గంగానది కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు | Car Fells Into Ganga Canal Masuri In Ghaziabad District | Sakshi
Sakshi News home page

గంగానది కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు

Published Sat, Aug 8 2020 11:09 AM | Last Updated on Sat, Aug 8 2020 11:13 AM

Car Fells Into Ganga Canal Masuri In Ghaziabad District - Sakshi

లక్నో: ఉత్తప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్‌ జిల్లాలోని గంగానది కెనాల్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి కారులో ఉన్న నలుగురిలో ఒక్కరిని రక్షించగా, మరో ముగ్గురు కారులోనే చిక్కుకొని కెనాల్‌లో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురి కోసం రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి గురైనవారు బరేలీ నుంచి చంఢీఘర్‌కి వెళ్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement