![Man Killed His Wife And Children Then Committed Suicide In Uttar Pradeah - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/28/girl-speaking.jpg.webp?itok=JElBIuYL)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు పిల్లలు, భార్యను చంపి ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గజియాబాద్‌లోని అర్ధాలాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి కాపురంలో అనుమానపు భూతం ప్రవేశించింది. ఈ క్రమంలో భార్య అపరిచితులతో తరచూ ఫోన్లో మాట్లాడుందనే కారణంతో వీరిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి.
ఈ గొడవలు కాస్తా పెరిగి పెద్దవి కావడంతో అసహానానికి లోనైన భర్త.. భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని, భార్య, పిల్లలు నేలమీద విగతా జీవులుగా కనిపించారు. అలాగే ఘటనాస్థలిలో సుసైడ్ నోట్ లభించింది. అందులో భార్య, ఆమె సోదరులపై భర్త ఆరోపణలు చేశారు. ‘భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంది’. అని కూడా రాశాడు. అయితే భార్య, పిల్లల గొంతు కోసి చంపిన తరువాత భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment