
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు: ప్రియునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని అతనితో కలిసి భర్తను కడతేర్చిందో భార్య. ఈ సంఘటన బాగేపల్లి తాలూకాలోని పోలానాయకనహళ్లి వద్ద జరిగింది. నరసింహప్ప (35)ను భార్య అలివేలు, బొమ్మసంద్ర గ్రామానికి చెందిన ప్రియుడు వెంకటేష్‌తో కలిసి మద్యం తాగించి బండరాళ్లతో బాది చంపారు. చేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యభర్తలు ఇద్దరూ కూలిపనులకు వెళ్లేవారు. అక్కడ అలివేలుకు వెంకటేష్‌తో పరిచయమైంది. రెండేళ్ల నుంచి వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడడంతో భర్తకు తెలిసి వెంకటేష్‌ను హెచ్చరించాడు.
మద్యం తాగుదామని తీసుకెళ్లి
దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 24వ తేదీన సాయంత్రం అలివేలు, ప్రియుడు వెంకటెష్ కలిసి నరసింహప్పను మందు తాగుదామని చెప్పి బొమ్మసంద్ర సమీపంలో ఉన్న ఎర్రమట్టి గుంతల వద్దకు తీసుకెళ్లారు. అతడు మద్యం మత్తులో ఉండగా ఇద్దరూ బండరాళ్లతో కొట్టి హత్య చేసి అక్కడే చిన్న గుంత తీసి పాతిపెట్టి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల తరువాత భర్త కనిపించడం లేదని ఏడుస్తూ అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం విచారణలో ఇద్దరి నేరం బయటపడడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment