ముంబై: భర్తను చంపిన భార్యకు ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. సోనాలి గిరి (26) ట్రయల్ కోర్టు తనకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ తాహిల్ రమణి, విఎల్ అచ్లీయాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. బీర్‌బార్‌లో పనిచేసే సోనాలి గిరి డిసెంబర్ 30, 2009లో మద్యం సేవించి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త సంతోష్ సోదరుడు సంజయ్‌కి ఫోన్ చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ చేసింది. వారు వచ్చి చూసేటప్పటికీ మృతదేహం నేలపైనే పడిఉంది. వైద్య పరీక్షలో సంతోష్‌ది ఆత్మహత్య కాదని, హత్యకు గురయ్యాడని తేలింది.
వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసిన ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి దోషిగా ప్రకటించింది.