Gaziabad
-
కుర్చీలో కూర్చొని కుప్పకూలిన జిమ్ ట్రైనర్.. క్షణాల్లో..!
లక్నో: కుర్చీలో కూర్చొని సేద తీరుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు 35 ఏళ్ల జిమ్ ట్రైనర్. అందరూ చూస్తుండగానే క్షణాల్లో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని షహీద్ నగర్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని అదిల్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదిల్ మృతితో కుంటుబసభ్యులతో అందరూ షాక్‌కు గురయ్యారని అతని స్నేహితుడు పరాగ్ చౌదరి తెలిపాడు. అదిల్‌కు సొంతంగా జిమ్ ఉండేదని, జ్వరం వచ్చినా లెక్క చేయకుండా ప్రతిరోజు జిమ్‌కు వెళ్లేవాడని తెలిపాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడని పేర్కొన్నాడు. అదిల్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. एक और मौत LIVE- कल ग़ाज़ियाबाद में 35 साल का एक जिम ट्रेनर सामान्य दिनों की तरह अपनी कुर्सी पर बैठा और वहीं हार्ट अटैक से उसकी मौत हो गई। सेकंड में मौत pic.twitter.com/7TX5di258X — Narendra nath mishra (@iamnarendranath) October 19, 2022 చదవండి: ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదిన యువకుడు.. వీడియో వైరల్.. -
కారు ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డా.. తగ్గేదేలే!
లక్నో: నడి రోడ్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఏం జరిగినా తగ్గేదేలే అన్నట్లు గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో జరిగింది. వీడియో ప్రకారం.. కొందరు కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు. కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. అయితే, కొద్ద సేపటికి.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DISTURBING Video: Speeding Car Plows Through Youths Fighting in Ghaziabad, Uttar Pradesh Brawl Continues Despite Hit; Case Registered#UttarPradesh pic.twitter.com/0gVnclbSkH — The Jamia Times (@thejamiatimes) September 21, 2022 ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్ -
ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్
ఘజియబాద్‌కు చెందిన ఒక 11 సంవత్సరాల బాలుడు యూట్యూబ్‌లో హ్యాకింగ్ టిప్స్ నేర్చుకున్నాడు. బయట ఎక్కడో ఎందుకు... తాను నేర్చుకున్న విద్యకు ఇంట్లోనే తగిన న్యాయం చేయాలనుకున్నాడు. వెంటనే తండ్రి ఇమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. దాని పాస్వర్డ్ మార్చేశాడు. తండ్రికి ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశాడు. ‘నేను హ్యాకర్ని. పదికోట్లు ఇవ్వకపోతే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అభ్యంతకరమైన ఫోటోలు ఆన్లైన్లో పెడతాను’ అని బెదిరించాడు. తండ్రిలబోదిబో అంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగెత్తాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఒక విషయం అర్థమైంది....హ్యాకర్ ఎవరో కాదు ఇంటిదొంగే... అని. కుటుంబసభ్యులను విచారించిన తరువాత హ్యాకర్ పిల్లాడు దొరికిపోయాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ‘లాక్డౌన్ టైమ్‌లో హ్యాకింగ్ ట్రిక్స్, సైబర్‌నేరాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేవాడిని’ అని రక్షకభటులకు చెప్పాడు 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు. ‘ఏదోలే మీ పిల్లాడే కదా’ అని వదిలేయకుండా ఐపీసీలోని రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. -
గంగానది కెనాల్లోకి దూసుకెళ్లిన కారు
లక్నో: ఉత్తప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని గంగానది కెనాల్లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కారులో ఉన్న నలుగురిలో ఒక్కరిని రక్షించగా, మరో ముగ్గురు కారులోనే చిక్కుకొని కెనాల్లో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురి కోసం రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి గురైనవారు బరేలీ నుంచి చంఢీఘర్‌కి వెళ్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందని..
లక్నో : భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు పిల్లలు, భార్యను చంపి ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గజియాబాద్‌లోని అర్ధాలాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి కాపురంలో అనుమానపు భూతం ప్రవేశించింది. ఈ క్రమంలో భార్య అపరిచితులతో తరచూ ఫోన్లో మాట్లాడుందనే కారణంతో వీరిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెరిగి పెద్దవి కావడంతో అసహానానికి లోనైన భర్త.. భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని, భార్య, పిల్లలు నేలమీద విగతా జీవులుగా కనిపించారు. అలాగే ఘటనాస్థలిలో సుసైడ్ నోట్ లభించింది. అందులో భార్య, ఆమె సోదరులపై భర్త ఆరోపణలు చేశారు. ‘భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంది’. అని కూడా రాశాడు. అయితే భార్య, పిల్లల గొంతు కోసి చంపిన తరువాత భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆహారం లేదన్నాడని కాల్పులు జరిపాడు
ఘజియాబాద్ : దాబాలో ఆహరం లేదని చెప్పిన యజమానిపై కాల్పులు జరిపాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని సీజీవో క్లాంప్లెక్స్‌లో సీజీవోగా విధులు నిర్వహిస్తోన్న సందీప్ బాలియన్ శుక్రవారం రాత్రి 10గంటలకు భోజనం కోసమని దగ్గర్లోని దాబాకు వెళ్లాడు. అయితే అప్పటికే దాబా సమయం ముగియడంతో ఆహారం లేదని దాబా యజమాని ఆజాద్ కుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న పిస్తోల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, దాబాకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు దాబా యజమాని వెల్లడించారు. ఆజాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్ బాలియన్‌పై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి అతీశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ' దాబాపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశామని, సందీప్ కాల్పులు జరిపింది పిస్టోల్‌తోనేనని ఘటనా స్థలంలో లభించిన రెండు బులెట్ల ద్వారా నిర్ధారించామని' అతీశ్ వెల్లడించారు. -
'మేము ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు'
ఘజియాబాద్ : ప్రధాని మోధీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి మా ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ఈ వందరోజుల్లో అద్భుత పనితీరును కనబరిచామని, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దిశా నిర్దేశం లేని ప్రభుత్వం అంటూ ఆర్థిక వ్యవస్థనుద్దేశించి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. -
అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని...
కట్టుకున్న భర్తను అనుమానంతో హత్య చేయించిందో భార్య. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతం గజియాబాద్‌లోని గాంగ్ నహర్లో గురువారం అర్థరాత్రి దాటాక చోటుచేసుకుంది. దిల్షాద్, రబియా ఇద్దరు భార్య భర్తలు. అయితే, దిల్షాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిబియా అనుమానించింది. దాంతో భర్తను అంతమొందించేందుకు ఆమె స్నేహితురాలు హబియా, ఆమె భర్త మౌజుద్దీన్ ల సాయం తీసుకుంది. దీంతో వారు ముగ్గురు కలిసి పథకం వేసి ... ఓ కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేశారు. రాత్రి భోజనం చేసిన అనంతరం రబియా తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి వెళ్లగానే ఆమె స్నేహితురాలు హబియా, హబియా భర్త మౌజుద్దీన్, కిరాయి హంతకుడు నూర్ మహ్మద్ కలిసి దిల్షాద్ గొంతునులిమి హత్య చేశారు. అనంతరం అతడికి బుర్ఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు, భార్య రబియాను అరెస్టు చేశారు. -
ఐదు వేల కొత్త ఆటోలకు ఎన్సీఆర్ పర్మిట్లు
నోయిడా:నోయిడా నుంచి పరిసర నగరాలకు ప్రతి రోజూ రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ఢిల్లీతోపాటు ఫరీదాబాద్‌కు ఇక్కడి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ అనుమతించింది. ఇందులోభాగంగా ఐదు వేల కొత్త ఆటోలకు ఎన్సీఆర్ పర్మిట్లు జారీచేసింది. ఈ ఆటోలకు ఎలక్ట్రానిక్ మీటర్లు ఉంటాయి. మిగతా ఆటోలకంటే భిన్నంగా కనిపించేందుకు వీలుగా వీటికి కలర్ కోడ్ కూడా ఉంటుంది. కాగా ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ తీసుకున్న తాజా నిర్ణయంపై మెట్రో రైళ్లపై ఆధారపడే ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందువల్ల ఇప్పటిదాకా నగర ఆటోవాలాలతో వాగ్యుద్ధం చేసి విసిగిపోయిన ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని ఓ వరంగా భావిస్తున్నారు.ఇందువల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందని వారంటున్నారు. ఈ విషయమై ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ ‘ నా వృత్తిలో భాగంగా నిరంతరం నేను రాకపోకలు సాగిస్తుండాలి. ఇందులో భాగంగా మెట్రో రైళ్లపైనే ఆధారపడేవాడిని. కొద్ది కొద్ది దూరాలకు కూడా విధిలేని పరిస్థితుల్లో మెట్రోనే దిక్కయ్యేది. ఇందుకు కారణం ప్రత్యామ్నాయం లేకపోవడమే. మెట్రో స్టేషన్‌కు వెళ్లడం, టికెట్ కొనుగోలు చేయడం, దాని రాకకోసం ఎదురుచూడడం, ఆ తర్వాత గమ్యానికి చేరడం మామూలే. దీనికితోడు అక్కడి నుంచి నా గమ్యానికి చేరుకునేందుకు మళ్లీ ఆటోరిక్షాను ఆశ్రయించక తప్పేది కాదు. ఇందువల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇదంతా ఎందుకని నేను నేరుగా ఆటోలోనే వెళ్లిపోయేవాడిని. ఎంతో డబ్బు ఖర్చయినా కోరుకున్న సమయానికి నా గమ్యానికి చేరుకోగలిగేవాడిని. అయితే ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ తాజా నిర్ణయం వల్ల నేను ఇకమీదట ఇక్కడి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకోగలుగుతాను. అందుకయ్యే చార్జీ కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఢిల్లీలో నేను ఆటో ఎక్కడానికే మొగ్గుచేపేవాడిని. ఈ సేవలు కనుక ప్రారంభమైతే మెట్రో రైళ్లలో ప్రయాణాలను తగ్గించుకుంటా’ అని చెప్పాడు. మానసి మరో నగరవాసి మాట్లాడుతూ ‘సెక్టార్1-6లో నా కార్యాలయం ఉంది. నేను సరై జుల్లేనా ప్రాంతంలో నివసిస్తా. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించడం అత్యంత ఇబ్బందికరంగా ఉంది. ఇందుకోసం ప్రతిరోజూ రెండు ఆటోలు మారక తప్పడం లేదు. ఇక మెట్రో రైలు మార్గం నాకు ఎంతమాత్రం సౌకర్యవంతంగా లేదు. ఒకవేళ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరేటపుడు ఆలస్యమైతే కచ్చితంగా ఆటోను ఆశ్రయిస్తా’అని తెలిపింది. కాగా కారు కొనుగోలు చేయలేని వారికి యూపీ రవాణా శాఖ నిర్ణయం వరంగా మారింది.