం అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. వాళ్ల మీదా కోతులు దాడికి పాల్పడ్డాయి. పలువురిని కరిచాయి. దీంతో కొందరు రాళ్లు, కర్రలు విసరడంతో గందరగోళంలో ఆ కోతులు బిడ్డను కిందకు విసిరేశాయి. మూడంతస్తుల బిల్డింగ్ కావడంతో బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. నామకరణం వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఇది జరగడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. షాహీ పోలీసులతో పాటు ఈ ఘటనపై స్థానిక అటవీ శాఖ దర్యాప్తు చేపట్టారు. -
UP Election: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి..
లక్నో: బరేలీ కంటోన్మెంట్ సీటుకు సుప్రియా అరోన్ కాంగ్రెస్ నాలుగైదు రోజుల కిందటే ప్రకటించింది. నామినేషన్‌కు సిద్ధమవుతుందని భావిస్తుండగా.. ఆమె అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌కు షాకిచ్చారు. శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అదే స్థానం నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీచేయనున్నారు. జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన సుప్రియా ఆరోన్ బరేలీ మేయర్‌గా పనిచేశారు. ఆమె ఎస్పీలో చేరడంతో బరేలీ నుంచి రాజేశ్ అగర్వాల్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉపసంహరించారు. -
పెళ్లి సంబరాల్లో కాల్పులు.. పదేళ్ల బాలిక మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో జరిపిన కాల్పుల్లో ఓ పదేళ్ల బాలిక మరణించింది. ఫరిదాపూర్‌లోని న్యూ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించి వధూవరుల్లో ఓ వైపు వారు షాజహాన్‌పూర్ నుంచి వచ్చారు. ఆ సమయంలో జరిగిన వేడుకల్లో కొందరు వ్యక్తులు తాగిన మైకంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ మాన్సి అనే బాలికకు తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. బాలిక పెళ్లి కూతురుకు సోదరి అవుతుందని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వైరల్: వరుడి చెంప పగలగొట్టిన వధువు -
ఉద్రిక్తత: రాళ్లు రువ్వుతూ కొట్టుకున్నారు!
-
పావురం కోసం క్రేన్‌తో రంగంలోకి..
-
‘శభాష్ పోలీస్’.. నెటిజన్ల ప్రశంసలు
లక్నో: చైనా మాంజాతో పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో చైనా మాంజ ఎంత ప్రమాదకారో తెలుపుతోంది. సరదాగా గాలిపటాలు ఎగరేయడానికి వాడే ఈ డ్రాగన్ దేశపు మాంజ పక్షులకు ఎన్ని ‘చిక్కులు’ తెచ్చిపెడతాయో చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చైనా మాంజలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఓ పావురాన్ని పోలీసులు రక్షించారు. మాంజలో చిక్కుకుని ప్రాణాపాయంలో పడిన పావురాన్ని గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు క్రేన్‌ను రప్పించి పావురాన్ని మాంజ నుంచి విడిపించారు. దానికి స్వల్ప గాయాలు కాగా దగ్గరుండి చికిత్స చేయించి వదిలేశారు. దీంతో స్థానికులు పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ రమేశ్ పాండే మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో ‘శభాష్! పోలీస్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (వైరల్: అచ్చంగా వాటిలాగానే కేకులు!) -
తండ్రి బట్టలకు రక్తం: లోపలికెళ్లి చూస్తే!..
లక్నో : మద్యం మత్తు పైగా క్షణికావేశం.. భార్యను హత్య చేశాడో భర్త. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరేలీకి చెందిన అజయ్‌కి పింకీ అనే మహిళతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గతకొద్ది సంవత్సరాలుగా వీరు పింకీ పుట్టింటి వద్ద ఉంటున్నారు. గురువారం ఫుల్లుగా మద్యం సేవించిన అజయ్ భార్యతో గొడవపడ్డాడు. గొడవ పెద్దదవటంతో ఆమెను గదిలోకి లాక్కెళ్లి తలుపు గడియ బిగించేశాడు. ఆమె నోటిలో గుడ్డకుక్కి దాడికి దిగాడు. కత్తితో ఆమె గుండెల్లో పొడిచి, ఇటుకతో తలపై కొట్టాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ( అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణం ) ఆ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న వారి ఇద్దరి పిల్లలు తండ్రి ఆవేశంగా వెళ్లిపోవటం, అతడి బట్టలకు రక్తపు మరకలు ఉండటం గమనించారు. అనుమానంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగా తల్లి మరణించి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న అజయ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే పింకీ, అజయ్‌ల మధ్య ప్రాణాలు తీసుకునేంత గొడవలేమీ లేవని మృతురాలి తండ్రి ద్రిగ్‌పాల్ చెబుతుండటం గమనార్హం. -
కరోనా భయం: వరుస ఆత్మహత్యలు
లక్నో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భయంతో దేశంలో బలవన్మరణాలకు పాల్పుడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ భయంతో ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సహరన్‌పూర్‌లోని ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కార్యాలయంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనావైరస్ సోకుతుందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు అతడు సూసైడ్ నోట్లో రాసినట్టు సీనియర్ ఎస్పీ పి. దినేశ్‌కుమార్ వెల్లడించారు. చాలా కాలంగా అతడు కుంగుబాటు సమస్యతో బాధ పడుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఒకరు షామిలి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక ఆస్పత్రి క్వారంటైన్ వార్డులో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్ జస్జీత్ కౌర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. (కరోనా: 93 వేల మంది ప్రాణాలకు ముప్పు) క్వారంటైన్ నుంచి తప్పించుకున్న 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లఖిమ్‌పూర్‌లో జరిగింది. గురుగ్రామ్ నుంచి మార్చి 28న తిరిగొచ్చిన యువకుడిని క్వారంటైన్లో ఉంచారు. అక్కడి నుంచి రెండుసార్లు తప్పించుకుని కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రయత్నించాడు. రెండు పర్యాయాలు పోలీసులు అతడిని నిలువరించారు. మరోసారి తప్పించుకుని తన గ్రామానికి వెళ్లాడు. అయితే తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జ్వరం, జలుబుతో బాధ పడుతున్న రైతు ఒకరు మంగళవారం మధురకు సమీపంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గ్రామం కరోనా బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 24న కాన్పూర్‌లో మరో యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. హాపూర్, బరేలీ ప్రాంతాల్లో మరో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. (కరోనా నుంచి తనను తాను కాపాడుకోలేడు) -
వలస కార్మికులపై బ్లీచ్ స్ప్రే
లక్నో/బరేలీ: లాక్డౌన్ కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులపై ప్రభుత్వయంత్రాంగాల నిర్లక్ష్య ధోరణికి తాజా ఉదాహరణ ఇది. భార్యాపిల్లలతో కలిసి వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తున్న బడుగు జీవులపై పారిశుధ్య సిబ్బంది కనికరం లేకుండా క్లోరిన్ నీటిని స్ప్రే చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ, నోయిడాల్లో పనులు చేసుకునే షాజహాన్‌పూర్ తదితర ప్రాంతాలకు చెందిన 50 మంది వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా కుటుంబాలతోపాటు కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. సోమవారం ఉదయం బరేలీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కొందరు మున్సిపల్ సిబ్బంది వారి వద్దకు వచ్చారు. కరోనా వైరస్‌ను చంపే మందు స్ప్రే చేస్తామని, ఆ తర్వాత భోజనం పెట్టి, సొంతూళ్లకు బస్సుల్లో తీసుకెళతామని నమ్మ బలికారు. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి బ్లీచింగ్ నీటిని వారిపైకి నిలువెల్లా తడిచిపోయేలా స్ప్రే చేశారు. దీంతో చిన్నారులు కళ్ల మంటలతో రోదించగా, పురుషులు, మహిళలు ఒళ్లంతా దురదతో ఇబ్బందిపడ్డారు. తడి దుస్తులతోనే వారంతా తిరిగి కాలినడక సాగించారు. కాగా, బడుగు జీవుల పట్ల మున్సిపల్ సిబ్బంది చూపిన కాఠిన్యంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ‘వలస కార్మికులపై రసాయనాలు స్ప్రే చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందా? కార్మికులు పడిన యాతనలకు ఏం చికిత్స చేయించారు? స్ప్రే కారణంగా దుస్తులు తడిచిన వారికి ఏర్పాట్లు చేశారా? పాడైపోయిన వారి ఆహార పదార్థాలకు బదులుగా ఏం సమకూర్చారు?’అంటూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై జిల్లా మేజిస్ట్రేట్ నితీశ్‡ స్పందించారు. స్థానిక సిబ్బంది చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. ‘వలస కార్మికులు ప్రయాణించే బస్సులను శానిటైజ్ చేయాలని మాత్రమే ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బాధితులకు అవసరమైన వైద్యం చేయిస్తాం’ అని వివరణ ఇచ్చారు. కాగా, లాండ్రీల్లో వాడే బ్లీచ్‌లో సోడియం హైపోక్లోరైట్ ఉంటుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. -
ఇది అమానవీయ చర్య: ప్రియాంక
-
షాకింగ్ వీడియో: కళ్లు మూసుకోండి అంటూ..
లక్నో: ‘‘మీ కళ్లు మూసుకోండి. పిల్లల కళ్లు కూడా మూయండి’’ అంటూ వలస కూలీలపై రసాయనాలు వెదజల్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కూలీలు పట్టణాల నుంచి స్వస్థలాలకు పయనమవుతున్నారు. చిన్నా పెద్దా.. అంతా కాలి నడకన ఇంటి బాట పడుతున్నారు.(కరోనా: గుడ్‌న్యూస్ చెప్పిన జర్నలిస్టు) ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొంత మంది వలస కూలీలు బరేలీ జిల్లాకు చేరుకున్నారు. అయితే వారు బస్సు నుంచి దిగగానే అధికారులు అందరినీ ఒక్కచోట చేర్చి పైపులతో వారిపై రసాయన ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘మనమంతా కరోనాపై పోరాడుతున్నాం. అయితే ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటం మంచిది కాదు. ఇప్పటికే ఆ కార్మికులు ఎంతో బాధ అనుభవించి ఉన్నారు. వారిపై రసాయనాలు చల్లకండి. ఇవి వాళ్లను రక్షించకపోగా... మరింత హాని చేస్తాయి’’అని ట్వీట్ చేశారు. (వైరస్ ప్లాస్టిక్‌పైన 72 గంటలు బతుకుతుంది) అదే విధంగా బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి సైతం అధికారుల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విమర్శలపై స్పందించిన బరేలీ జిల్లా మెజిస్ట్రేట్... బస్సులను మాత్రమే శుభ్రం చేయమని ఆదేశించామని.. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. అధికారులకు తెలియకుండా ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వలస కూలీలపై క్లోరిన్, నీళ్లు మాత్రమే చల్లారని వివరణ ఇచ్చారు. -
టిక్‌టాక్ చేసే ప్రయత్నంలో..
లక్నో : టిక్‌టాక్ మైకంలో పడి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తుపాకీతో టిక్‌టాక్ చేద్దామనుకున్న బరేలీకి చెందిన కేశవ్ కుమార్ (18) ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన హఫీజ్‌గంజ్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడి తల్లి ప్రకారం.. ‘ఇంటర్మీడియట్ చదువుతున్న కేశవ్‌కుమార్ కాలేజీ నుంచి రాగానే.. టిక్‌టాక్ చేసుకుంటా... లైసెన్స్డ్ గన్ ఇవ్వమన్నాడు. నేనప్పుడు వంట చేస్తున్నాను. తుపాకీ ఇవ్వనని వారించాను. కానీ, కేశవ్ వినలేదు. నేను వంట పనిలో బిజీగా ఉండటంతో కేశవ్‌కు తుపాకీ ఇచ్చి మళ్లీ పనిలోపడ్డాను. కానీ, కొద్ది క్షణాల్లోనే తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. వెంటనే నా కొడుకు పడక గదిలోకి వచ్చి చూశా. కేశవ్ రక్తపు మడుగులో పడున్నాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ, లాభం లేకపోయింది. అప్పటికే నా బిడ్డ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు’ అని సావిత్రి దేవి కన్నీరుమున్నీరయ్యారు. కేశవ్ బెడ్రూమ్లో తుపాకీని భుజంపై పెట్టుకుని పోజిస్తున్న జవాన్ ఫొటో ఉందని ఆమె తెలిపారు. ఆ ఫొటోలో మాదిరిగా టిక్‌టాక్ చేద్దామనుకునే కేశవ్ చనిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. తుపాకీ లోడ్ చేసి ఉన్నది గమనించలేదని సావిత్రి పోలీసులకు తెలిపారు. కేశవ్ గతంలో కూడా తుపాకీతో పలు టిక్‌టాక్ వీడియోలు తీశాడని ఆమె వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తుపాకీ సావిత్రి పేరున రిజిస్టరై ఉందని వెల్లడించారు. ఇదిలాఉండగా.. కేశవ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి అతని కుటంబ సభ్యులు అంగీకరించకపోవడం గమనార్హం. కేశవ్ తండ్రి వీరేంద్ర కుమార్ ఆర్మీ అధికారిగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో పనిచేస్తున్నాడు. -
మైనర్ బాలిక ‘అమ్మ’ అయింది.. బిడ్డను వదిలేసింది
బారెల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. సమాజంలో పరువు పోతుందని నవజాత శిశువును ఆస్పత్రిలోనే వదిలి వెళ్లేందుకు యత్నిచింది. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శిశువుకు ఎలాంటి హానీ కలగలేదు. ఈ ఘటన యూపీలోని బారెల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు. ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని, బిడ్డ పుట్టిందని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని శిశువును అక్కడే వదిలి వేళ్లేందుకు ప్రయత్నించింది సదరు మైనర్ బాలిక. బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి తండ్రితో కలిసి బయటకు వెళ్లేందుకు యత్నిచింది. గమనించిన ఆస్పత్రి సిబ్బంది వారిని బందించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలిక తండ్రిని విచారించారు. అయితే కూతురు గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని, కడుపు నొప్పి అని ఆస్పత్రికి తీసుకొచ్చానని బాలిక తండ్రి వివరించారు. బాలికను విచారించగా.. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆ బిడ్డను తీసుకెళ్లనని తేల్చి చెప్పింది. శిశు సంక్షేమ కమిటీ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినా.. బాలిక తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ ఘటనపై శిశు సంక్షేమ కమిటీ సభ్యులు డీఎన్ శర్మ మాట్లాడుతూ... తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సమాజంలో పరువుపోతుందని బిడ్డను తీసుకెళ్లడం లేదని బాలిక చెబుతోంది. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తాను మారడం లేదు. బిడ్డను తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే రెండు నెలల తర్వాత మేమే శిశు సంక్షేమ సెంటర్‌కి తీసుకెళ్తాం. కావాల్సిన వారికి దత్తత ఇస్తాం’ అని పేర్కొంది. -
కట్నం కోసం.. అత్త ముక్కు కొరికి, చెవులు కోసి..
బెరోలి: కట్నం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. పైసా ఉంటేనే బంధాలని చెప్తూ మానవ సంబంధాలకు నీళ్లొదులుతున్నారు. మనుషులం అన్న భావన మరిచి రాక్షసులుగా మారుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఆదివారం జరిగిన అమానుష ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్‌సీఐ ఉద్యోగి రెహమాన్ తన కుమార్తె చాంద్ బీను.. వ్యాపారి మహమ్మద్ అష్ఫఖ్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. కట్నంగా రూ.10 లక్షలు వరుడి కుటుంబానికి ముట్టజెప్పాడు. వారి పెళ్లి జరిగి సంవత్సరం కావస్తోంది. చాంద్‌బీకి కూతురు పుట్టిన క్రమంలో అష్ఫఖ్ కుటుంబం మరో రూ.5 లక్షలు తీసుకురావాలని వేధించసాగారు. దీంతో చాంద్‌బీ అత్తింటి వేధింపులను తండ్రికి చెప్పుకుంది. అయితే అదనపు కట్నం ఇచ్చేందుకు రెహమాన్ నిరాకరించాడు. దీంతో అడిగిన కట్నం తీసుకురాలేదని కోపంతో ఊగిపోయిన అష్ఫఖ్ భార్యపై దాడి చేసి చిత్రహింసలు పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు అష్ఫఖ్ కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. గొడవ కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారింది. అయితే ఆ ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన చాంద్ బీ తల్లి గుల్షన్‌పై అష్ఫఖ్ కుటుంబం దాడి చేసింది. అష్ఫఖ్ అత్త ముక్కును కొరకగా, అతని తండ్రి కత్తితో ఆమె చెవి కోశాడు. రక్తం ధారలు కట్టడంతో భయపడిపోయిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి రాక్షస చర్యతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాగా గాయపడిన మహిళను పరీక్షించిన జిల్లా వైద్యులు బాధితురాలిని సర్జరీ నిమిత్తం ఢిల్లీకి తరలించాలని సూచించారు. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. -
చిన్నారి ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి లోకం తెలియని ఓ నాలుగు రోజుల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిచారక ఘటన బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. జూన్ 15న జన్మించిన ఆ చిన్నారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు బరేలీలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోని వైద్యులు చికిత్స చేయకుండా 3 గంటల పాటు ఈ వార్డు.. ఆ వార్డంటూ కాలయాపన చేయడంతో ఆ పాప మరణించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరిండెంట్(సీఎంస్) డాక్టర్ కమలేంద్ర స్వరూప్ గుప్తాను సస్పెండ్ చేశారు. అదే విధంగా మహిళా విభాగం చీఫ్ సూపరిండెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యుల నిర్లక్ష్యమే చిన్నారి ప్రాణం తీసిందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని, మొత్తం 7,348 ప్రభుత్వ వైద్యుల కొరత ఉందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సిద్ధేంద్రనాథ్ సింగ్ తెలిపారు. -
భర్త నల్లగా ఉన్నాడని తగలెట్టేసింది!
లక్నో : ఉత్తరప్రదేశ్, బరేలిలో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య పెట్రోల్‌పోసి తగలెట్టేసింది. ఈ అమానుష ఘటన గత సోమవారం జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. బరేలిలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల కిత్రమం పెళ్లైంది. వీరిద్దరికి సంతానంగా 5 నెలల పాప ఉంది. చూడటానికి అందంగా ఉండే ప్రేమ్ శ్రీ తన భర్త సత్యవీర్ సింగ్ నల్లగా ఉన్నాడని బాధపడేది. ఎప్పుడు అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవపడేది. ఇదంతా మాములేనని కుటుంబసభ్యులు భావించగా.. ప్రేమ్‌శ్రీ వారు ఊహించని ఘాతుకానికి పాల్పడింది. తన భర్త నల్లగుండటం తట్టుకోలేక.. నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. దీంతో తీవ్రగాయాలైన సత్యవీర్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు హర్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రేమ్‌శ్రీ కాళ్లకు కూడా గాయాలయ్యాయి. -
బొమ్మతుపాకా అని అడిగినందుకు..
బరేలీ(యూపీ) : బొమ్మతుపాకో లేక నిజమైన తుపాకో తెలుసుకోవాలనుకున్న కామిని అనే పదేళ్ల బాలికపై విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సంబాల్ జిల్లాలోని కుర్ ఫతేఘర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాల్తా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి అజయ్ పాల్ మౌర్య , అతని భార్య తమ వ్యవసాయ భూమిలో పని చేసుకుంటుండగా వారి కూతరు కామిని, కుమారుడు దగ్గరల్లోని గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో అటుగా వెళ్తున్నాడు. కామిని అతన్ని చూసి బొమ్మ తుపాకా అడగడంతో సదరు వ్యక్తి కోపంతో ఊగిపోయి బాలికపై కాల్పులు జరిపాడు. తాను అక్కడికి చేరుకునే లోపలే బుల్లెట్ గాయాలతో కామిని కిందపడిపోయిందని, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని అజయ్ తెలిపారు. బాలిక చేతు, పొట్టలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వలపన్ని నిందితుడు విద్యా రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
‘మాకేం తెలీదు.. ఎలుకలే తాగాయి’
లక్నో : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు పోలీసులు. కొన్ని రోజుల తర్వాత చూడగా ఖాళీ బాటిల్లు పోలీసులను వెక్కిరిస్తూ కనిపించాయి. స్టోర్ రూమ్‌లో భద్రపరిచిన మద్యం మాయమవడం కంటే.. దానికి పోలీసులు చెప్పిన కారణం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టోర్ రూమ్‌లో దాచిన మద్యాన్ని ఎలుకలు తాగాయంటున్నారు పోలీసులు. అది కూడా దాదాపు 1000 లీటర్ల మద్యాన్ని. మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం అంటూ తేల్చారు పోలీసులు. బరేలీ కంటోన్మేంట్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. పిచ్చికుక్క ఒకటి పోలీస్ స్టేషన్ స్టోర్ రూమ్‌లో దూరింది. బయటకు వచ్చే దారిలేక అక్కడే మరణించింది. కొన్ని రోజుల తర్వాత స్టోర్ రూమ్ నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో స్టోర్ రూమ్‌ని తెరిచారు. ఆ సమయంలో సీజ్ చేసి అక్కడ భద్రపరిచిన అక్రమ మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. ఆ పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. దాంతో ఎలుకలే మద్యం తాగాయని తేల్చారు పోలీసులు. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్ హెడ్ క్లర్క్ నరేష్ పాల్ మాట్లాడుతూ.. ‘నేను తలుపులు ఓపెన్ చేసినప్పుడు అక్కడ కొన్ని మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. వాటి పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఎలుకల పనే’ అన్నారు. అయితే పోలీసులు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేకపోవడానికి కారణం మాయమయ్యింది లీటరో.. రెండు లీటర్లో కాదు ఏకంగా వెయ్యి లీటర్ల మద్యం. దాంతో డిపార్ట్మెంట్లోని వారే మద్యం బాటిళ్లను స్వాహా చేసి ఎలుకల మీద తోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఓ రిటైర్డ్ జువాలజీ ప్రొఫేసర్ మాట్లాడుతూ.. నీరు దొరకనప్పుడు ఎలుకలు మద్యాన్ని తాగుతాయి. అయితే పోలీసులు చెప్పినంత భారీ మొత్తంలో మాత్రం తాగలేవు అన్నారు. గతంలో బిహార్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పోలీసులు సీజ్ చేసిన అక్రమ మద్యం మాయమయ్యింది. అప్పుడు బిహార్ పోలీసులు కూడా ఎలుకలే మద్యం తాగాయని ఆరోపించారు. -
కూతురిని గొలుసుతో బంధించిన తండ్రి
లక్నో : తన కూతురు ఓ యువకుడితో చనువుగా ఉంటోందని అనుమానించిన తండ్రి బాలిక (17) కాళ్లకు ఇనుప గొలుసు కట్టి ఇంట్లో బంధించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో శనివారం చోటుచేసుకుంది. తన తండ్రి గత మూడు రోజులుగా ఇనుస గొలుసుతో కట్టేసి ఇంట్లో బంధించాడని సమీపంలో మీర్గంజ్ పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. తాను ఓ యువకుడితో స్నేహం చేస్తున్నాని, తన తల్లిదండ్రులు, సోదరులు కలిసి తన ఇంట్లో బంధించారని ఫిర్యాదులో పేర్కొంది. అర్థరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో తప్పించుకుని వచ్చి పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని శనివారం అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను అక్రమంగా నిర్భందించారని ఐపీసీ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను మహిళ కానిస్టేబుల్ సహాయంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె మేజర్ అయ్యే వరకు బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంటుందని అధికారులు తెలిపారు. బాలిక ఆరోపణలపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బరేలీ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వెల్లడించారు. -
విడాకులు ఇవ్వలేదన్న కోపంతో..
లక్నో: చపాతిని ఎక్కువగా కాల్చిందన్న కారణంతో ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు తలాక్ చెప్పి, ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహూబ జిల్లాలో చోటుచేసుకుంది. చపాతి ఎక్కువగా కాల్చానన్న కారణంతో రెండు రోజుల క్రితం తన భర్త తలాక్ చెప్పాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన శరీరంపై సిగరెట్లతో కాల్చి గాయలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా యూపీలో ట్రిపుల్ తలాక్‌కు మరో ముస్లిం యువతి బలైంది. విడాకులు ఇవ్వలేదన్న కోపంతో భార్యకు భోజనం పెట్టకుండా నెల రోజులు గదిలో బంధించాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో చికిత్స తీసుకుంటు ఆమె మంగళవారం మృతి చెందిందని రాయ్‌బరేలి పోలీసులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని గత ఏడాది ఆగస్ట్ 22న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తోందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ట్రిపుల్ తలాక్ హరిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినా రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో ప్రస్తుతం బిల్లు చట్టరూపం దాల్చలేదు. Woman from Mahoba's Charkari alleges her husband gave her triple talaq; says, 'I served him food & he refused to eat roti saying it's burnt. He later beat me up, said 'I'm not happy with you', & gave me talaq. I want justice'. Police say, 'probe underway, action will be taken' pic.twitter.com/1aVAnBW2ge — ANI UP (@ANINewsUP) July 11, 2018 -
భర్త అచేతనావస్థ.. భార్యకు గుండెకోత
బరేలీ : ప్రమాదంలో భర్త అచేతన స్థితిలో మంచానికే పరిమితమై ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువైపోవటంతో పూట గడవటం కష్టంగా మారిపోయింది. గర్భవతి అయినప్పటికీ భార్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. ఇక ఒక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత భర్త చికిత్స కోసం ఆ తల్లి త్యాగానికి సిద్ధపడింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని హకీజంగల్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన కదిలించివేస్తోంది. వివరాల్లోకి హరస్వరూప్ మౌర్య అనే వ్యక్తి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేసేవాడు. గత అక్టోబర్‌లో గోడ కూలి అతనిపై పడి నడుం చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి అతను కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన అతని భార్య కష్టం మీద కూలీ పనులకు వెళ్లింది. డిసెంబర్ 14న ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. భర్త చికిత్స కోసం తన బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకుంది. భార్య చేసే పనికి ముందు భర్త అడ్డుచెప్పినప్పటికీ.. చివరకు అతన్ని ఆమె ఒప్పించింది. ఓ మధ్యవర్తి సాయంతో పొరుగు గ్రామంలోని ఓ జంటకు బిడ్డను అమ్మి.. అలా అమ్మగా వచ్చిన 45,000 రూపాయలతో భర్తకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయించింది. ఇంతలో బంధువులు ఆమెను నిలదీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం సాయం చేయలేదు : మహిళ సాయం కోసం బంధవుల వద్ద చెయ్యి చాస్తే ఒక్కరూ స్పందించలేదు. రెండు నెలలపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాం. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం హామీ పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీస స్పందన లేకుండా పోయింది. నా భర్త ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తనకు ఇంతకు మించి మార్గం కనిపించలేదు అని ఆమె చెబుతోంది. ఇప్పటికే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. వారి పోషణ కష్టంగా మారిందని.. అందుకే భర్తను మాములు మనిషిని చేసేందుకు ఈ పని చేసినట్లు ఆమె వివరించారు. ఇక ఈ అంశంపై స్పందించేందుకు సీఎం కార్యాలయం సిబ్బంది సుముఖత వ్యక్తం చేయటం లేదు. -
క్షమాపణ కోరిన ప్రియాంక.. ఎందుకంటే?
సాక్షి, న్యూఢిల్లీ: 'నన్ను క్షమించండి..' అంటూ ఉత్తరప్రదేశ్, బరేలీ ప్రజలను కోరారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. అదేంటి.. బరేలీ వాసులకు నటి క్షమాపణ ఎందుకు చెప్పారనేగా మీ సందేహం. ఆ వివరాలిలా.. బరేలీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకను విశిష్ట అతిథిగా ఆహ్వానించగా, కచ్చితంగా హాజరవుతానని ఆమె మాటిచ్చారు. నటి రానుందని బరేలీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అలంకరించారు. ఆమెను చూడాలని వర్సిటీ విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు ప్రియాంక కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే ప్రియాంక ఈవెంట్‌కు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఢిల్లీలో దట్టమైన పొగ, పొగమంచు కారణంగా తాను ఈవెంట్‌కు హాజరు కాలేకపోయానని, సోషల్ మీడియా ద్వారా క్షమాపణ కోరారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ కాలేదని వాతావరణం అనుకూలించలేదన్న ప్రియాంక.. బరేలీ వర్సిటీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు. -
ప్రియాంకకు షాక్..
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్వస్థలమైన బరేలీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. బరేలీలో నివసించడం లేదని ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా పేర్లను ఓటర్ లిస్టు నుంచి బుధవారం తొలగించారు. ప్రియాంక మిస్ వరల్డ్‌గా ఎంపికైనప్పుడే వారి కుటుంబం బరేలీ నుంచి ముంబైకి వలస వెళ్లిందని, సుమారు 17 ఏళ్ల నుంచి వారి ఇంటికి తాళం వేసుండటంతోనే ఓటర్ లిస్టు నుంచి తొలిగించామని జిల్లా మెజీస్ట్రిక్ అధికారి కెప్టెన్ ఆర్ విక్రమ్ సింగ్ మీడియాకు తెలిపారు. బరేలీ 50వ వార్డులో వీరికి ఓటు హక్కు ఉందని, ఇక్కడ నివసించడం లేదని ఓ స్థానిక నివాసి బ్లాక్ లెవల్ ఆఫిసర్‌కు ఫిర్యాదు చేశారని డీఎం చెప్పారు. బీఎల్ఓ ఆఫీసర్ ఆదేశాలతోనే వారి పేర్లు తొలిగించామన్నారు. ఇక ప్రియాంక తండ్రి కల్నల్ అశోక్ చోప్రా 2012లోనే బరేలీలో నివసించడం లేదనే విషయాన్ని జిల్లా అధికారులు తెలియజేశాడని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే ప్రియాంక ఫ్యామిలీకి ముంబైలో ఓటు హక్కు ఉందో లేదో అనే విషయం తెలియరాలేదు. -
ఘోర ప్రమాదం: 22 మంది మృతి
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బరేలీ సమీపంలో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 22 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంక్ పగలడంతో.. రెండు వాహనాలకు మంటలంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మంటలు బస్సులోకి వ్యాపించడంతో.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్షతగాత్రులను జిల్లా అసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢిల్లీ నుంచి తూర్పు యూపిలోని గోండా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. -
‘నా భర్తను వదులుకోను.. పీఎం వద్దకైనా వెళ్తా’
బరేలీ: తలాక్ విధానం తన జీవితాన్ని ఎలా ప్రశ్నార్థకం చేసిందో ఓ యువతి వివరించింది. గడిచిన పన్నెండేళ్లలో మూడుసార్లు ఇప్పటికే తలాక్ వేటును ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు ఉన్న భర్త కూడా ఎక్కడ తలాక్ చెప్పేస్తాడో అని భయపడిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే తన జీవితం తనకు ఓ పీడకలగా ఉందంటూ వాపోయింది. తారాఖాన్ (35) మహిళది ఉత్తర ప్రదేశ్. ఆమె ఒక నిరక్షరాస్యురాలు. జహీద్ ఖాన్ అనే వ్యక్తితో వివాహం అయింది. అతడిది బరేలీలోని తహకా నగారియా అనే గ్రామం. అయితే, పెళ్లయిన ఏడేళ్లకు కూడా వారికి సంతానం లేదు. దీంతో ఆ వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకొని తారాకు తలాక్ చెప్పేశాడు. దీంతో ఆమెకు మరో సంబంధం చూసి పప్పుఖాన్ అనే వ్యక్తితో వివాహం చేశారు. ‘పప్పు నన్ను తీవ్రంగా హింసించేవాడు. ఒకసారి ఇలాగే చేస్తుంటే అడ్డుకున్నాను. దీంతో అనకూడని మాటలని బాగా కొట్టాడు’ అని చెప్పింది. ఇలా రెండో వివాహం కూడా మూడేళ్లలోనే ముగిసిపోయిందని చెప్పింది. తన మేనమామ ఇంటికెళ్లిన తర్వాత నచ్చజెప్పి మూడోసారి సోనూ అనే వ్యక్తితో వివాహం జరిపించారని కానీ, కాలక్రమంలో అతడు కూడా అంతకుముందు వివాహం చేసుకున్నవారికంటే దారుణంగా మారి చిత్రహింసలు పెట్టే భర్తగా మారాడని వాపోయింది. ఒక రోజు బాగా కొట్టి తిరిగి తన మామయ్యవాళ్లింటికి తీసుకొచ్చి మూడుసార్లు తలాక్ అని చెప్పేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. మూడో వివాహం నాలుగు నెలలు మాత్రమే నిలిచిందని చెప్పింది. అయితే, మరోసారి తన కుటుంబం సర్ది చెప్పి షంషాద్ అనే వ్యక్తితో నాలుగో వివాహం చేసినట్లు తెలిపింది. అయితే, అతడు కూడా తనను ఎక్కడ వదిలేస్తాడోనని భయంగా ఉందని, వాస్తవానికి ఈ పన్నెండేళ్లలో తాను ఏ తప్పు చేయకపోయినా ఇలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నానని వాపోయింది. శంషాద్ కూడా గత మాజీ భర్తల మాదిరిగా చేస్తే ఎక్కడికి వెళ్లాలో అర్ధం కానీ పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమ మధ్య కూడా చిన్న సమస్యలు మొదలయ్యాయని దీంతో పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్‌కు వెళుతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తాను అవసరం అయితే, ప్రధాని నరేంద్రమోదీకి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు తెలియజేయాలనుకుంటున్నట్లు వాపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లిని మాత్రం కాపాడుకుంటానని చెప్పింది. -
యూపీలో బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
-
హైవేపై ప్రమాదం: ఆరుగురి దుర్మరణం
-
హైవేపై ప్రమాదం: ఆరుగురి దుర్మరణం
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వద్ద నంబర్ 24 జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వేగంగా దూసుకొచ్చిన బస్సు.. అదుపు కోల్పోయి, రోడ్డు పక్కగా నిలిచి ఉన్న మరో బస్సును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. -
రేప్ చేశాడు.. పుట్టిన పాపనూ అమ్మేశాడు!
బరేలి: యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు.. పెద్దల ఒత్తిడితో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పుట్టిన బిడ్డను పాతిక వేలకు అమ్మేసి, ఆమెను మరో ముసలాడికిచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసు వివరాలు ఇలాఉన్నాయి.. కుట్టు మిషన్ సామాగ్రి అమ్మే షవీజ్ అనే యువకుడికి 2013లో దర్జీగా పనిచేస్తోన్న ఓ యువతి పరిచయమైంది. దారాలు, సూదుల కోసం షాపునకు వచ్చే ఆ యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్న షవీజ్.. పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా ఆమె గర్భం దాల్చిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీంతో యువతి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమైంది. అయితే ఊరిపెద్దల జోక్యంతో చివరికి షవీజ్.. ఆ అమ్మాయినే పెళ్లిచేసుకున్నాడు. కొద్ది కాలానికి పాప పుట్టింది. ఎలాగౌనాసరే భార్యాపిల్లల్ని ఒదిలించుకోవాలనుకున్న షవీజ్.. పుట్టిన పాపాయిని.. పిల్లలు లేని ఓ జంటకు రూ.25 వేలకు అమ్మేశాడు. ఇక భార్యను.. అప్పటికే ఏడుగురు సంతానం ఉండి, మొదటి భార్య చనిపోయిన ఓ వక్తికి ఇచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా అతని చెరనుంచి తప్పించుకుని పుట్టింటికి వచ్చిన ఆ యువతి ఆదివారం బరేలీ పోలసు ఉన్నతాధికులకు ఫిర్యాదుచేసింది. భర్త, అతని కుటుంబ సభ్యులను శిక్షించాలని, తన పాపను తిరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకుంది. ఈ కేసుపై డీఐజీ అసుతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సీఐని దర్యాప్తు అధికారిగా నియమించామని, అన్ని కోణాల్లో వాస్తవాలను పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కేవలం సమోస కోసం సవతి తల్లి..!
బరేలి(ఉత్తరప్రదేశ్): బడి నుంచి ఆకలితో ఇంటికొచ్చిన ఆ చిన్నారిని 'సమోసల' గొడవ బలితీసుకుంది. ఆకలితో ఉన్న అతను సమోసాలన్నింటినీ తానే తినేయడంతో విచక్షణ కోల్పోయిన సవతి తల్లి అతన్ని గొంతు నులిమి చంపేసింది. ఈ కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలోని కౌంటాండ గ్రామంలో జరిగింది. షాహీద్ ఆలీ మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు. అతని ఆరేళ్ల కొడుకు పాఠశాల నుంచి తిరిగొచ్చి.. అన్నం పెట్టాల్సిందిగా సవతి తల్లిని కోరాడు. ఆ చిన్నారికి ఆమె కొంత డబ్బు ఇచ్చి.. సమీపంలోని దుకాణంలో సమోసాలు తీసుకురమ్మని పంపింది. అయితే, ఆకలితో ఉన్న ఆ బాలుడు సమోసాలు ఇంటికి తీసుకురాకుండా.. అన్నీ తానే తినేశాడు. దీంతో కోపంలో విచక్షణ కోల్పోయిన ఆమె చిన్నారిని గొంతు నులిమి చంపేసింది. ఇంటికి వచ్చి జరిగిన కొడుకు చనిపోయిన విషయాన్ని గుర్తించిన షాహిద్ ఆలీ పోలీసులకు ఫిర్యాడు చేశాడు. దీంతో నిందితురాలైన సవతి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
అది తల్లా? రాక్షసా?
-
‘కాన్పు కోసం వెళితే కిడ్నీ కాజేశారు’
బారీల్లి: రోగులకు తెలియకుండా మూత్రపిండాలు దొంగిలిస్తున్న ఉదంతాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని బారీల్లి నగరంలో వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళితే తన కిడ్నీ కాజేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణి అనే మహిళ ప్రసవం కోసం మార్చి నెలలో రోహిత్ అగ్నిహోత్రి ఆస్పత్రిలో చేరింది. తన కిడ్నీ తొలగించినట్టు డిశ్చార్జి అయిన గుర్తించానని పోలీసులకు తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యజమాని డాక్టర్ సుష్మా అగ్నిహోత్రి తోసిపుచ్చారు. 30 నిమిషాలు ఆపరేషన్ లో కిడ్నీ తొలగించడం అసాధ్యమని అన్నారు. నారాయణి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకోలేదని, కాన్పుకు ముందు ఆమెకు రెండు కిడ్నీలు ఉన్నట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇదంతా తమ ప్రత్యర్థుల కుట్రని సుష్మ ఆరోపించారు. పోలీసులు ఈ కేసును చీఫ్ మెడికల్ అధికారికి నివేదించారు. -
టీచర్ పై గ్యాంగ్ రేప్
లక్నో: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన మరకముందే ఉత్తరప్రదేశ్ లో మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బరేలిలోని 24వ హైవేకు సమీపంలో మంగళవారం జరిగింది. పాఠశాలకు వెళుతున్న టీచర్ ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఈ దురాగతాన్ని వీడియో తీశారు. దీని గురించి ఎక్కడైనా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాధితురాలిని బెదిరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేశ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. -
ఎయిడ్స్ వచ్చిందని చెప్పని భర్తను..
బరేలీ: హెచ్ఐవీ ఉందనే కారణంతో అత్తమామలు అతడి భార్యతో కుట్ర చేసి హత్య చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఖమారియా అనే గ్రామనికి చెందిన వ్యక్తికి అట్టాపట్టి అనే గ్రామానికి అమ్మాయితో 2013లో వివాహం అయింది. ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్న అతడు ఏడాదిన్నర కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి తన అత్తమామల ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. వాస్తవానికి అతడికి ఆ సమయంలో ఎయిడ్స్ సోకింది. అయితే, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. ఎవరికీ తెలియకుండా భోజిపురాలోని యాంటీ రిట్రో వైరల్ థెరపీ కేంద్రానికి వెళ్లి అక్కడే ఉండి థెరపీ పూర్తి చేసుకున్నాడు. థెరపీ సెషన్ పూర్తయ్యాక తిరిగి అత్తగారింటికి వెళ్లాడు. ఈ లోగా ఇంట్లో వాళ్లకు అతడికి ఎయిడ్స్ సోకిందని తెలిసింది. దీంతో అతడిని ఎవరికీ తెలియకుండా చంపేశారు. ఎలా చనిపోయాడని చెబితే సరైన కారణాలను గ్రామస్తులకు చెప్పలేకపోయారు. పైగా శరవేగంగా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పూనుకోగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించగా అసలు విషయం తెలిసింది. -
నిర్భయ తరహాలో మరో దారుణం
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో నిర్భయ తరహాలో మరో దారుణం జరిగింది. యూపీలోని బరేలీలో దళిత బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగులు 12 ఏళ్ల బాలికపై అమానుషానికి పాల్పడి హతమార్చారు. దారుణంగా హింసించి, ఢిల్లీ నిర్భయ తరహాలో అఘాయిత్యానికి పాల్పడిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
'బదౌన్' రేప్ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్
బరేలీ: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో కానిస్టేబుల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో నిందితుడిగా ఉన్న వీరపాల్ యాదవ్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంతకుముందు అవినిష్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న ఇంటి నుంచి బయటకు వచ్చిన 14 ఏళ్ల బాలికపై వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను మూసాజాగ్ పోలీసు స్టేషన్లోకి లాక్కెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. -
కూలిన ఆర్మీ చాపర్, ముగ్గురు మృతి
బలేరియా : ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బరేలీ సమీపంలో కంటోన్మెంట్ ఏరియాలో ఈ చాపర్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లతో సహా ఓ ఇంజినీర్ అ అక్కడికక్కడే మరణించారు. టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాంతో వెంటనే మంటలు చెలరేగి, ఎయిర్ బేస్‌లో కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. -
ఫేస్బుక్ అమ్మ... ఎందుకమ్మా?
ఫేస్బుక్ మాయలో పడి యువతీ యువకులు మోసపోతున్న ఉదంతాలు మన తెలుసు. అయితే ఓ యువకుడు ఫేస్బుక్ లో కొత్త అమ్మను వెతుక్కుని కన్న తల్లిని వదిలేసిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. బరేలీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్థి- ఫేస్బుక్ మమ్మీ కోసం కన్నవారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. పొద్దస్తమాను ఫేస్బుక్ కు అతుక్కుపోతే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా అన్ని విషయాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడని విజయ్ మౌర్య అనుకున్నారు. అదేపనిగా 'ముఖ పుస్తకం'కు అంటుకుపోవడాన్ని విజయ్ తండ్రి బ్రిజేష్ అప్పట్లో గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. గత నెల విజయ్ కనిపించకుండా పోయాడు. అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయ్- 'ఫేస్బుక్ మమ్మీ' సుకన్య(పేరు మార్చారు)ని కలుసుకోవడానికి వెళ్లాడని తెలుసుకుని వారంతా అవాక్కయ్యారు. కేరళకు చెందిన ఆమెనే విజయ్ తన తల్లిగా చెప్పుపోవడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. త్రివేండ్రంకు చెందిన సుకన్య బహ్రెయిన్ లో నర్సుగా పనిచేస్తుంది. విజయ్ బ్యాంకు ఖాతాలోకి ఆమె రూ. 22 వేలు బదిలీ కూడా చేసింది. అంతేకాదు 'తన ఫేస్బుక్ కొడుకు' ఈనెల 12న ఏకంగా బరేలీకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి సుకన్య, విజయ్ ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా ఆపగలిగారు. ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. విజయ్ కుటుంబానికి బీజేపీ నాయకులు బాసటగా నిలవడం గమనార్హం. దీన్ని 'ప్రణాళికబద్దమైన కుట్ర'గా వర్ణించారు. హిందూ యువకుడిని క్రిస్టియన్ గా మార్చేందుకు ఈ కుట్ర చేశారని కమలనాథులు ఆరోపించారు. అయితే అసలు తల్లిదండ్రులను వదిలేసి ఫేస్బుక్ మమ్మీ కోసం పాకులాడుతున్న విజయ్ గురించి వింతగా చెప్పుకుంటున్నారు. ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. -
దళిత మహిళపై పది మంది గ్యాంగ్ రేప్
బారేలీ: దళిత మహిళపై పది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బారేలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్న 40 ఏళ్ల దళిత మహిళను ఎత్తుకెళ్లి పది మంది సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆమె భర్త, కొడుకు కట్టేసి వారీ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి బంధువులపై దుండగులు దాడి చేశారు. పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
క్షమాపణ చెప్పిన మోడీ!
బరిల్లీ: ఉద్దేశ పూర్వకంగానే తన హెలికాప్టర్ ఆపివేశారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. బరిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గోనేందుకు వెళ్లాల్సిన తనను ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావాలనే ఆలస్యం చేశారని మోడీ అన్నారు. ర్యాలీలో రావడానికి ఆలస్యమైనందుకు మోడీ క్షమాపణలు చెప్పి ప్రసంగం ఆరంభించారు. రెండు గంటలపాటు హెలికాఫ్టర్ కు అనుమతి ఇవ్వకుండా ఏటీసీ సిబ్బంది ఆపివేశారని మోడీ అన్నారు. ప్రతి ఒక్కరికి రాయ్ బరేలి మాత్రమే తెలుసునని.. గాలి పటాలకు ఉపయోగించే 'మాంజా'ను తయారు చేసే ఉత్తత్పిదారులు దేశంలో ఇక్కడే ఎక్కువ అని చాలామందికి తెలియదు అని అన్నారు. బాలీవుడ్ లో ఎక్కువ పాటలు ఈ ప్రదేశంపై రాశారని మోడీ అన్నారు. -
యువరాజుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి?
బరేలీ: ఎన్నికల ముందు మాత్రమే కాంగ్రెస్ పేదల జపం చేస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 365 రోజులూ ఏప్రిల్ పూల్స్ డే పాటిస్తుందని ఎద్దే వా చేశారు. పేదరికంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా తిప్పికొట్టారు. యువరాజుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు. రైతులను, సైనికులను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. జై జవాన్, జై కిసాన్ స్ఫూర్తి యూపీఏకు తెలుసా అని ప్రశ్నించారు. యూపీఏ పాలనలో రైతులకు భరోసా లేదన్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సమాజ్‌వాది పార్టీ కుమ్మక్కయిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే సోనియా, రాహుల్‌పై సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదన్నారు. -
మోడీ రాయ్‌బరేలీ సభ రద్దు
లక్నో: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించతలపెట్టిన విజయ్ శంఖ్నాద్ సభ రద్దయింది. ఇది ఈ నెల 13న జరగాల్సి ఉంది. హజరత్ షా షరాఫత్ మియాన్ ఉరుసు, ఉత్తరయాణి ఉత్సవాల వల్ల సభను రద్దు చేశామని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పట్నాయక్ తెలిపారు. అయితే, మోడీ ఇతర సభలు వాయిదా పడలేదని స్పష్టం చేశారు. గోరఖ్‌పూర్‌లో ఈ నెల 23న, మీరట్‌లో ఫిబ్రవరి 1న, మార్చి 2న లక్నోలో మోడీ విజయ్ శంఖ్నాద్ సభలు ఉంటాయని పట్నాయక్ చెప్పారు.