![Woman and friend arrested for killing husband at Doddaballapuram - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/cr.jpg.webp?itok=VdJP3qaZ)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): భార్య అక్రమ సంబంధం మోజులో భర్తను బలిగొన్న సంఘటన రామనగర తాలూకా హారోహళ్లిలో వెలుగు చూసింది. గొట్టిగెహళ్లి సమీపంలో ఇటీవల కాలిపోయిన స్థితిలో సుమారు 27 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి శవం లభ్యమైంది.
కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మృతుడు కిరణ్‌గా గుర్తించారు. విచారణ జరిపి అతని భార్య, ఇద్దరు నిందితులను అరెస్టు చేసారు. కిరణ్ భార్య, ప్రధాన నిందితుడు యశ్వంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్త కిరణ్‌ను అంతం చేసిందని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉంది.
చదవండి: (Hyderabad: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!)
Comments
Please login to add a commentAdd a comment