
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు(బాగేపల్లి): మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చూసిన మరో ముగ్గురు యువకులు వారిద్దరిని బెదిరించి ఆ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. వివరాలు.. సోమవారం పదో తరగతి పరీక్ష రాసి స్నేహితునితో కలసి బాలిక గ్రామానికి వస్తోంది. గ్రామ సమీపంలోకి రాగానే బాలికపై ఆ స్నేహితుడు అత్యాచారం చేశాడు. వీరిని వెనుక నుంచి వెంబడిస్తూ వచ్చిన ముగ్గురు యువకులు బాలికను, ఆమె స్నేహితున్ని పట్టుకున్నారు.
మీ తతంగాన్ని వీడియో తీశామని తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. ఈ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఇంతలో స్నేహితుడు పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులను పిలుచుకుని వచ్చాడు. గ్రామస్తులను చూసిన ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. బాగేపల్లి పోలీసులు బాలిక స్నేహితునితో పాటు పరారీలో ఉన్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment