husband murder
-
భర్తకు బంగారం లాంటి ఉద్యోగం.. సౌమ్యరంజన్ మృతి కేసులో మలుపు
ఒడిశా : గజపతి జిల్లా అటవీ శాఖలో ఏసీఎఫ్‌గా విధులు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా మృతిచెందిన సౌమ్యరంజన్ మహాపాత్రొ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు పర్లాకిమిడి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీజేఎం) కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జూలై 11న తన క్వార్టర్స్‌లో కాలిన గాయాలతో ఏసీఎఫ్ మృతిచెందగా, ఆయన భార్య విద్యాభారతి పండా, ఇంటి వంటవాడు మన్మథ కుంభో, అప్పటి డీఎఫ్ఓ సంగ్రాం బెహరా నిందితులుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే దర్యాప్తు అనంతరం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం(ఎస్ఐటీ) వీరి ముగ్గురికీ క్లీన్‌చీట్ ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సౌమ్యరంజన్ తండ్రి అభిరాం బెహరా.. కేసును పునః విచారణ చేపట్టాల్సిందిగా పర్లాకిమిడి ఎస్డీజేఎం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం దర్యాప్తులో ముందుగా పేర్కొన్న ప్రధాన నిందితులకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ముగ్గురూ స్పందించక పోవడంతో కోర్టులో విచారణకు రావాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే హాజరు సైతం లేకపోవడంతో పలుమార్లు హెచ్చరించిన అనంతరం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు సౌమ్యరంజన్ భార్య విద్యాభారతి పశువైద్య శాఖలో లైవ్‌స్టాక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా, జూన్ 27నుంచి సెలవులో ఉన్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏసీఎఫ్ మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
ప్రియుడితో సంతోషానికి భర్త అడ్డు.. అంతు చూసిన భార్య
సాక్షి, బెంగళూరు: ప్రియునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని అతనితో కలిసి భర్తను కడతేర్చిందో భార్య. ఈ సంఘటన బాగేపల్లి తాలూకాలోని పోలానాయకనహళ్లి వద్ద జరిగింది. నరసింహప్ప (35)ను భార్య అలివేలు, బొమ్మసంద్ర గ్రామానికి చెందిన ప్రియుడు వెంకటేష్‌తో కలిసి మద్యం తాగించి బండరాళ్లతో బాది చంపారు. చేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యభర్తలు ఇద్దరూ కూలిపనులకు వెళ్లేవారు. అక్కడ అలివేలుకు వెంకటేష్‌తో పరిచయమైంది. రెండేళ్ల నుంచి వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడడంతో భర్తకు తెలిసి వెంకటేష్‌ను హెచ్చరించాడు. మద్యం తాగుదామని తీసుకెళ్లి దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 24వ తేదీన సాయంత్రం అలివేలు, ప్రియుడు వెంకటెష్ కలిసి నరసింహప్పను మందు తాగుదామని చెప్పి బొమ్మసంద్ర సమీపంలో ఉన్న ఎర్రమట్టి గుంతల వద్దకు తీసుకెళ్లారు. అతడు మద్యం మత్తులో ఉండగా ఇద్దరూ బండరాళ్లతో కొట్టి హత్య చేసి అక్కడే చిన్న గుంత తీసి పాతిపెట్టి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల తరువాత భర్త కనిపించడం లేదని ఏడుస్తూ అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం విచారణలో ఇద్దరి నేరం బయటపడడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) -
భర్తకు వివాహేతర సంబంధం తెలియడంతో.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..
సాక్షి, బెంగళూరు: ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6న రాకేశ్తోమంగ్ను భార్య దేబి తంబాగ్, ప్రియుడు బాబు అలీ కలిసి హత్య చేశారు. దేబితో బాబుకు అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం రాకేశ్ తోమంగ్కు తెలియడంతో భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని ప్రియునితో కలిసి ఇంట్లోనే భర్తను చంపించింది. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈశాన్య రాష్త్రాలకు చెందిన వీరు బెంగళూరులో పని చేసుకునేవారని తెలిసింది. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్) -
యశ్వంత్‌తో వివాహేతర సంబంధం.. సంతోషానికి భర్త అడ్డుపడటంతో..
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): భార్య అక్రమ సంబంధం మోజులో భర్తను బలిగొన్న సంఘటన రామనగర తాలూకా హారోహళ్లిలో వెలుగు చూసింది. గొట్టిగెహళ్లి సమీపంలో ఇటీవల కాలిపోయిన స్థితిలో సుమారు 27 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి శవం లభ్యమైంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మృతుడు కిరణ్‌గా గుర్తించారు. విచారణ జరిపి అతని భార్య, ఇద్దరు నిందితులను అరెస్టు చేసారు. కిరణ్ భార్య, ప్రధాన నిందితుడు యశ్వంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్త కిరణ్‌ను అంతం చేసిందని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉంది. చదవండి: (Hyderabad: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!) -
24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు తగిలిన భర్తను తానే హతమార్చినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. వివరాలను బుధవారం ధర్మవరం అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమాకాంత్ వెల్లడించారు. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన పల్లపు గంగాధర్‌కు 24 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవితో వివాహమైంది. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎరికల ముత్యాలు, ఎరికల పుల్లక్క, ఎరికల నగేష్, మరికొందరితో దాదాపు రూ.8 లక్షల వరకు అధిక వడ్డీకి గంగాధర్ అప్పులు చేసి భార్య చీరల వ్యాపారానికి సమకూర్చాడు. కొన్నేళ్లుగా లక్ష్మీదేవి తారకరామాపురానికి చెందిన నారా భాస్కరరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా తెలుసుకున్న గంగాధర్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతుండడంతో ఎలాగైనా భర్తను అంతమొందించాలని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది. తన అన్న వెంకటేష్, ఆమె అల్లుడు సుధాకర్‌కు డబ్బు ఆశ చూపి వారి సాయంతో ఏప్రిల్ 8న అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఎల్పీ సర్కిల్లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మద్యం మత్తులో పడి ఉన్న గంగాధర్‌పై బండరాయి, ఇనుప పైపులు వేసి, గొంతు నులిమి హతమార్చింది. చదవండి: తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..? మరుసటి రోజు అప్పులు ఇచ్చిన వారే తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తడంతో విషయం తెలుసుకున్న ఆమె, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. బుధవారం ఉదయం వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. హత్యకు దారి తీసిన పరిణామాలను ఈ సందర్భంగా పోలీసులకు నిందితులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
దారుణానికి ఒడిగట్టిన భార్య.. భర్త మృత దేహాన్ని పరిశీలించగా..
సాక్షి, తూర్పుగోదావరి(సీతానగరం): ఓ వ్యక్తిని అతడి భార్యే క్రూరంగా హతమార్చిన వైనమిది. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. సీతానగరం మండలం రఘుదేవపురం యానాదుల కాలనీలో మర్రే అబ్బులు (46), అతడి భార్య ముత్యాలమ్మ మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఇంటి వద్ద గొడవ పడ్డారు. ఇద్దరూ గొడవ పడుతూనే ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ముత్యాలమ్మ మాత్రమే ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం రాపాక రోడ్డులోని ఓ కల్వర్టు వద్ద అబ్బులు మృతదేహాన్ని చూసిన స్దానికులు ముత్యాలమ్మకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేయడానికి శ్మశానవాటికకు తరలించే ప్రయత్నంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్సై శుభశేఖర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తన భర్త ఫిట్స్ వచ్చి చనిపోయాడని వారిని నమ్మించేందుకు ముత్యాలమ్మ ప్రయత్నించింది. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) మృతదేహాన్ని పరిశీలించగా అబ్బులు మర్మాంగం కట్ చేసి ఉంది. అతడి ముఖంపై కొట్టి హతమార్చినట్టు గుర్తించారు. దీనిపై తమదైన శైలిలో విచారణ జరిపారు. దంపతులిద్దరూ గొడవలు పడుతూ గ్రామ శివారుకు వెళ్లారని, అక్కడ వాడి పారేసిన మరుగుదొడ్డి బేసిన్‌తో అబ్బులును అతడి భార్య ముత్యాలమ్మ బలంగా కొట్టి ఇంటికి వచ్చేసిందని తెలిపారు. తన భర్త అనారోగ్యంతో మరణించినట్లు చిత్రీకరించేందుకు ఉదయం ప్రయత్నించింది. హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. అబ్బులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముత్యాలమ్మను అదుపులోకి తీసుకుని, హత్య కేసుగా ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య) -
ఫూటుగా మద్యం సేవించి... స్నేహితుడి భార్యను
సాక్షి, మైసూరు(కర్ణాటక): నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. రవి (28), బసవ (30) అనే ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు మహేష్, అతనికి సహకరించిన మరొకరిని సరస్వతిపురం పోలిసులు అరెస్టు చేశారు. వీరందరూ కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో మహేష్ భార్య అటు వైపు రాగా, మృతులు ఇద్దరూ ఆమెను వేధించారు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరిగింది. ఈసారి తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్, అతని స్నేహితునితో కలిసి రవి, బసవను కత్తులతో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతులు హెచ్డీ కోటె కొత్తగాల గ్రామానికి చెందినవారని, అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారని తెలిసింది. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. -
విందుకు పిలిపించి.. మద్యం తాగించి..
సాక్షి, కోస్గి (మహబూబ్‌నగర్): యువకుడి అనుమానాస్పద మృతి కేసు, హత్య అని నారాయణపేట డీఎస్పీ మధుసూదన్ రావు నిర్ధారించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈనెల 18న పట్టణ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని చెప్పారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మృతుని భార్య, ఆమె ప్రియుడు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు రెండు రోజుల వ్యవధిలోనే ఆధారాలు సేకరించామని తెలిపారు. ఆ వివరాలు.. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు(35)కు కోస్గి మండలంలోని కడంపల్లికి చెందిన లక్ష్మితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. లాక్డౌన్ సమయంలో వీరు జీవనోపాధి కోసం తాండూర్‌లో కూలీ పనులు చేస్తుండేవారు. అదే కాలనీలో నివాసం ఉండే బాలుడితో లక్ష్మికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య లక్ష్మి తన పిల్లలతో పుట్టింటికి వచ్చింది. అక్కడే ఉంటూ ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఎలాగైన భర్తను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. ఈనెల 17న బంధువుల ఇంట్లో విందుకు భార్య లక్ష్మి పిలవడంతో వచ్చిన ఆంజనేయులును ప్రియుడు రాజు కలిసి ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఉదయం నుంచి రాత్రివరకు మద్యం తాగించి పట్టణ శివారులోని బస్‌డిపో ప్రాంతంలో ఆంజనేయులు కాళ్లు, చేతులు కట్టివేసి బ్లెడ్‌తో చేతి మణికట్టు లోతుగా కోసి పరారయ్యాడు. మద్యం మత్తులో లేవలేని స్థితిలో ఉన్న ఆంజనేయులు తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మధుసూదన్ రావు భార్యపైనే అనుమానమంటూ ఫిర్యాదు.. మృతుని తల్లి రాములమ్మ తన కొడుకును అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో భార్యను విచారించారు. హత్య చేసేందుకు మైనర్ బాలుడు భయపడినప్పటికీ మళ్లీ మళ్లీ ఫోన్‌చేసి అతన్ని ఒప్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో ప్రేమలో విఫలమైన బాలుడు బ్లేడ్‌తో చేయి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి బతికిపోయినట్లు తెలుసుకున్న లక్ష్మీ, తన భర్తను సైతం మద్యం తాగించి చేయికోసి చంపాలని సూచించడంతో అదే రీతిలో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలో ఏ–1గా మైనర్ బాలుడు, ఏ–2గా లక్ష్మీలను చేర్చి హత్యకేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామన్నారు. -
ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..
సాక్షి, కర్ణాటక (మండ్య): ప్రేమపెళ్లి చేసుకుని కొడుకుతో అన్యోన్యంగా ఉన్న ఒక కుటుంబంలో ప్రియుడు చిచ్చుపెట్టాడు. అతని మోజులో పడి భార్య కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. ఈ ఘోరం మండ్య తాలూకాలోని హనకెరెలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండ్య గ్రామీణ పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ప్రదీప్ (35), భార్య శిల్ప (30) 13 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలో మూడేళ్ల కిందట మధు నాయక్ (34) అనే వ్యక్తి శిల్పకు పరిచయమయ్యాడు. ఇతను కేఆర్ నగరవాసి. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించడం వంటి దళారీ పనులు చేసేవాడు. శిల్ప, మధుల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. శిల్ప భర్త ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికే వచ్చివెళ్లేవాడు. బయట షికార్లు సరేసరి. ఇది తెలిసి ప్రదీప్ భార్యను తీవ్రంగా మందలించగా ఎన్నోసార్లు గొడవలూ జరిగాయి. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) బంధువులకు అనుమానం ఇలా తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రేయసీప్రియులు పథకం వేశారు. నవంబర్ 18వ తేదీన రాత్రి గుట్టుగా భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారుకున్న భర్తను ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపింది. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడని శిల్ప ఉత్తుత్తి ఏడుపు ఏడ్చి అనుమానం రాకుండా అంత్యక్రియలు జరిపించింది. అప్పటినుంచి ప్రియుడు మధుతో జల్సాలు చేస్తుండడం చూసి ప్రదీప్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిజాలు చెప్పించారు. తామే హత్య చేశామని శిల్ప, మధు అంగీకరించారు. అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. -
కొడుకుతో కలిసి భర్తను..
సాక్షి, తిరుమలాయపాలెం: మండలంలోని బీరోలులో ఈ నెల 19న రాత్రి, కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యను, ఆమెకు సహకరించిన కొడుకుని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, కోర్టు కు అప్పగించారు. తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కూసుమంచి సీఐ మురళి తెలిపిన వివరాలు... మండలంలోని బీరోలు గ్రామస్తుడు బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో సోమలక్ష్మి మృతిచెందడంతో సత్యవతిని రెండోవివాహం చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె కలి గారు. కొన్నేళ్ల క్రితం, సత్యవతి తన భర్తను వదిలేసి ఖమ్మం వెళ్లింది. రెండేళ్ల క్రితం భర్త వద్దకు తిరిగొచ్చింది. కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి భర్త సీతారాములు ఇంట్లోనే ఓ గదిలో ఉంటోంది. భర్త సీతారాములుకు చెందిన 15 కుంటల భూమిలో ఏడు కుంటల భూమిని తన పేరిట పట్టా చేయించాలని భార్య సత్యవతి పట్టుబట్టింది. తనను ఏమాత్రం పట్టించుకోని సత్యవతి పేరిట భూమిని పట్టా చేసేందుకు సీతారాములు ససేమిరా అన్నాడు. దీంతో, అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. తన కుమారుడు శ్రీధర్‌తో కలిసి ఈ నెల 19న అర్ధరాత్రి వేళ సీతారాములును గొడ్డలి తో నరికి చంపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన సత్యవతిని, ఆమె కుమారు డు శ్రీధర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచా రు. సమావేశంలో ఎస్ఐ సర్వయ్య పాల్గొన్నారు. -
ఏడు గుంటల భూమి కోసం.. గొడ్డలితో నరికి భర్త హత్య
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా బీరోలులో ఏడు గుంటల భూమి కోసం కట్టుకున్న భర్తనే కొడుకుతో కలసి రెండో భార్య గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. బుడిగె సీతారాములు(65) సోమలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు జన్మించాడు. తర్వాత సోమలక్ష్మి మృతి చెందడంతో సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కొడుకు జన్మించగా.. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ క్రమంలో సీతారాములుకు ఉన్న 15 గుంటల భూమిలో వాటా కోసం గొడవలు జరిగాయి. 7 గుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంపు పేపర్‌పై రాసి ఇచ్చినప్పటికీ, పట్టా మాత్రం అతని పేరునే ఉంది. దీంతో తన పేరు పట్టా చేయాలని ఆమె పట్టు బట్టడంతో సీతారాములు పట్టించుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న ఆమె.. కొడుకుతో కలసి శుక్రవారం అర్ధరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి హత్య చేసింది. -
ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా అంతమొందించింది. అనంతరం శవాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో కుక్కి సిమెంట్ కడ్డీని సంచికి కట్టి చెరువులో పడేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన కావలి మల్లయ్య (42)కి వంగూరు మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన పార్వతమ్మ (38)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీలత(13), కుమారుడు శ్రీకాంత్(16) ఉన్నారు. భర్త మల్లయ్య హైదరాబాద్‌లో కూలి పని చేస్తూ ప్రతి 15 రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు. ఇదిలాఉండగా నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మేస్త్రీ రాము(37) కుటుంబం కావలి మల్లయ్య ఇంటి పక్కనే అద్దెకు దిగారు. దీంతో రాము, ఆయన భార్య పనిచేసే చోటుకే మల్లయ్య భార్య పార్వతమ్మ కూడా వెళ్లేది. ఈ క్రమంలో రాము–పార్వ తమ్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పార్వతమ్మ భర్త మల్లయ్య కల్వకుర్తికి వచ్చేశాడు. అయినా రాముతో తన బంధాన్ని అలాగే కొనసాగించింది. భర్తను అడ్డు తప్పిస్తే తమ సంబంధం సాఫీగా సాగుతుందనుకున్న పార్వత్వమ్మ ప్రియుడితో కలసి పథకం రచించింది. ఈ క్రమంలో గత ఏప్రిల్ 20న రాత్రి ఇంట్లోనే ప్రియుడు రాము, కుమారుడు శ్రీకాంత్ సాయంతో భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి సంచిలో కుక్కి దానికి సిమెంట్ కడ్డీ కట్టి నాగనూల్ నాగసముద్రం చెరువులో పడేశారు. చాలా రోజులుగా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బాలమ్మ ఈ నెల 7న కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే భర్త కనిపించడం లేదని పార్వతమ్మ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు పార్వతమ్మపై అనుమానంతో ఆమె సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తరచూ పార్వతమ్మ రాముతో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా శుక్రవారం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శనివారం నాగనూల్ నాగ సముద్రంలో నుంచి మృతదేహన్ని బయటకు తీయించారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, కల్వకుర్తి డీఎస్పీ ఎల్సీ.నాయక్ ఆధ్వర్యంలో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
అడ్డుగా ఉన్నాడని అంతం చేయించింది!
హైదరాబాద్: ప్రియుడి వ్యామోహంలో పడిన భార్య అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భావించింది. ఈ ‘బాధ్యతల్ని’ తీసుకున్న ప్రియుడు ఓ పాత నేరగాడికి రూ.2 లక్షలకు సుపారీ ఇచ్చాడు. రైలు పట్టాల వద్ద హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు తన భర్త కనిపించట్లేదంటూ ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా, ఎస్సార్‌నగర్ ఠాణాలో అదృశ్యంగా నమోదైన ఈ కేసుల్ని సనత్‌నగర్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ మంగళవారం వెల్లడించారు. భర్తే అడ్డుగా మారాడని భావించి.. బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎండీ ఖాజా(46)కు అదే ప్రాంతానికి చెందిన సలేహా బేగం(26)తో 2007లో వివాహమైంది. వీరికి నవాజ్(9), లతీఫ్(7) కుమారులున్నారు. సమీపంలోని ఓ మాంసం దుకాణంలో పనిచేసే ఎండీ తబ్రేజ్‌ఖురేషీ(33)తో సలేహాకు కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలిసిన ఖాజా అనేకసార్లు భార్యను మందలించ డంతో పాటు తబ్రేజ్‌తోనూ గొడవపడ్డాడు. ఈ పరిణామాలతో భర్తే అడ్డుగా మారుతున్నాడని భావించిన సలేహా.. అతడిని అంతం చేయా లని ఖురేషీతో చెప్పింది. దీనికోసం ఇతగాడు బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు సయ్యద్ ముజీబ్‌ను సంప్రదించాడు. ఖాజాను చంపేస్తే రూ.2 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుని రూ.30 వేలు అడ్వా న్స్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన ముజీబ్.. ఖాజా తరచూ వెళ్లే మద్యం దుకాణాలకే వెళ్తూ స్నేహం చేశాడు. దీంతో వీరిద్దరూ కలసి మద్యం తాగడం మొదలైంది. హత్యచేసిన ప్రాంతంలో రక్తం మరో ముగ్గురితో రంగంలోకి దిగి.. ఖాజాను హత్య చేయాలని నిర్ణయించుకున్న ముజీబ్ అందుకు సహకరించడానికి బోరబండకు చెందిన ఎండీ అయాజ్, ఎర్రగడ్డకు చెందిన మీర్జా అక్బర్ బేగ్, బోరబండ సైట్ 3 అంబేడ్కర్‌నగర్‌కు చెందిన షేక్ జహీర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న మాదాపూర్‌లోని ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ముజీబ్, ఖాజా.. అక్కడ మద్యం ఖరీదు చేసి, పర్మిట్‌రూమ్‌లో కూర్చుని తాగారు. తిరిగి వస్తూ మద్యం, బీరు ఖరీదు చేశారు. సమీ పంలో వేచి ఉన్న రియాజ్, అక్బర్, జహీర్ వీరిని అనుసరించారు. రాత్రి 9.40 సమయంలో బోరబండ వివేకానందనగర్ కమాన్ వద్ద ఆగిన ముజీబ్, ఖాజా తమ వెంట ఉన్న మద్యం తాగాలని భావించారు. ఇక్కడైతే పోలీసుల కంటపడతామని చెప్పిన ముజీబ్.. ఖాజాను సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకువెళ్లి ఎక్కువ మద్యం తాగేలా చేశాడు. చంపేసి రైలు పట్టాలపై పడేసి.. ఖాజా మద్యం మత్తులోకి జారుకోవడంతో మిగిలిన ముగ్గురినీ పిలిచిన ముజీబ్.. వారితో కలసి బండరాయితో ఖాజాను చంపేసి.. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖాన్ని నుజ్జునుజ్జు చేశారు. మద్యం మత్తులో పట్టాలు దాటుతూ రైలు ఢీ కొట్టడంతో చనిపోయినట్లు చిత్రీకరించడానికి మృతదేహాన్ని పట్టాలపై పడేశారు. రైళ్ల రాకపోకల ధాటికి మృతదేహం ఛిద్రమైంది. బోరబండ–హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల మధ్య ఓ మృతదేహం పడి ఉన్నట్లు ఓ మహిళ ఫిబ్రవరి 21న నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చింది. ఘటనాస్థలికి వచ్చిన రైల్వే పోలీసులు ఇది ప్రమాదంగా భావించినా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది జరిగిన తర్వాత ఓ వారం పాటు భర్త కోసం గాలిస్తున్నట్లు నటించిన సలేహా.. ఆపై ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అనుమానం పుట్టించిన గాయాలు.. మృతదేహానికి పంచనామా నిర్వహించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం సైతం చేయించారు. హతుడి తలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గాయాలు ఉన్నట్లు ఈ నివేదికలు స్పష్టం చేశాయి. అనుమానం వచ్చిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా.. మృతదేహం లభించిన ప్రాంతానికి సమీపంలో ట్రాక్ పక్కన రక్తపు మడుగు, ఇతర ఆధారాలను గుర్తించి హత్యగా తేల్చారు. మిస్సింగ్ కేసు వీరి దృష్టికి రావడంతో హతుడు ఖాజాగా గుర్తించారు. మృతదేహం లభించిన ప్రాంతం సనత్‌నగర్ ఠాణా పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. సనత్‌నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సాలేహా పాత్రను అనుమానించారు. ఆమె కాల్ డిటేల్స్‌లో ఖాజా తర్వాత ఎక్కువగా తబ్రేజ్‌తో మాట్లాడినట్లు తేలింది. లోతుగా ఆరా తీయగా.. ఖాజా హత్య జరిగిన రోజు వీరిలో ఎవరెవరు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనే వివరాలు ఆరా తీశారు. తబ్రేజ్ ఎక్కువగా ముజీబ్‌తో ఫోన్లో సంప్రదించడం.. ముజీ బ్ హత్యాస్థలంలో ఉన్నట్లు అతడి సెల్‌ఫోన్ డిటేల్స్ బయటపెట్టడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు కొలిక్కి రావడంతో మిగిలిన ముగ్గురు నిందితుల్నీ పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డిలను డీసీపీ అభినందించారు. ఖాజా ఇంటి ఎదురుగానే అతడి భార్య సలేహా తల్లిదండ్రులు నివసిస్తుంటారు. తండ్రి హత్యకు గురికావ డం, తల్లి జైలుకెళ్లడంతో వీరి కుమారులు నవాజ్, లతీఫ్‌లను వారికి అప్పగించారు. వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డీసీపీ సాయిశేఖర్. చిత్రంలో నిందితులు -
దాంపత్యానికి పనికిరాడని..
యలమంచిలి:తన ఫోన్ నంబర్ కాకుండా తల్లి ఫోన్ నంబర్ ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసులో నిందితురాలిని పట్టుకున్నారు. సీఐ కె.వి.విజయనాథ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పాతవీధిలో నివాసం ఉంటున్న అతికిన శెట్టి నాగేశ్వరావు అనే ఉల్లిపాయల వ్యాపారి ఈనెల 7వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు అతికినశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య వీరలక్ష్మి ఫోన్ నంబర్‌ను పోలీసులు తీసుకున్నారు. అయితే ఆమె తన ఫోన్ నంబర్ కాకుండా తన తల్లి ఫోన్ నంబర్ ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె వినియోగిస్తున్న ఫోన్ నంబర్ తీసుకుని కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. భార్యే నిందితులురాలని నిర్ధారించుకుని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. తానే తన భర్తను చంపినట్టుగా వీరలక్ష్మి అంగీకరించినట్టు సీఐ తెలిపారు. హత్యకు దారితీసిన పరిస్థితులు .. నాగేశ్వరావు, అతని భార్య వీరలక్ష్మికి మధ్య మూడేళ్లుగా విభేదాలున్నాయి. తన భర్త వల్ల తనకు ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతోపాటు నిత్యం వేధిస్తుండేవాడని వీరలక్ష్మి పోలీసులకు తెలిపింది. తనకు గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తితో పరిచ యం ఉందని చెప్పింది. 7వ తేదీ రాత్రి రోజూలాగే తన భర్త తాగి ఇంటికి వచ్చాడని, అతనితో వాగ్వాదం జరగడంతో గట్టిగా నెట్టినట్టు ఆమె చెప్పింది. పడిపోవడంతో గాయాలు తగిలాయని తెలిపింది. అనంతరం మంచంపై పడుకున్న నాగేశ్వరావు గొంతుకు రెండు పేటలుగా చేసిన పురికోస తాడుతో బిగించానని, అప్పటికీ ప్రాణంతో ఉండడంతో ముక్కు,నోరుమూసి హత్యచేశానని నిందితురాలు పోలీసులకు తెలిపింది. ఈ హత్యతో ఎవరికీ సంబంధంలేదని తెలిపినట్టు సీఐ చెప్పారు. నిందితురాలిని కోర్టుకు హాజరపరుస్తామని ఆయన తెలిపారు.కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు.తల్లి అనారోగ్యంతో మంచంపై ఉండగా, ఇద్దరు పిల్లలు చాలా కాలంగా వారి అమ్మమ్మ వద్దే ఉంటూ చదువుకుంటున్నారు. ఈకేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తామని సీఐ కె.వి.విజయనాథ్ తెలిపారు. -
భార్య భర్త మధ్యలో ప్రియుడు!
-
‘పోలీసులు ఫోన్ చేశాకే తెలిసింది’
సాక్షి, హైదరాబాద్: ‘నా భర్తను నేను చంపలేదు. నాకేమి తెలియదు. పాలలో నిద్రమాత్రలు కలిపి నా భర్తకు ఇచ్చాను. కార్తీక్ చెబితేనే నిద్రమాత్రలు కలిపాను. నా భర్తను చంపేస్తారని నాకు తెలియదు. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నా భర్తను చంపేశారని పోలీసులు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే తెలిసింద’ని భర్త హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జ్యోతి తెలిపింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన కార్పెంటర్ నాగరాజు హత్య కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్, దీపక్, యాసీన్, నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతి, కార్తీక్, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. మీడియా ముందు జ్యోతి, నాగరాజు భిన్నవాదనలు వినిపించారు. భర్తను చంపాలని తాను అనుకోలేదని జ్యోతి చెప్పగా, ఆమె ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్ చేయడంతో నా ఫ్రెండ్స్‌ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్ వివరించాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. -
ప్రియుడిపై మోజుతో భర్త దారుణ హత్య
-
యాసిడ్ దాడి కేసును ఛేదించిన పోలీసులు
-
నా భర్తను హత్య చేశారు... న్యాయం చేయండి
కర్నూలు : తన భర్త నాగరాజును గత నెల 25వ తేదీన గుర్తు తెలియని కొందరు వ్యక్తులు హత్య చేసి శవాన్ని కనిపించకుండా చేశారని, దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని బనగానపల్లె పట్టణానికి చెందిన నిర్మల ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. 94407 95567 సెల్ నంబర్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి నేరుగా వచ్చి కలసిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోస్పాడు మండలం పసులవాడు గ్రామానికి చెందిన తమ కుటుంబం 20 ఏళ్లుగా బనగానపల్లెలో ఉంటుందని, తన భర్త నాపరాయి బండల వ్యాపారం చేసేవాడని నిర్మల ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బనగానపల్లెకు వచ్చిన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని నిర్మల కలిసి తన సమస్య చెప్పుకుంది. ఆయన సూచన మేరకు సోమవారం కుటుంబ సభ్యులతో ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకుంది. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో మరి కొన్ని... ♦ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను, పిల్లలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బనగానపల్లె మండలం బీరపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి ఫిర్యాదు చేశారు. భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని ఆమె వేడుకున్నారు. ♦ భార్య ఆరోగ్యం సరిగా లేనందున పొలాన్ని అమ్మి వైద్యచికిత్సలు చేయించేందుకు ప్రయత్నిస్తుండగా కుమారులు అడ్డుకుంటున్నారని చాపిరేవుల గ్రామానికి చెందిన మద్దిలేటి ఫిర్యాదు చేశారు. ఆరుగురు పిల్లలున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ♦ కొందరు తమ ఇళ్లస్థలాలను దౌర్జన్యంతో ఆక్రమించుకున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సుజాత, బతుకమ్మ, జాన్, చిట్టెమ్మ, రాహేలమ్మ ఫిర్యాదు చేశారు. ♦ వెల్దుర్తిలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట, మట్కా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీ బాబుప్రసాద్, వినోద్‌కుమార్, నజీముద్దిన్, సీఐ పవన్‌కిషోర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యాదాద్రి జిల్లాలో దారుణం
-
టీవీ నటి కిరాతకం
బెంగళూరు : టీవీ సీరియళ్లకు ఏమాత్రం తీసిపోని కథ ఇది. బుల్లితెరపై నటిస్తున్న ఒక మహిళ సీరియళ్లలోని కుట్రలనే ఒంటబట్టించుకుంది. సహచరునితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పరలోకాలకు పంపించింది. ఆ మహిళను, ఆమె ప్రియుడిని నిన్న యశ్వంతపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు తుమకూరు నగరానికి చెందిన సతీష్ (36). అతని భార్య, టీవీ నటి కల్పన (27), ప్రియుడు జావేద్‌ను అరెస్టు చేశారు. సతీష నగరంలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్వైజర్. భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి యశ్వంతపురలోని సుబేదార్ పాళ్యలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కల్పన కన్నడ సీరియల్స్‌లో నటిస్తోంది. అక్కడే పరిచయమైన జావేద్‌తో అక్రమ సంబంధం కొనసాగుతోంది. దీనిపై సతీష్ ఆమెను పలుమార్లు మందలించాడు. దాంతో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. 25వ తేదిన రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. తిన్న వెంటనే సతీష్ మత్తులో పడిపోయాడు. ప్రియుడు జావేద్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి సతీష్‌ను సుత్తితో తలపైన కొట్టిచంపారు. తన భర్తను ఎవరో వచ్చి హత్య చేశారని విలపించింది. పోలీసులు అనుమానంతో కల్పనను అదుపులోకి తీసుకుని విచారించగా, సోమవారం అసలు విషయం బయట పెట్టింది. దాంతో పోలీసుల ఈ జంటకు బేడీలు తగిలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తాగుబోతు భర్తను హతమార్చిన భార్య
ధర్మవరం రూరల్: మండలంలోని పోతుకుంట కాలనీకి చెందిన చంద్రకళ తన భర్తను హత్య చేసి ఊరి బయట పూడ్చివేసి ఆదివారం రూరల్ పోలీసులు ఎదుట లొంగిపోయింది. పోలీసుల వివరాల మేరకు.. పోతుకుంటకు చెందిన నరేంద్ర(45) అనంతపురంలోని ఓ కంపెనీలో సెక్యూరిటి గార్డు ఉద్యోగం చేస్తున్నాడు. రోజు తాగివచ్చి భార్యను కొడుతుండేవాడు. గత బుధవారం రాత్రి తాగి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. వెంటనే ఆమె ఇంటి బయట వున్న రాయితో తలపై బాధడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరితో కలసి శవాన్ని ఊరి బయట వున్న సాకిరేవు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా ఎవరికి తెలియకుండా ఉన్నప్పటికి భయం వేసి పోలీసుల వద్ద లొంగిపోయింది. ఎస్ఐ యతీంద్ర, ఏఎస్ఐ నాగప్పలు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తాగివచ్చి కొడుతుండడంతో ఆమె చంపిందా? లేక అక్రమ సంబంధంతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు!
కళ్యాణదుర్గం : కుందుర్పి మండలం కరిగానిపల్లెకు చెందిన గూగుళ్ల రుద్రన్న ఇదే మండలం అపిలేపల్లి సమీపంలో గత నెల 10న అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో భార్యే హంతకురాలని తేలింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో ప్రియుడితో కలసి భర్తను హతమార్చినట్లు తమ విచారనలో తేలిందని కళ్యాణదుర్గం సీఐ శివప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు బుధవారం తెలిపారు. గూగుళ్ల రుద్రన్న, భార్య అనిత బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ కర్ణాటకకు చెందిన హనుమంతునిపల్లి వాసి వడ్డే గురుమూర్తితో అనితకు పరిచయం ఏర్పడిందన్నారు. అది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. ఈ విషయం తెలిసి భర్త అనితను తరచూ ప్రశ్నిస్తూ గొడవపడేవారన్నారు. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె ప్రియుడితో కలసి అతను తన స్నేహితుడు చెన్నరాయుడుతో కలసి ఫిబ్రవరి 10న మద్యం ఇప్పిస్తామని ఆశ చూపి, రుద్రన్నను ఊరి బయటకు తీసుకెళ్లారు. అక్కడ సదరు వ్యక్తులు బండరాయితో అతని తలపై బాది, హతమార్చి పారిపోయారు. హత్య కేసులో నిందితురాలైన మృతుని భార్య అనిత, ఆమె ప్రియుడు గురుమూర్తి, అతని స్నేహితుడు చెన్నరాయుడును కుందుర్పిలో అరెస్టు చేసినట్లు వివరించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించారన్నారు. -
కాటేసిన సవతి ‘ప్రేమ’
భర్త, కుమారుడి దారుణ హత్య ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం మరో కుమారుడి పరిస్థితి విషమం ఆమె పేరు ప్రేమ. కానీ ఆమె మనసు నిండా విషం దాగి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తను.. ముక్కుపచ్చలారని పిల్లలను కర్కశంగా కత్తితో పొడిచింది. భర్త, మరో బాలుడు ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో ఇంకో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. ప్రొద్దుటూరు క్రైం: భర్త, పిల్లలపై అసూయ పెంచుకున్న ఓ సవతి తల్లి వారిని హత మారిస్తే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని భావించింది. పక్కా ప్లాన్‌తో భర్తతో పాటు పిల్లలిద్దరిని కత్తితో దారుణంగా పొడిచింది. భార్య చేతిలో భర్త సురేష్(48), మొదటి భార్య కుమారుడైన సుచి(15) మృతి చెందగా మరో కుమారుడు సుమేష్(11)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని త్రిశూర్ జిల్లా, పున్నగుళం మండలం, చిట్టెనూరు గ్రామానికి చెందిన శ్రాంబిక్కల్హౌష్ సురేష్ 15 ఏళ్ల క్రితం మైదుకూరుకు వచ్చి స్థిరపడ్డాడు. గుడ్‌బాయ్ అప్పడాల వ్యాపారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు సరఫరా చేసేవాడు. అతనికి సుచి, సుమేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా సురేష్ మొదటి భార్య షీమోల్ను 12 ఏళ్ల క్రితం వదిలేశాడు. తర్వాత అతను అదే గ్రామానికి చెందిన ప్రేమ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సుప్రీమ్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో సురేష్ ఏడాది క్రితం ప్రొద్దుటూరులోని కోనేటికాలువ వీధికి వచ్చి గుడ్‌బాయ్ అప్పడాల వ్యాపారం ప్రారంభించాడు. పట్టణంలోని సార్వకట్టవీధిలోని శ్రీగురురాఘవేంద్ర స్కూల్లో సుచి 8వ తరగతి చదువుతుండగా, సుమేష్ 5వ తరగతి చదువుతున్నాడు. బంధువులకు రూ. 2లక్షలు డబ్బు ఇచ్చాడని.. మొదటి భార్య పిల్లల పట్ల ప్రేమ ఎప్పుడూ కపట ప్రేమ చూపేది. ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం చేసినా సుమేష్, సుచిలకు సరిగా పెట్టేది కాదు. అందువల్ల వారి ఆలనా పాలనా సురేష్ తల్లి సత్యభామ చూసుకునేది. పిల్లలపై అసూయతో ఎప్పుడూ వారిని తిట్టేది. ఇలా చేసినప్పుడల్లా భర్త ఆమెతో గొడవ పడేవాడు. ఇలా వారి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలో సురేష్ 10 రోజుల క్రితం తన సోదరి వివాహం కోసం రూ. 2లక్షలు ఇచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని భార్య వారం రోజుల నుంచి భర్తతో గొడవ పడేది. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న భర్త ‘నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా.. నువ్వు ఎవ్వరూ చెప్పడానికి.. ఎక్కువగా మాట్లాడితే ఉరి వేసి చంపేస్తానని’ భార్యను హెచ్చరించాడు. తనను నిజంగానే భర్త చంపేస్తాడేమోనని ఆమె భావించింది. దీంతో భర్తతో పాటు పిల్లలిద్దరిని చంపేస్తే వారి ఆస్తి తన కుమారుడికి వస్తుందని, అంతేకాకుండా వారిని వదిలించుకొని సుఖంగా ఉండవచ్చని ఆమె అనుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యా భర్తలిద్దరూ గొడవ పడ్డారు. భర్త, పిల్లలను హతమార్చాలని పక్కాగా ప్రణాళిక రూపొందించింది. గురువారం వేకువజామున అందరూ నిద్రిస్తుండగా ఆమె భర్త గదిలోకి వెళ్లి పిడి బాకుతో అతి కిరాతకంగా పొడిచేసింది. అతను గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న కుమారులిద్దరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. వారిని కూడా అదే కత్తితో ఆమె ఇష్టానుసారంగా పొడిచింది. భర్త సురేష్, పెద్ద కుమారుడు సుచి కొన్ని నిమిషాల తర్వాత మృతి చెందారు. మరో కుమారుడు సుమేష్ అపస్మారక స్థితిలో పడిపోవడంతో చనిపోయాడని భావించిన ప్రేమ కింది గదిలోకి వచ్చి పడుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకై తన కుమారుడు సుప్రీమ్‌ను కత్తితో స్వల్పంగా గాయ పరచి, తాను కూడా గాయ పరుచుకుంది. పని మనిషి రావడంతో ఘటన వెలుగులోకి.. ప్రొద్దుటూరుకు చెందిన శివ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి సురేష్ వద్ద పని చేస్తున్నాడు. గురువారం ఉదయాన్నే అతను వచ్చి సురేష్ ఇంటి తలుపు తట్టాడు. ఎంత సేపు పిలిచినా లోపలి నుంచి ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. దీంతో అతను కిటికీS వద్దకు వెళ్లి ఇంట్లోకి చూడగా సురేష్ రక్తపు మడుగులో పడివున్నాడు. అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు తెరిచారు. ముందుగా గాయాలతో ఉన్న సుమేష్, సుప్రీమ్, ప్రేమలను ఆటోలో వన్‌టౌన్ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుమేష్‌కు కత్తిపోట్లు ఎక్కువగా ఉండటంతో తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలియడంతో డీఎస్పీ పూజితానీలం, సీఐ బాలస్వామిరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారి కుటుంబ సన్నిహితుడు ఆవుల దస్తగిరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. నానమ్మ ఉండి ఉంటే.. సుమేష్, సుచిల బాగోగులు రోజూ వారి నాన్నమ్మ సత్యభామనే చూసుకునేది. మొదటి పిల్లలిద్దరూ నాన్నమ్మతోనే ఉండేవారు. సవతి తల్లి ప్రేమతో వారికి అనుబంధం తక్కువే అని చెప్పవచ్చు. కేరళలోని తమ బంధువులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సత్యభామ 20 రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. ఆమె ముందు భార్యా భర్తలు గొడవ పడేవారు కాదు. ఆమె ఇంట్లో ఉండి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని బంధువులు చర్చించుకుంటున్నారు. అమ్మే పొడిచింది.. కుటుంబంలోని ఇద్దరు మృతి చెందారు, ముగ్గురు గాయపడ్డారు. అందరూ ప్రమాదకర స్థితిలో ఉండటంతో పోలీసులకు అర్థం కాలేదు. బయటి వ్యక్తులు వచ్చి డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారేమోనని భావించారు. అయితే గాయాలతో ఉన్న ప్రేమ కుమారుడు సుప్రీమ్‌ను ప్రశ్నించగా తమ అమ్మే తనను కత్తితో పొడిచిందని చెప్పాడు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై ఒక అవగాహనకు వచ్చారు. కొంత సేపటి తర్వాత ఆమెను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరి ప్రమేయమైనా ఉందా.. ఒక్క మహిళ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించిందంటే పోలీసులు విశ్వసించడం లేదు. మరో వ్యక్తి ప్రమేయంతో ఆమె దారుణానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయాల కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారించలేకపోతున్నారు. విషయం తెలియడంతో కేరళ నుంచి సురేష్ బంధువులు ప్రొద్దుటూరుకు బయలుదేరారు. -
భర్తను కడతేర్చిన భార్య
చంపి పాతబావిలో పూడ్చివేత ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన పరారీలో నిందితులు మామునూరు : కూతురు, అల్లుడి సహకారంతో ఓ మహిళ భర్తను కడతేర్చి, మృతదేహాన్ని పాతబావిలో పూడ్చిపెట్టిన ఘటన హన్మకొండ మండలం రామకిష్టాపురం శివారులో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. మామునూరు సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మహబూబబాద్ మండలం ఆమనగల్ శివారు ఖస్నా తండాకు చెందిన బానోత్ భిక్షపతి (53) భార్య రాములమ్మ, కూతురు సునితతో కలిసి 15 ఏళ్ల క్రితం రామకిష్టాపురం వచ్చాడు. ఓ రైతు వద్ద 1.20 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మల్లె, గులాబి సాగు చేస్తూ పూలను వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. పదేళ్ల క్రితం అమనగల్ శివారు మెుగిలితండాకు చెందిన లావుడ్యా ఓంజీతో కూతురు వివాహం చేశాడు. ఆ తర్వాత బిక్షపతి దంపతుల మధ్య ఆర్థిక కలహాలు ప్రారంభమయ్యాయి. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ చేసినా, గొడవలు సద్దుమణగలేదు. కాగా, ఈనెల 18న ఉదయం 10 గంటలకు బిక్షపతి మొబైల్ కొనుగోలు చేస్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని రాములమ్మ 25న మామునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హత్య చేసిన తీరు ఇలా.. తన మాటలను బిక్షపతి లెక్కచేయడం లేదని, కూతురు, అల్లుడి సహకారంతో అతడిని మట్టుబెట్టాలని రాములమ్మ పథకం రచించింది. ఈనెల 17న వారిని ఇంటికి పిలిపించింది. 18వ తేదీ తెల్లవారుజామున ఆల్లుడు ఓంజీ, కూతురు సునితతో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి సైకిల్‌పై ఆల్లుడితో గ్రామ శివారులో పాడుబడిన బావి వద్దకు పంపించింది. ముగ్గురూ కలిసి గొయ్యితీసి మృతదేహాన్ని పూడ్చేశారు. తెల్లవారిన తర్వాత.. తన భర్త మెుబైల్ కొనుగోలుకు వెళ్లి తిరిగి రాలేదంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పింది. ఎవరికీ అనుమానం రాకుండా సాయంత్రం బంధువుల ఇళ్లు, బావులు, ఇతర ప్రాంతాల్లో వెదికారు. 25వ తేదీన రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య తర్వాత అమనగల్ వెళ్లిన కూతురు, అల్లుడు తమ పిల్లలను అక్కడే ఉంచి బుధవారం తిరిగి రామకిష్టాపూర్ వచ్చారు. అయితే సునిత ఆరేళ్ల కుమారుడు రాంచరణ్ హత్య విషయాన్ని బిక్షపతి సమీప బంధువు నూనావత్ లక్ష్మణ్‌కు చెప్పాడు. వెంటనే అతడు రాంచరణ్‌ను తీసుకుని రామకిష్టాపూర్ వచ్చి పాతబావిలో వెదకగా మృతదేహం కనిపించింది. దీంతో మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏసీపీ మహేందర్, సీఐ పి.శ్రీనివాస్, ఎస్సై రాంప్రసాద్ బావివద్దకు చేరుకుని పరిశీలించారు. ఆప్పటికే నిందితులు పరారయ్యారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. నిందితుల కోసం వెదుకుతున్నామని సీఐ తెలిపారు. -
మాకు ప్రాణ హాని ఉంది..
భార్య చేతిలో హతమైన రవి పిల్లలు, బంధువు పొన్నూరు : మండల పరిధిలోని మన్నవ గ్రామంలో భర్తను హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భార్య రేగులగడ్డ జ్యోతి కేసుకు సంబంధించి పలువురు నిందితులు పరారీలో ఉన్నారని, వారివల్ల తమకు ప్రాణహాని ఉందని హతుడు రేగులగడ్డ రవి పిల్లలు, బంధువులు ఆరోపిస్తున్నారు. హతుడు రవి కుమారుడు రాజేష్, కుమార్తె ప్రసన్న, తమ్ముడు వరసైన వాసు ఆదివారం మీడియాను కలిసి తమగోడు వెళ్ళబోసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... జ్యోతి, గ్రామానికి చెందిన పి. పాపారావుకు అక్రమ సంబంధం ఉందన్న విషయం హతుడు రవికి తెలుసన్నారు.ఈ విషయంపైనే తరచూ వారి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. రవి కష్టార్జితం లక్ష రూపాయిలు పాపారావు అప్పుగా తీసుకొని డబ్బులు అడిగిన సందర్భంలో రాసిచ్చిన ప్రామిసరీ నోటును కూడా చించేసి దుర్భాషలాడారన్నారు. ఈ క్రమంలోనే రవిని పథకం ప్రకారమే హత్య చేశారని, ఈ పథకంలో జ్యోతి, పాపారావుతో పాటు మరికొందరి హస్తం ఉందని కూడా వారు ఆరోపిస్తున్నారు. రవిని హత్య చేసిన అనంతరం మన్నవ దొప్పలపూడి గ్రామానికి మధ్య కొంతమంది వ్యక్తులు శవాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్య తీశారని, శవాన్ని మాయం చేయలేక జ్యోతి పోలీసులకు లొంగిపోవడంతో హత్యకు సహకరించిన నిందితులు పరారయ్యారని చెపుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న జ్యోతి, పాపారావులను కోర్టుకు హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారని, అయితే బయట ఉన్న వారివల్ల తమకు ప్రాణహాని ఉందని, ఆదివారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తమ గోడు వెళ్ళబోసుకున్నామని వారు వివరించారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
ఆకివీడు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ఎల్‌ఎన్‌పురంలో జరిగింది. ఎల్వీఎన్పురానికి చెందిన సీహెచ్. వెంకటేశ్వర్లు అదే ప్రాంతానికి చెందిన దుర్గను పెళ్లి చేసుకున్నాడు. దుర్గ పెళ్ళికి ముందే నాగేందర్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే దుర్గ పెళ్లి తరువాత కూడా అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భర్త అంటే ఇష్టం లేదని , అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుపై ఒత్తిడి తెచ్చింది. పథకం ప్రకారం చంపేందుకు ప్రియుడిని భర్తకు పరిచయం చేసింది. ఈ నెల 11వ తేదీన ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లును జన సంచారంలేని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఫుల్‌గా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతణ్ని భార్య దుర్గ, ప్రియుడు నాగేందర్ హతమార్చి కాలువలో పడేశారు. అనుమానాస్పద స్థితిలో దొరికన శవం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. -
భార్య ప్రియుడి దాడి: భర్త మృతి
హైదరాబాద్: భార్య ప్రియుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్సపొందుతూ మృతి చెందాడు. బంజారాహిల్స్ ఎస్ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. జాఫర్ (30) తన భార్యాబిడ్డలతో హకీంపేట కుంట ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరింటికి సమీపంలో ఉండే జగన్(35) జాఫర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా ఈనెల 11న జాఫర్.. అతని భార్య మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించారు. తిరిగి 13వ తేదీ రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో జాఫర్ మద్యం మత్తులో ఉన్నాడు. జాఫర్ భార్య జగన్‌కు విషయం చెప్పి రావాలని కోరింది. అప్పటికే జగన్ మద్యం తాగి ఉన్న అతను వచ్చాడు. జాఫర్.. జగన్‌ల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన జగన్.. జాఫర్‌ను పట్టుకొని పక్కనే ఉన్న బీరువాకు కొట్టాడు. జాఫర్ మెడకు బలమైన దెబ్బ తగలడంతో పాటు నరాలు దెబ్బతిన్నాయి. వెన్నుపూస ప్రాంతంలో తీవ్ర గాయమైంది. 13, 14 తేదీల్లో ఇంట్లోనే ఉన్న జాఫర్ పరిస్థితి విషమించింది. మాట పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే జాఫర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న జాఫర్ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసులు ఐపీసీ 304 కింద కేసు నమోదు చేసి జగన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అడ్డుగా ఉన్నాడని అంతం చేసింది
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిందో మహిళ. తాగిన మైకంలో కింద పడి మృతి చెందాడని మొదట అందరినీ నమ్మించేందుకు యత్నించింది. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా తానే మరో యువకుడి సహకారం తీసుకొని హత్య చేశానని ఒప్పుకుంది. సోమవారం రాయదుర్గం సీఐ దుర్గప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా, చీరాలకు చెందిన గవిని సత్యనారాయణ(39), హిందూపూర్‌కు చెందిన సొంటిపాయి భావన(25) 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వస్త్ర వ్యాపారం చేసే సత్యనారాయణ నష్టాలు రావడంతో ఐపీ పెట్టాడు. ఈ క్రమంలోనే మణికొండ శ్రీనివాస కాలనీలోని సిల్వర్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ తరచూ ఆమెతో గొడవపడేవాడు. హిందూపూర్‌లోని తల్లిగారి ఇంట్లో ఉన్న తన సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ఈనెల 10న భర్తకు చెప్పి భావన వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లలేదని తెలిసి భర్త... ఫోన్ కాల్ డాటా ఆధారంగా భావన తిరుపతిలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడి వెళ్లాడు. ‘నీ విషయం నాకు తెలిసిపోయింది. నేను తిరుపతి వచ్చా’ అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో భావనతో పాటు ఆమె క్లాస్‌మెట్ కుమార్ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. ఇద్దరూ కలిసి రావడంతో భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. నీవు హిందూపూర్ వెళ్లు.. నేను చీరాల వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. దీంతో తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భావన ప్రియుడు కుమార్‌తో కలిసి పథకం వేసింది. ఈనెల 15న జూబ్లీహిల్స్‌లో స్నేహితుల వద్ద ఉన్న భర్తకు ఫోన్ చేసి.. నేను మన ఫ్లాట్‌కు వచ్చా.. నీవు కూడా రా అని పిలిచింది. అతను వెళ్లాక ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి బిర్యానీ, మద్యం తెచ్చుకున్నారు. భావన బిర్యానీ తినగా.. సత్యనారాయణ మద్యం తాగాడు. ముందే వేసుకున్న పథకం ప్రకారం.. హిందూపూర్ నుంచి తన్వీర్(22) అనే యువకుడిని హైదరాబాద్‌కు రప్పించింది. సాయంత్రం 6 గంటలకు అతడికి ఫోన్ చేసి ఫ్లాట్‌కు పిలిచింది. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను అతడు గట్టిగా పట్టుకోగా... భావన పప్పు గుత్తితో భర్త గొంతుపై బలంగా నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తాగిన మైకంలో కిందపడి చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మృతుడి మెడ కమిలిపోయి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి భావనను విచారించగా తానే తన్వీర్ సహాయంతో చంపేశానని ఒప్పుకుంది. కాగా, హిందూపూర్ నుంచి వచ్చిన తన్వీర్‌కు భావన.. భర్తను చంపేందుకు తనను పిలించిందని మొదట తెలియదని పోలీసులు తెలిపారు. హత్యకు తన్వీర్ ముందు ఒప్పుకోలేదని, అయితే, అతడిని కూడా చంపేస్తానని భావన భయపెట్టిందన్నారు. నిందితులు భావన, తన్వీర్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నారు. -
భర్త హత్యకు ప్రతీకారంగా..
భోపాల్: తన భర్తను చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మహిళ తన బంధువులైన మరో ముగ్గురు మహిళలతో కలసి నిందితుడి ఇంటిని తగులబెట్టింది. మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్పూర్ జిల్లా మహేంద్ర గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు కైషియా దామోర్ ఇటీవల పనికోసం పొరుగునే ఉన్న గుజరాత్‌లోని బరోడా జిల్లా ఇండికా గ్రామానికి వెళ్లాడు. అక్కడ దాల్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డాడు. ఇతనిది దాహోద్ జిల్లాలోని ఉఛిసదెడ్ గ్రామం. దామోర్.. దాల్ సింగ్‌ను హత్య చేసి పారిపోయాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. దామోర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు దాల్ సింగ్ భార్య జైలాబాయ్ మరో ముగ్గురు బంధువులతో కలసి శుక్రవారం ఉదయం మహేంద్ర గ్రామానికి వెళ్లింది. నలుగురు కలసి దామోర్ ఇంటిని తగులబెట్టారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఇంట్లోని వస్తువులు, నగలు, ధాన్యం మంటల్లో కాలిపోయాయని అలిరాజ్పూర్ జిల్లా ఎస్పీ కుమార్ సౌరభ్ చెప్పారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దున గల ఈ ప్రాంతంలో గిరిజనులు ప్రతీకార చర్యగా ఇంటిని తగులబెట్టడం ఆనవాయితీగా వస్తోందని, అయితే మహిళలు ఈ పనిచేయడం ఇదే తొలిసారని ఎస్పీ చెప్పారు. -
కొట్టి..కొట్టి చంపేశాడు..!
వేదమంత్రాల సాక్షిగా తాళికట్టాడు.. ఏడడుగులు నడిచి తోడుగా ఉంటానన్నాడు.. అదనపు కట్నం కోసం చివరకు మూడుముళ్ల బంధాన్నే మరచిపోయాడు.. కలకాలం కాపాడుతానని ప్రమాణం చేసిన అతడే ఆమె పాలిట కాలయముడయ్యాడు.. పుట్టింటి నుంచి కట్నం తేలేదంటూ ఆ ఇల్లాలిని కొట్టి..కొట్టి చంపేశాడు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసిన ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు. - కొరటికల్(మునుగోడు) మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన జోలం ఎర్రయ్య, యాదమ్మల కుమారుడు లింగస్వామికి ఆరేళ్ల క్రితం పీఏపల్లి మండల పరిధిలోని అజ్మాపూర్ గ్రామానికి చెందిన సీత బుచ్చయ్య, ముత్యాలమ్మ కుమారై పద్మ(23)తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 లక్షల కట్నంతో పాటు 5 తులాల బంగారం, ఇంటి సామగ్రి ముట్టజెప్పారు. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. పురుగులమందు తాగిందని.. కట్నం కోసం లింగస్వామి బుధవారం కూడా భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు..మరుసటి రోజు గురువారం కూడా చావబాదడంతో పద్మ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో భయాందోళనకు గురై జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. పురుగుల మందు తాగిందని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం పద్మ మృతిచెందింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పద్మ పుట్టింటి వారు ఆమె మృతదేహాన్ని చూసి, ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే హత్య చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో నల్లగొండ డీఎస్పీ రాములునాయక్, చం డూర్ సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్ఐ డానియల్‌కుమార్‌లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. పురుగులమందు తాగిన ఆనవాళ్లు కనిపించకపోవడం, ఒంటిపై గాయాలు ండడంతో భర్త కొట్టడంతోనే మృతిచెంది ఉంటుందని భావిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతురాలి సొదరుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం వేధించి కొట్టి చంపిన భర్తతో పాటు ఆమె అత్తా, మామ ఎర్రయ్య, యాదమ్మలతో పాటు ఆడపడుచులు సైదమ్మ, ధనమ్మ, వనమ్మలపై కేసు నమోదుచేసి దర్యాఫ్తు జరుపుతున్నట్లు తెలిపారు. కట్నం కోసం.. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న లింగస్వామి అదనపు కట్నం తేవాలని భార్యను మూడేళ్లుగా వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా రోజూ మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా కొట్టేవాడు. ఈ క్రమంలో పద్మ పుట్టింటికి తెలపడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మూడు సార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో తీరుమార్చుకుంటానని నమ్మబలికాడు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- భార్యతోపాటు ముగ్గురు నిందితుల అరెస్టు దొడ్డబళ్లాపురం: ప్రియుడి మోహంలో పడిన భార్య తాళి కట్టిన భర్తనే కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన తాలూకాలోని దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు భార్యతో కలిపి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు గురైన వ్యక్తిని హిందూపురానికి చెందిన మంజునాథ్ బాబు(25)గా గుర్తించారు. హత్యకు సంబంధించి మృతుడి భార్య సరస్వతి(19), ఆమె ప్రియుడు హరీష్, అతని బంధువు జగదీష్‌లను ఒడ్డబెళవంగల పోలీసులు అరెస్టు చేశారు. 40 రోజుల క్రితం దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూగేనళ్లి గేట్ వద్ద ఉన్న నీలగిరి తోపులో సగం కాలిన శవం లభిం చింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు హతుడిని గుర్తించారు. గౌరిబిదనూరు తాలూకాలోని కురుగోడు తమ్మనహళ్లికి చెందిన సరస్వతికి సమీపంలోని కాచమాచనహళ్లికి చెందిన హరీష్‌తో వివాహానికి ముందే ఐదేళ్లుగా సంబంధం ఉండేది. అయితే పెద్దల మాట కాదనలేక సరస్వతి హిందూపురానికి చెందిన బెంగళూరు ఆంధ్రహళ్లిలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న మంజునాథ్ బాబును వివాహం చేసుకుంది. ఈ క్రమంలో సరస్వతి అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లాలని చెప్పి ప్రియుడిని కలుస్తుండేది. ఒక రోజు అర్ధరాత్రి సరస్వతి ప్రియుడితో మాట్లాడుతున్నప్పుడు విన్న మంజునాథ్ బాబు దీన్ని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయిన సరస్వతి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. పథకంలో భాగంగా సరస్వతి ఒకరోజు పుట్టింటికి వెళ్లి మే 16వ తేదీన తనను అర్జెంటుగా పుట్టింటి నుంచి తీసుకువెళ్లాలని భర్తకు ఫోన్ చేసింది. భార్యను తీసుకు వెళ్లడానికి మంజునాథ్‌బాబు రాత్రి 9 గంటల సమయంలో గౌరిబిదనూరు బస్టాండులో దిగాడు. అప్పటికే బస్టాండులో ఇండికా కారుతో వేచి ఉన్న హరీష్, జగదీష్ ఇద్దరూ గ్రామానికి తీసుకెళ్తామని చెప్పి మంజునాథ్‌బాబును కారులో ఎక్కించుకున్నారు. కారులోనే తాడుతో గొంతు బిగించి హత్య చేసి దొడ్డబళ్లాపురం తాలూకా మూగేనహళ్లి గేట్ వద్ద శవాన్ని తెచ్చి కాల్చి వేశారు. -
అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని...
కట్టుకున్న భర్తను అనుమానంతో హత్య చేయించిందో భార్య. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతం గజియాబాద్‌లోని గాంగ్ నహర్లో గురువారం అర్థరాత్రి దాటాక చోటుచేసుకుంది. దిల్షాద్, రబియా ఇద్దరు భార్య భర్తలు. అయితే, దిల్షాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిబియా అనుమానించింది. దాంతో భర్తను అంతమొందించేందుకు ఆమె స్నేహితురాలు హబియా, ఆమె భర్త మౌజుద్దీన్ ల సాయం తీసుకుంది. దీంతో వారు ముగ్గురు కలిసి పథకం వేసి ... ఓ కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేశారు. రాత్రి భోజనం చేసిన అనంతరం రబియా తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి వెళ్లగానే ఆమె స్నేహితురాలు హబియా, హబియా భర్త మౌజుద్దీన్, కిరాయి హంతకుడు నూర్ మహ్మద్ కలిసి దిల్షాద్ గొంతునులిమి హత్య చేశారు. అనంతరం అతడికి బుర్ఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు, భార్య రబియాను అరెస్టు చేశారు. -
ప్రియుని సాయంతో భర్త హత్య
చినారుకట్ల వద్ద జరిగిన హత్య కేసు ఛేదన ఆరు రోజుల్లోనే పురోగతి నిందితులు కటకటాల పాలు మార్కాపురం, న్యూస్‌లైన్ : తనను వేధిస్తున్న భర్తను ప్రియుడి సాయంతో ఓ మహిళ మట్టుబెట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ నెల 5న దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చినారుట్ల దగ్గరలోని నంది మలుపు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు తన కార్యాలయంలో మంగళవారం నిందితులను ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మృతుడు బాణావత్ భీమారావు స్వగ్రామం కృష్ణా జిల్లా మైలవరం మండలం కనిమెర్ల. వృత్తి రీత్యా కారు డ్రైవర్ అయిన భీమారావు అదే జిల్లాలోని పెనమలూరులో నివాసం ఉంటున్నాడు. తోటి డ్రైవర్ సలీమ్‌తో స్నేహం ఏర్పరచుకున్నాడు. అతని వద్ద కొంత అప్పు చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో సలీమ్.. భీమారావు ఇంటికి వస్తూపోతుండేవాడు. ఇలా భీమారావు భార్య కోటేశ్వరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. నిదానంగా వారి వ్యవహారం గమనించిన భీమారావు తన భార్యను కొట్టడం.. తిట్టడం చేస్తుండేవాడు. సలీమ్ కనపడినప్పుడల్లా గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో కోటేశ్వరి, సలీం కలిసి భీమారావును చంపాలని నిర్ణయించుకున్నారు. సలీమ్.. పెనమలూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తన అన్న కొడుకు షేక్ ఇమ్రాన్‌ను సంప్రదించాడు. ఇమ్రాన్ తన కు అన్న వరస అయిన చాంద్‌బాషాతో కలిశాడు. అతను కూడా విజయవాడలోని పాయకాపురంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చాంద్‌బాషాపై అప్పటికే కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది. పథకం పన్ని మెడ చుట్టూ వైరు బిగించి.. గత నెల 28న విజయవాడలోని హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ముగ్గురూ కలిసి హత్య ఎలా చేయాలో ప్లాన్ వేశారు. 29న సలీమ్, చాంద్‌బాషా, ఇమ్రాన్లు కుమారి అనే కాల్ గర్ల్, భీమారావుతో పాటు పెనమలూరు నుంచి బయలుదేరి మార్గమధ్యంలో మద్యం సేవించారు. తర్వాత వినుకొండలో క్లచ్ వైరు కొనుగోలు చేసి అదే రోజు రాత్రి 8.30 గంటలకు దోర్నాల చెక్‌పోస్టు దాటి నల్లమల అడవుల్లోకి ప్రవేశించారు. రాత్రి 12.30 గంటల సమయంలో చినారుట్ల దగ్గరలోని నంది టర్నింగ్ వద్ద ఆపి మళ్లీ మద్యం సేవించారు. ఇదే సమయంలో భీమారావు కారు దిగగానే సలీమ్, ఇమ్రాన్లు అతని చేతులు, కాళ్లు పట్టుకోగా, చాంద్‌బాషా క్లచ్ వైరును భీమారావు గొంతుకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని లోయలో పడవేశారు. అందరూ కలిసి సున్నిపెంట, నల్గొండ మీదుగా విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలుసుకొని ముగ్గురు నిందితులతో పాటు కోటేశ్వరి ఓ కారులో పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఈ నెల 10న సంతమాగులూరు జంక్షన్‌లోని పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించుకుని వెళ్లబోతుండగా మాటు వేసిన వై. పాలెం సీఐ పాపారావు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య సమయంలో కాల్ గారల్ సంఘటనా స్థలంలోని కారులోనే ఉన్నట్లు తెలిసింది. భర్తను హత్య చేసేందుకు సహకరించిన కోటేశ్వరి సహా నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన యర్రగొండపాలెం సీఐ పాపారావు, దోర్నాల ఎస్సై బ్రహ్మనాయుడు, సిబ్బందిని అభినందించారు. -
భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవం
ముంబై: భర్తను చంపిన భార్యకు ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. సోనాలి గిరి (26) ట్రయల్ కోర్టు తనకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ తాహిల్ రమణి, విఎల్ అచ్లీయాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. బీర్‌బార్‌లో పనిచేసే సోనాలి గిరి డిసెంబర్ 30, 2009లో మద్యం సేవించి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త సంతోష్ సోదరుడు సంజయ్‌కి ఫోన్ చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ చేసింది. వారు వచ్చి చూసేటప్పటికీ మృతదేహం నేలపైనే పడిఉంది. వైద్య పరీక్షలో సంతోష్‌ది ఆత్మహత్య కాదని, హత్యకు గురయ్యాడని తేలింది. వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసిన ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి దోషిగా ప్రకటించింది.