![Policeman Opens Fire At Dhaba Owner For Refusing Food In Ghaziabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/22/figure.jpg.webp?itok=GA9LRecH)
ప్రతీకాత్మక చిత్రం
ఘజియాబాద్ : దాబాలో ఆహరం లేదని చెప్పిన యజమానిపై కాల్పులు జరిపాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని సీజీవో క్లాంప్లెక్స్‌లో సీజీవోగా విధులు నిర్వహిస్తోన్న సందీప్ బాలియన్ శుక్రవారం రాత్రి 10గంటలకు భోజనం కోసమని దగ్గర్లోని దాబాకు వెళ్లాడు. అయితే అప్పటికే దాబా సమయం ముగియడంతో ఆహారం లేదని దాబా యజమాని ఆజాద్ కుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న పిస్తోల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, దాబాకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు దాబా యజమాని వెల్లడించారు. ఆజాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్ బాలియన్‌పై సెక‌్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి అతీశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ' దాబాపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశామని, సందీప్ కాల్పులు జరిపింది పిస్టోల్‌తోనేనని ఘటనా స్థలంలో లభించిన రెండు బులెట్ల ద్వారా నిర్ధారించామని' అతీశ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment