bagepalli
-
సుదీప్ ప్రచారం పై కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి కామెంట్స్
-
ప్రియుడితో సంతోషానికి భర్త అడ్డు.. అంతు చూసిన భార్య
సాక్షి, బెంగళూరు: ప్రియునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని అతనితో కలిసి భర్తను కడతేర్చిందో భార్య. ఈ సంఘటన బాగేపల్లి తాలూకాలోని పోలానాయకనహళ్లి వద్ద జరిగింది. నరసింహప్ప (35)ను భార్య అలివేలు, బొమ్మసంద్ర గ్రామానికి చెందిన ప్రియుడు వెంకటేష్‌తో కలిసి మద్యం తాగించి బండరాళ్లతో బాది చంపారు. చేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యభర్తలు ఇద్దరూ కూలిపనులకు వెళ్లేవారు. అక్కడ అలివేలుకు వెంకటేష్‌తో పరిచయమైంది. రెండేళ్ల నుంచి వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడడంతో భర్తకు తెలిసి వెంకటేష్‌ను హెచ్చరించాడు. మద్యం తాగుదామని తీసుకెళ్లి దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 24వ తేదీన సాయంత్రం అలివేలు, ప్రియుడు వెంకటెష్ కలిసి నరసింహప్పను మందు తాగుదామని చెప్పి బొమ్మసంద్ర సమీపంలో ఉన్న ఎర్రమట్టి గుంతల వద్దకు తీసుకెళ్లారు. అతడు మద్యం మత్తులో ఉండగా ఇద్దరూ బండరాళ్లతో కొట్టి హత్య చేసి అక్కడే చిన్న గుంత తీసి పాతిపెట్టి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల తరువాత భర్త కనిపించడం లేదని ఏడుస్తూ అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం విచారణలో ఇద్దరి నేరం బయటపడడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) -
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి మృతి
సాక్షి, బాగేపల్లి/చిక్కబళ్లాపురం: ప్రజల కోసం నిరంతరం పోరుబాటలో నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీరామరెడ్డి (75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సీపీఎం పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన మోకాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. బాగేపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జీవి శ్రీరామరెడ్డి పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి, నిడుమామిడి పీఠాధ్యక్షుడు వీరభద్ర చెన్నమల్ల మహా స్వామీజీ, మాజీ కేంద్ర మంత్రి. కే.హెచ్. మునియప్ప, ఎమ్మెల్యే రమేష్ కుమార్, కే.శ్రీనివాస్‌గౌడ,హెచ్.ఎన్.శివశంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.సంపంగి, డాక్టర్ ఎం.సి.సుధాకర్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జీవీకి ఘన నివాళి అర్పించారు. చదవండి: (నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్) -
బాలికపై స్నేహితుడు లైంగికదాడి.. అది చూసి మరో ముగ్గురు..
సాక్షి, బెంగళూరు(బాగేపల్లి): మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చూసిన మరో ముగ్గురు యువకులు వారిద్దరిని బెదిరించి ఆ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. వివరాలు.. సోమవారం పదో తరగతి పరీక్ష రాసి స్నేహితునితో కలసి బాలిక గ్రామానికి వస్తోంది. గ్రామ సమీపంలోకి రాగానే బాలికపై ఆ స్నేహితుడు అత్యాచారం చేశాడు. వీరిని వెనుక నుంచి వెంబడిస్తూ వచ్చిన ముగ్గురు యువకులు బాలికను, ఆమె స్నేహితున్ని పట్టుకున్నారు. మీ తతంగాన్ని వీడియో తీశామని తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. ఈ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఇంతలో స్నేహితుడు పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులను పిలుచుకుని వచ్చాడు. గ్రామస్తులను చూసిన ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. బాగేపల్లి పోలీసులు బాలిక స్నేహితునితో పాటు పరారీలో ఉన్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: (అక్రమ సంబంధం మోజులో... భర్త దారుణ హత్య) -
కరోనా మృత్యుఘంటికలు: ఏడుగురు మృత్యువాత
బాగేపల్లి: బాగేపల్లి తాలూకా పరగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరెడ్డిపల్లి గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తోంది. 20 రోజుల్లో ఏడు మంది చనిపోయారు. ఏ రోజు ఎవరి ఇంట మృత్యుఘంట వినిపిస్తుందోనని గ్రామస్తులు కంటిమీద కునుకులేకుండా ఉన్నారు. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో గ్రామస్తులు ఎవరూ బయటకు రావడానికి జంకుతున్నారు. తొలుత కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు కోరినా పట్టించుకోని వారు ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు చేయించుకుందామా అని చూస్తున్నారు. గ్రామంలో మొత్తం 34 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. -
మోదీపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరైనవి కాదు
-
బాలయ్యకు సాయికుమార్ ఝలక్
సాక్షి, అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని సినీ నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. మంగళవారం సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు. కర్ణాటక శాసనసభా ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు. కాగా, 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి సాయికుమార్ ఓటమిపాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. -
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
-
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
- టోల్‌ప్లాజాపై ఎంపీ నిమ్మల తనయుల వీరంగం - అనుచరులతో కలసి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం హిందూపురం అర్బన్/ చిలమత్తూరు/ బాగేపల్లి (కర్ణాటక): తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. అనుచరులతో కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగులగొట్టారు. సోమవారం ఉదయం పది గంటలకు ఎంపీ పెద్ద కుమారుడు అంబరీష్ ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)లో, అతని స్నేహితులు ఫోర్డ్ కారు (ఏపీ02 ఈబీ 6777)లో కర్ణాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బందికి ఎంపీ పాస్ జిరాక్సు కాపీ చూపించారు. దాన్ని పరిశీలించిన సిబ్బంది.. ‘ఇది వ్యాలిడిటీ అయిపోయింది. ఈ పాస్ కేవలం పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ అనుమతి లేదు. అయినా ఎంపీ కుమారుడివి కావడంతో ఈసారి అనుమతిస్తున్నామ’ని చెప్పా రు. అయితే.. తన స్నేహితుల ఫోర్డ్ కారుకు కూడా అనుమతివ్వాలని అంబరీష్ పటు ్టబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. ‘ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తోందా? తమాషా చేస్తున్నారా?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. టోల్‌ప్లాజా సిబ్బంది వారించినా అతను వినలేదు. వారిపై శివాలెత్తుతూనే.. గోరంట్లలోని తన తమ్ముడు నిమ్మల శిరీష్, ఇతర అనుచరులకు ఫోన్ చేసి రప్పించాడు. కొంతసేపటికి కారులో శిరీష్‌తో పాటు ఏడుగురు అక్కడికి చేరుకుని టోల్‌ప్లాజాపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. రెండు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి బెంగళూరు వైపు వెళ్లిపోయారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారు బాగేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. -
హిందూపురం ఎంపీ వర్గీయుల దౌర్జన్యం
-
టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎంపీ కుమారుడి దౌర్జన్యం
అనంతపురం: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్గేట్ వద్ద సిబ్బంది టోల్ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు. బాగేపల్లి టోల్గేట్ వద్ద ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను సిబ్బంది టోల్ ఫీజు అడిగారు. దీంతో ఆగ్రహించిన వారు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటంతో పాటు.. అద్దాలు, కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. స్వయంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ ఈ దాడికి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. ఎంపీలకు మినహాయింపు ఉంటుంది కానీ.. వారి తనయులకు టోల్ ఫీజు విషయంలో మినహాయింపు ఉండదని సిబ్బంది చెప్పడమే కిష్టప్ప వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. -
'మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతా'
తెలుగు, కన్నడ సినీ రంగంతో మంచి అనుబంధం 2018లో బాగేపల్లి నుంచి పోటీ చేస్తా 55వ జన్మదిన వేడుకల్లో డైలాగ్ కింగ్ సాయికుమార్ బెంగళూరు :కన్నడ,తెలుగు సినిమా ల్లో తనకంటు ఒక స్టార్ హోదాను సంపాదించుకున్న నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ బుధవారం 55వ వసంతంలోకి అడుగు పెట్టా రు. ఈ సందర్భంగా సాయిప్రకాశ్ దర్శకత్వంలో యదార్థగాథ ఆధారంగా రూపొందుతున్న కన్నడ సినిమా షూటింగ్లో పాల్గొన్న సాయికుమార్ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....40 సంవత్సరాలుగా తనకు తన కుటుంబానికి కన్నడ, తెలుగుసినిమా రంగాలతో మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. సంచలన విజంయ సాధించిన పోలీస్ స్టోరీ చిత్రం తనకు దక్షిణ సినీరగంలో తిరుగు లేని ఖ్యాతీని తెచ్చిందని తెలిపారు. 1972లో రంగస్థల నడుటుగా ప్రవేశించిన తనకు 1973లో దేవుడు చేసిన పెళ్లి సినిమా నటుడుగా గుర్తింపు వచ్చిందని అన్నారు. దివంగత నందమూరి తారకరామరావు నటించిన సంసారం సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేయడం మరిచిపోలేని అనుభూతి అని అన్నారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యి సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేశానన్నారు. గతంలో తాను బీజేపీ తరఫున కర్ణాటకలోని బాగేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని, 2018లో జరిగే ఎన్నికల్లో మరోసారి బాగేపల్లి నుంచి బరిలో దిగనున్నట్లు సాయికుమార్ తెలిపారు. ప్రస్తుతం కన్నడలో మడమక్కి, కిస్మత్ చిత్రల్లో నటిస్తున్నానని, 2018లో ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజాసేవకే అంకితమవుతానని తెలిపారు. తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తనయుడు ఆదిని తెలుగులో అపూర్వవిజయం సాధించిన కార్తికేయ రీమేక్ చిత్రంతో కన్నడ సిని రంగానికి పరిచయం చేస్తున్నట్లు సాయికుమార్ తెలిపారు. -
బాలుడి మృతికి వైద్యులే కారణమంటూ దాడి..
చిక్బల్లాపూర్: కర్ణాటకలో చిక్బల్లాపూర్ జిల్లాలోని బాజేపల్లిలోని ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. చికిత్స పొందుతూ నందీష్(9) అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. చికిత్స చేయడంలో నిర్లక్షంగా వ్యవహరించారంటూ వైద్యులపై బాధితుడి బంధువులు దాడికి దిగారు. ఆస్పత్రిపై బంధువులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.