బలపరీక్ష నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మైసూర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. అనంతరం యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.