ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని సినీ నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు.