
టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎంపీ కుమారుడి దౌర్జన్యం
అనంతపురం: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్‌గేట్ వద్ద సిబ్బంది టోల్ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు.
బాగేపల్లి టోల్‌గేట్ వద్ద ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను సిబ్బంది టోల్ ఫీజు అడిగారు. దీంతో ఆగ్రహించిన వారు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటంతో పాటు.. అద్దాలు, కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. స్వయంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ ఈ దాడికి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. ఎంపీలకు మినహాయింపు ఉంటుంది కానీ.. వారి తనయులకు టోల్ ఫీజు విషయంలో మినహాయింపు ఉండదని సిబ్బంది చెప్పడమే కిష్టప్ప వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లుగా తెలుస్తోంది.