![Doddaballapuram Extramarital Affair Assassination - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/16/mama.jpg.webp?itok=fDtgT0fZ)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కర్ణాటక(దొడ్డబళ్లాపురం): రామనగర తాలూకా భైరవనదొడ్డి గ్రామ సమీపంలోని తోటలోని ఇంట్లో ఫిబ్రవరి 25న జరిగిన కాంగ్రెస్ నాయకుడు గంటప్ప (55) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. గంటప్ప కోడలు ప్రియుడితో కలిసి మామను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. గంటప్ప కోడలు చైత్ర (28) తన మామ ఆస్తిలో భాగం ఇవ్వలేదనే అక్కసుతో తన ప్రియుడు నవీన్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
గంటప్ప కుమారుడు నందీష్‌ను వివాహం చేసుకోవడానికి ముందు చైత్ర నవీన్‌ను ప్రేమిస్తుండేది. వివాహం అనంతరం కూడా నవీన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ క్రమంలో మామ గంటప్ప ఆస్తి ఇవ్వలేదనే కోపంతో నవీన్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. పథకం ప్రకారం నవీన్ గంటప్పను హత్య చేశాడు. ఈ కేసులో బిడది పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
చదవండి: (వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి)
Comments
Please login to add a commentAdd a comment