అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని... | Suspicious of husband's fidelity, woman gets him killed | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని...

Published Fri, Feb 27 2015 8:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని...

అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని...

కట్టుకున్న భర్తను అనుమానంతో హత్య చేయించిందో భార్య. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతం గజియాబాద్లోని గాంగ్ నహర్లో గురువారం అర్థరాత్రి దాటాక  చోటుచేసుకుంది. దిల్షాద్, రబియా ఇద్దరు భార్య భర్తలు. అయితే, దిల్షాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిబియా అనుమానించింది. దాంతో భర్తను అంతమొందించేందుకు ఆమె స్నేహితురాలు హబియా, ఆమె భర్త మౌజుద్దీన్ ల సాయం తీసుకుంది.

 

దీంతో వారు ముగ్గురు కలిసి పథకం వేసి ...  ఓ కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేశారు. రాత్రి భోజనం చేసిన అనంతరం రబియా తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి వెళ్లగానే  ఆమె స్నేహితురాలు హబియా, హబియా భర్త మౌజుద్దీన్, కిరాయి హంతకుడు నూర్ మహ్మద్ కలిసి దిల్షాద్ గొంతునులిమి హత్య చేశారు. అనంతరం అతడికి బుర్ఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు, భార్య రబియాను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement