పెళ్లి సంబరాల్లో కాల్పులు.. పదేళ్ల బాలిక మృతి  | Girl Killed in Celebratory Firing In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

పెళ్లి సంబరాల్లో కాల్పులు.. పదేళ్ల బాలిక మృతి 

Published Sun, May 23 2021 3:45 PM | Last Updated on Sun, May 23 2021 3:45 PM

Girl Killed in Celebratory Firing In Uttar Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో జరిపిన కాల్పుల్లో ఓ పదేళ్ల బాలిక మరణించింది. ఫరిదాపూర్‌లోని న్యూ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించి వధూవరుల్లో ఓ వైపు వారు షాజహాన్‌పూర్‌ నుంచి వచ్చారు. ఆ సమయంలో జరిగిన వేడుకల్లో కొందరు వ్యక్తులు తాగిన మైకంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ మాన్సి అనే బాలికకు తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. బాలిక పెళ్లి కూతురుకు సోదరి అవుతుందని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు  పోలీసులు తెలిపారు.  

చదవండి: వైరల్‌: వరుడి చెంప పగలగొట్టిన వధువు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement