Family commits suicide
-
ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు సుహాసిని దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తిక్ బెంగుళూరులో జాబ్ చేస్తుండగా, కూతురు అమృత ఇంటర్ పూర్తి చేసుకొని బిటెక్‌లో సీట్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. వెంకట కృష్ణారావు తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణారావు భార్య సుహసిని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నెల రోజుల క్రితం కడుపు నొప్పికి సంబంధించిన సర్జరీ కూడా చేపించుకున్నారు. కడుపులో ఉన్న గడ్డను తొలిగించిన వైద్యులు టెస్టులకు పంపించారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని హాస్పటల్ నుండి సమాచారం రావటంతో వెంకట కృష్ణారావు తన భార్య, కూతురుని బైక్‌పై తీసుకుని హాస్పటల్‌కు వెళ్లారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్ అని నిర్ధారణ అవటంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో తిరువూరులో ఆత్మహత్య చేసుకునేందుకు కొత్త తాడులు, చిన్న పీటలు(Chairs) కొనుగోలు చేసి వాటన్నింటినీ సంచిలో వేసుకుని ఇంటికి చేరుకున్నారు. బెంగుళూరులో జాబ్ చేస్తున్న కొడుకు కార్తీక్‌ను కూడా నిన్ననే ఇంటికి పిలిపించారు. అయితే రాత్రి సమయంలో కుమారుడిని ఇంటి దగ్గరే ఉంచి కృష్ణారావు తన భార్య సుహసిని, కూతురు అమృతని బైక్ ఎక్కించుకొని గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లోని తమ పొలం పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి తమతో తెచ్చుకున్న సామగ్రితో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. చదవండి: భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్‌లో తల్లీకూతురు ఆత్మహత్య భార్య సుహసినికి క్యాన్సర్ వ్యాధి సొకటంతో మనోవేదనకు గురైన ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విచారణ చేపడతామని సత్తుపల్లి రూరల్ సీఐ హాణుక్ తెలిపారు. ఘటన స్థలాన్ని కల్లూరు ఏసీపీ రామానుజం పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్ లోని మార్చురీకి తరలించారు. గ్రామంలో అన్యోన్యంగా జీవించే వెంకట కృష్ణారావు కుటుంబ సభ్యులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న సమాచారంతో గ్రామస్థులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ సూసైడ్.. పాపం మానసిక క్షోభ ఏపాటిదో చావులోనే!
కుటుంబంతో సహా బలవన్మరణానికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాష్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ గదిలో భార్య, ఇద్దరు పిల్లలకు కేక్‌లో విషం పెట్టి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరణించారని నిర్ధారణ చేసుకున్న తర్వాతే.. మృతదేహాలను బెడ్‌పై పడుకోబెట్టాడు. పిల్లల ముక్కులో నుంచి రక్తం కారకుండా దూది పెట్టాడు. భార్య మృతదేహంపై దుప్పటి కప్పాడు. ఈ స్థితిలో సూర్యప్రకాష్ ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడో అంటూ అక్కడి వారు కంటనీరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో నలుగురు కుటుంబ సభ్యుల బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య గొడవతో తీవ్ర వేధింపులు, దాడులకు గురైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సూర్యప్రకాష్ (37), భార్య అక్షయ (36), కూతురు ప్రత్యూష (13) కొడుకు అద్వైత్ (10) లకు విషమిచ్చి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఐరన్హార్డ్వేర్ షాపు, పెట్రోల్ బంక్ నిర్వహించారు. ఆరేళ్ల క్రితం పెట్రోల్ బంక్‌ను అమ్మేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లో నలుగురు పార్ట్‌నర్స్‌తో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో పార్ట్‌నర్స్‌తో విభేదాలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ప్రత్యర్థులు దాడులు చేశారు. దీంతో పదిహేడు రోజుల క్రితం సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వచ్చి ప్రముఖ హోటల్ లో ఉంటున్నారు. హోటల్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం తలుపులు తట్టగా స్పందించకపోవడంతో నిద్రపోయారని భావించారు. రాత్రి వేళ సిబ్బంది రూమ్‌కు వెళ్లగా గడియ వేసుకుని ఉండటంతో అటువైపు వెళ్లలేదు. ఆదివారం ఉదయం కూడా రూం క్లీనింగ్ కోసం డోర్ తట్టడంతో ఎంతకూ లోపలున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిపించారు. గదిలో లోపల సూర్యప్రకాష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అయన భార్య, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగత జీవులుగా కనిపించారు. సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు ముందుగా కేక్‌లో విషం కలిపి తినిపించి, వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల నుంచి రక్తం కారడంతో పిల్లల ముక్కుల్లో దూది పెట్టాడు. భార్య మృత దేహంపై దుప్పటి కప్పాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్‌పైన పడుకోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నితో ఉరివేసుకున్నాడు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీ నం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో ఏముంది..? బాధిత కుటుంబం రాసిన మరణ వాంగ్మూలంలోని వివరాలు తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ పార్ట్ట్‌నర్స్ బాధితుల ఇంటిపైకి వెళ్లి దాడి చేసినట్లు లేఖలో ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అందులో కిరణ్ కుమార్, వెంకట్ అనే ఇద్దరు మోసం చేశారని, తన చావుకు వారే కారణమని రాసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కనాయం చక్రవర్తి, జెనం చక్రవర్తి పేర్లు కూడా çసూసైడ్ నోట్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన ఆర్థిక నష్టంతో పాటు, భాగస్వాములుగా ఉన్నవారు మోసం చేయడంతోనే సూర్యప్రకాష్ కుటుంబం బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీంతో ఆనవాళ్లు సేకరించారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ వేధించారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సూర్యప్రకాష్ కు టుంబం ఆత్మహత్య చేసుకుంది. వారి వద్ద నుంచి సూసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నాం. పార్ట్నర్స్ వే ధింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నా రు. కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ చేస్తాం. – వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీపీ -
నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ ..ఆ నలుగురిని వదలి పెట్టకండి
-
'మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణం.. వారిని వదలొద్దు'
సాక్షి, విజయవాడ/ నిజామాబాద్: అప్పులు, అధిక వడ్డీలు భరించలేక నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. 'మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణమంటూ.. గణేష్‌కుమార్, వినీత, చంద్రశేఖర్, సాయి రామ మనోహర్ పేర్లను సూసైడ్ లెటర్లో రాశారు. మా కుటుంబం చావుకు కారణమైన ఈ నలుగురిని కఠినంగా శిక్షించాలంటూ లేఖలో పేర్కొన్నారు. చదవండి: (వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..) ఇదిలా ఉండగా, ఘటనపై మృతుడు సురేష్ బావమరిది రాంప్రసాద్ మాట్లాడుతూ.. మా అక్క, బావ, ఇద్దరు కుమారులు సూసైడ్ చేసుకోవడానికి ఆ నలుగురే కారణం. వారి వడ్డీ వేధింపుల వలనే విజయవాడ వచ్చి సూసైడ్ చేసుకున్నారు. ఆ నలుగురు అధిక వడ్డీలు వసూలు చేశారు. డబ్బులు కట్టకపోతే అంతుచూస్తామని బెదిరించారు. సూసైడ్‌నోట్‌లో ఇదే విషయాన్ని రాశారు. వాళ్లు చనిపోయేముందు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మొత్తం సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఆ నలుగురి వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి' అని రాంప్రసాద్ అన్నారు. చదవండి: (రుణాలు తీర్చలేక.. చావే శరణ్యమని..) కాగా, నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్–2లో నివాసం ఉంటున్న పప్పుల సురేశ్ (51), భార్య శ్రీలత (48), కుమారులు అఖిల్ (28), అశిష్ (24) ఈనెల 6న విజయవాడకు వచ్చారు. అఖిల్ పేరుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ బ్రాహ్మణవీధిలోని ఒక ప్రైవేట్ సత్రంలో రూమ్ తీసుకున్నారు. వారంతా శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కాగా, అర్ధరాత్రి దాటాక సురేశ్ కుటుంబ సభ్యులు తమ బంధువులకు.. తాము చనిపోతున్నట్లు వాయిస్ మెసేజ్ పంపించారు. దాంతో శ్రీలత సోదరుడు విజయవాడలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి సత్రం ఫోన్ నంబర్ కనుగొన్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు సత్రానికి ఫోన్ చేసి తమ బంధువులు సత్రంలో బస చేశారని, వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టారని, తక్షణం వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సత్రం గుమాస్తా ఆ గదికి వెళ్లి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్రం అధ్యక్షుడు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీలో తండ్రీ, కొడుకుల మృతదేహాలు కనుగొన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను బట్టి వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం గణేష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. -
జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జీవితం మీద విరక్తి చెంది చెరువులోకి దూకగా, ముగ్గురు మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా దమ్మనట్టె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెదిన సిద్ధమ్మ (55), ఈమె కుమార్తె సుమిత్ర (30), అల్లుడు హనుమంతరాజు (35), వీరి కుమార్తె కీర్తన (11)లు ఆత్మహత్య చేసుకోవాలని గ్రామం సమీపంలోని చెరువులో దూకారు. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ప్రాణాలతో ఉన్న కీర్తనను గ్రామస్తులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికే చెందిన ఒక బాలిక (10)కు విషయం ముందే తెలిసి పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లరికం వచ్చిన హనుమంతరాజు మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడని, దీంతో కుటుంబ కలహాలు పెరిగి ఆత్మహత్య బాటపట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుదూరు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..) -
గుంటూరు జిల్లాలో విషాదం..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను వీరాస్వామిరెడ్డి, రమణ, పోలేరుగా గుర్తించారు. పొలంలో మోటార్లు చోరి చేశారంటూ కేసు పెట్టడంతో అవమానంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. -
భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందని..
లక్నో : భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు పిల్లలు, భార్యను చంపి ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గజియాబాద్‌లోని అర్ధాలాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి కాపురంలో అనుమానపు భూతం ప్రవేశించింది. ఈ క్రమంలో భార్య అపరిచితులతో తరచూ ఫోన్లో మాట్లాడుందనే కారణంతో వీరిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెరిగి పెద్దవి కావడంతో అసహానానికి లోనైన భర్త.. భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని, భార్య, పిల్లలు నేలమీద విగతా జీవులుగా కనిపించారు. అలాగే ఘటనాస్థలిలో సుసైడ్ నోట్ లభించింది. అందులో భార్య, ఆమె సోదరులపై భర్త ఆరోపణలు చేశారు. ‘భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంది’. అని కూడా రాశాడు. అయితే భార్య, పిల్లల గొంతు కోసి చంపిన తరువాత భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
గోదావరిలోకి దూకి కుటుంబం ఆత్మహత్య?
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా చించినాడ వద్ద గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి కూతురుతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన భార్యభర్తలు జడ్డు సూర్యగణేష్(33),పద్మ(28) కూతురు మౌనిక(5)లు 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. గోదావరి వద్ద గణేష్ వాహనం కనుగొన్నారు. గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారి కోసం గోదావరిలో పడవలతో గాలిస్తున్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో... పాపం!
హైదరాబాద్ : భారాభర్తలు... ఒకరి మరణాన్ని ఒకరు తట్టుకోలేకపోయారు. ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు విడిచారు. అమ్మానాన్నలేని ఈ లోకంలో ఉండబోమని కూతురు, కుమారుడు కూడా ఆత్మహత్యకు యత్నించారు. ఈ విషాదకర సంఘటన గురువారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలను కాచిగూడ ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ జె.రవీందర్ వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన పవన్ కర్బంధ(65), నీలం కర్బంధ(55) దంపతులు. వీరి సంతానం నిఖిల్ కర్బంధ(34), మన్ను కర్బంధ(30). ఈ కుటుంబం మూడేళ్ల నుంచి డీడీ కాలనీలో అద్దెకుంటోంది. పవన్ దంపతులు 1972లో నగరానికి వలస వచ్చారు. పవన్ సెవెన్ సీటర్స్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాడు. అది పెద్దగా జీవనోపాధి ఇవ్వకపోవడంతో దానిని మానేసి ట్రూప్‌బజార్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. కుమారుడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కూతురు ఇంట్లోనే ఉంటోంది. కొద్దికాలంగా నీలం కర్బంధ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. రెండు నెలలుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నగరంలోనే ఉంటున్న తన సోదరుడు హరిమోహన్‌కు పవన్ ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. చిరునామా ఎక్కడో చెప్పాలని సోదరుడు అడుగగా తనకు తెలియదని, తాను పనిచేసే దుకాణంలో తెలుసుకోవాలని చెప్పాడు. మరునాడు ఉదయం దుకాణం వద్దకు హరిమోహన్ వెళ్లి అతికష్టం మీద వీరి చిరునామాను తెలుసుకొని డీడీ కాలనీకి వచ్చాడు. తలుపు తట్టినా ఇంట్లో నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఎవరు రాలేదనేమో.... పవన్ కర్బంధ కుటుంబం కొద్దికాలంగా బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉంటోంది. తన భార్య చనిపోయిందని చెప్పినా ఎవరూ రాలేదని పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య మృతి తట్టుకోలేక పవన్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మానాన్న మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన కుమారుడు నిఖిల్, కుమార్తె మన్ను బుధవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలుపుకొని తాగారు. తిరిగి సోదరుడు రావడంతో... బుధవారం మధ్యాహ్నం హరిమోహన్ వచ్చి వీరి ఇంటి తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా పవన్ కర్బంధ, నీలం కర్బంధ మృతి చెంది ఉన్నారు., నిఖిల్, మన్ను కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి వీరిని తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. 48 గంటలు గడిస్తేగానీ వీరి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పవన్ కర్బంధ, నీలం కర్బంధల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడింది ఈ భవనంలోనే.. అద్దె సక్రమంగానే ఇచ్చేవారు... ఇంటి అద్దెను సక్రమంగానే ఇచ్చేవారని పవన్ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని బ్రహ్మచారి తెలిపారు. తన తల్లి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, కాస్త ఫిజియోథెరపీ చేస్తే తిరిగి కోలుకుంటుందని మంగళవారం సాయంత్రం నిఖిల్ తమతో అన్నాడని ఆయన చెప్పారు. -
ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం బలి
బుర్ద్వాన్: 'మీ కూతురు మాకొద్దు. మీ సంబంధం మాకొద్దు. మీ అమ్మాయికి వేరొకరితో సంబంధం ఉందని తెలిసింది. మీ సంబంధాన్ని రద్దు చేసుకుంటున్నాం' అంటూ వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో ఓ కుటుంబం మొత్తం నాశనమైంది. ఆ ఇంట్లోని వారంతా నిర్జీవులుగా మారారు. పెళ్లి ఖరారు అయ్యింది అంటూ అవతలి వారి నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం ఎదురు చూసిన ఓ తండ్రి చివరకు వినకూడని మాటలు విని నిర్ఘాంతపోయాడు. ఆ కోపంలో భార్యను, కూతురుని చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో సుజల్ బరన్ నాగ్(62) అనే వ్యక్తి కూతురు సుదర్శన(23)కి వేరే ఊర్లోని అబ్బాయికి పెళ్లి కుదిరింది. శుక్రవారం ఆ పెళ్లి ఖరారుకు సంబంధించి అబ్బాయి వాళ్ల నుంచి ఫోను రావాల్సి ఉంది. అయితే, ఫోన్ వచ్చింది కానీ, మాట్లాడిన అవతలి వ్యక్తి మాత్రం పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు. కారణం అడిగితే సుజల్ కూతురుకి పరాయి వ్యక్తితో సంబంధం ఉందని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సుజల్ ఈ విషయంలో తన భార్య మణిమాల(52)తో గొడవ పడ్డాడు. అలా రాత్రంత గొడవపడిన అతను అనంతరం భార్యను కూతురుని చంపేసి తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు. భార్య, కూతురుని తానే చంపేసినట్లు ఆత్మహత్యకు ముందు ఓ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన చుట్టుపక్కలవారిని తీవ్రంగా కలిచి వేసింది. -
కుటుంబమంతా మృత్యు ఒడిలోకి..
అనారోగ్యంతో డీఈ సత్యనారాయణ మృతి తట్టుకోలేక భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి ఆత్మహత్య స్వగ్రామం లద్నూరులో ముగిసిన అంత్యక్రియలు తలకొరివి పెట్టిన సత్యనారాయణ తండ్రి ప్రకాశం హన్మకొండ / జనగామ / మద్దూరు : కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టించే విషాదమిది.. కలలో కూడా ఊ హించకుని ఘటనతో ఆ కుటుంబంలోని వృద్ధు లు కుప్పకూలిపోయారు.. ఇదీ మద్దూరు మండలం లద్నూరుకు చెందిన డీఈ సత్యనారాయణ కుటుంబంలో శనివారం చోటు చేసుకున్న పరి స్థితి. లద్నూరుకు చెందిన రిటైర్డ్ ఉపాద్యాయు డు పారుపల్లి ప్రకాశం, మణెమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ(55) గృహ నిర్మా ణ శాఖ డీఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయ న అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెంది నట్లు చెబుతుండగా.. ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి(33), నీలిమ(27), కుమారుడు శివరామకృష్ణ(22) రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తం గా సంచలనం కలిగించింది. గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా చేర్యాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన సత్యనారాయణ ఏఈగా పదోన్నతిపై జనగామలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో వివాహం కాగానే ఉద్యోగరీత్యా జనగామకు మ కాం మార్చి అక్కడే ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత హన్మకొండ ఏఈగా పనిచేస్తూ కరీంనగర్ బదిలీ కాగా, అక్కడ సస్పెన్షన్‌కు గురయ్యా రు. తిరిగి పదేళ్ల అనంతరం డీఈగా ప్రమోషన్‌పై ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌కు బదిలీ అ య్యారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను ఎత్తి వేయడంతో ఆరు రోజుల క్రితం ఇరిగేషన్ శాఖ డీఈగా హైదరాబాద్‌కు సత్యనారాయణను బదిలీ చేశారు. కాగా, వివాహం తర్వాత నుంచి నేటి వరకు ఆయన తన తల్లిదండ్రులు ప్రకాషం, మణెమ్మతో సంబంధాలు అంతంతగానే కొనసాగిస్తున్నాడు. లద్నూరుకు వచ్చిన సందర్భాలే తక్కువేనని చెబుతున్నారు. కాగా సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఒకరు రవి హైదరాబాద్‌లో ట్రావెల్స్ నడుపుతుండగా, మరో సోదరు డు శ్రీనివాస్ జీహెచ్ఎంసీలో ఏఈగా పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం(మార్చి 25న) జరిగి న సత్యనారాయణ తమ్ముడు రవి కుమార్తె పా వని వివాహం లద్నూరులో జరగగా సత్యనారాయణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక ఊరికి వారు రావడం అదే చివరిసారి. అయితే, పావని కంటే పెద్దదైన సత్యనారాయణ కుమార్తె స్వాతి వివాహం జరిపించాలని ఆయన తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా సత్యనారాయణ భార్య మీరా అంగీకరించేది కాదని చెబుతున్నారు. రోజంతా కారులోనే.. ఆదిలాబాద్ నుంచి శుక్రవారం ఉదయం సత్యనారాయణ, ఆయన భార్య మీరా, కూతుళ్లు స్వా తి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. సత్యనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తే అసలు కారు నడిపే పరిస్థితి లేకపోవడంతో.. శివరామకృష్ణ నడిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక హన్మకొం డలోని అద్దె∙గృహంలో మీరా తల్లితో సత్యనారాయణ బీటెక్ పూర్తి చేసిన స్వాతి ఉంటుండ గా, రెండో కుమార్తె ఎంటెక్ చేసిన నీలిమ హైదరాబాద్‌లో, కుమారుడు శివరామకృష్ణ బీటెక్ చ దువుతూ హైదరాబాద్ అద్దె గదిలో ఉంటున్నా డు. ఇక సత్యనారాయణ భార్య మీరా ఆసిఫాబాద్‌లోనే భర్తతో పాటు ఉంటోందని సమాచారం. అమ్మమ్మ వద్ద ఉండే స్వాతి తన తండ్రికి ఆరోగ్యం బాగా లేనందున ఆస్పత్రిలో చూపిం చేందుకు వెళ్తున్నామంటూ శుక్రవారం ఉదయం హన్మకొండ నుంచి వెళ్లింది. తల్లిదండ్రులు, సోదరి, సోదరుడితో ఆమె ఎప్పుడు కలుసుకుందో, ఏమో కానీ కుటుంబం మెుత్తం కారులోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేషనల్ హైవేపై తిరగారు. అనంతరం అనారోగ్యానికి గురైన భర్త సత్యనారాయణను భువనగిరి ప్రభు త్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త చనిపోవడంతో మనస్తాపంతో భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ తిరిగి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని కారులోనే ఉంచి.. అంకుశాపూర్ వద్ద రాత్రి 11.30 గంటలకు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తొలుత సత్యనారాయణ మృతదేహాన్ని, ఆ తర్వాత కుటుంబీకుల మృతదేహాన్ని గుర్తించి ఆ ధార్ కార్డు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఎండకాలంలో ఫోన్ చేశాడు.. తన కొడుకు సత్యనారాయణ చివరి సారిగా ఎం డాకాలంలో ఫోన్ చేసి ఊరికి వస్తానని చెప్పాడ ని ఆయన తండ్రి సత్యనారాయణ కన్నీళ్లతో తె లిపారు. అదే చివరిసారి... మళ్లీ ఆయన గొం తు వినలేదని పేర్కొన్నారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న కొడుకు.. శాశ్వతంగా కనిపించకుండా సెలవు తీసుకున్నాడంటూ రోదించారు. ముగిసిన అంత్యక్రియలు లద్నూరులో శనివారం రాత్రి జరిగిన సత్యనారాయణ కుటుంబం అంత్యక్రియలకు ఆదిలాబాద్ జేసీ సుందర్ అబ్నార్ హాజరయ్యారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం లద్నూరుకు తీసుకొచ్చారు. అయితే, సత్యనారాయణ ఆసిఫాబాద్‌లో డీఈగా పనిచేస్తుండగా, అక్కడి జేసీతో పాటు హౌసింగ్ శాఖ ఉద్యోగులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కుటుంబంలో ఎవరూ మిగలకపోవడంతో సత్యనారాయణ తండ్రి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రకాశం అంత్యక్రియలు నిర్వహించారు. హౌసింగ్ సీఈ ఈశ్వర య్య, ఆదిలాబాద్, కరీంనగర్ పీడీలు కృష్ణ య్య, నర్సింహారావు, హౌజింగ్ ఉద్యోగుల సం ఘం బాధ్యులు అప్పారావు, సూర్యారావు, డీఈలు, పీఈలు, ఏఈలతో పాటు గ్రామ సర్పంచ్ పుట్ట రజితతో పాటు గ్రామస్తులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
-
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఘట్కేసర్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీకి చెందిన సత్యనారాయణ(58) అదిలాబాద్ జిల్లా అసిఫాబాబాద్ హౌసింగ్ బోర్డులో డీఈగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి సత్యనారాయణ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆయన భార్య మీర(51), కూతుళ్లు స్వాతి(33), నీలిమ(28), కొడుకు శివరామకృష్ణ(22) కుటంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కడతేరిపోయేంత కష్టమేమొచ్చిందో?
పూత, పిందెలతో ఉన్న పచ్చని చెట్టు పెనుగాలికి కూకటివేళ్లతో నేలకూలినట్టు- పిల్లాపాపలతో కళకళలాడుతున్న ఓ కుటుంబం మృత్యువు ఒడిలో ఒరిగిపోయింది. నూరేళ్లు కష్టంలో, సుఖంలో తోడుగానీడగా ఉంటానన్న వాడే ఆమెను కడతేర్చాడో లేక ఏ కష్టానికి ఎదురీదలేకో వారిద్దరూ కలిసే కన్నబిడ్డలతో సహా కడతేరిపోవాలని నిర్ణయించుకున్నారో.. ఆ దంపతులు, వారి ఇద్దరి పాపలు.. ఎవరికీ చెప్పకుండా మౌనంగా, అంతుబట్టని మర్మంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. మూడు పదులు నిండకుండానే.. బహుశా.. తమ మరణశాసనం తామే రాసుకున్న ఆ ఇద్దరూ ముద్దుల మూటల్లాంటి తమ ఇద్దరు బిడ్డలను కూడా వెంట తీసుకుపోయారు. సాక్షి, రాజమండ్రి/న్యూస్‌లైన్, కంబాలచెరువు : రాజమండ్రి రిలయన్స్ మార్ట్‌లోని బేకరీలో చెఫ్‌గా పని చేసే రౌతు చిన్నమనాయుడు (28), అతడి భార్య లక్ష్మి (23), కుమార్తెలు తేజ (3), గాయత్రి (ఏడాదిన్నర) శుక్రవారం శేషయ్యమెట్టలోని వారి ఇంట్లో విగతజీవులై కనిపించారు. ఉదయం పదిన్నర సమయంలో పొరుగింటి పిల్లలు చిన్నమనాయుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఎంత తట్టినా ఎవరూ పలకకపోయే సరికి పక్కనే ఉన్న కిటికీ లోంచి తొంగి చూడగా వేలాడుతున్న చిన్నమనాయుడి కాళ్లు కనిపించాయి. పిల్లలు చెప్పిన విషయాన్ని పెద్దలు వెంటనే పోలీసులకు తెలిపారు. డీఎస్పీ నామగిరి బాబ్జి, ట్రైనీ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ రమేష్ ఆ ఇంటికి చేరుకుని వీఆర్వో సమక్షంలో తలుపులు పగులకొట్టారు. తల్లీబిడ్డల మృతదేహాలు నేలపై పడి ఉండగా చిన్నమనాయుడు ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తల్లీబిడ్డల మృతదేహాలనుంచి తీవ్ర దుర్గంధం రావడం, బ్లేడుతో కోసుకున్నట్టు చిన్నమనాయుడి ఎడమచేతి మణికట్టు నుంచి స్రవించిన నెత్తురు గడ్డ కట్టకుండా పల్చగా ఉండడంతో తల్లీబిడ్డలు మృతి చెంది రెండు రోజులవుతుందని, చిన్నమనాయుడు శుక్రవారం ఉదయమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. తల్లీబిడ్డల నోటి నుంచి నురుగు రావడంతో వారి మృతికి విషమేదో కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారమే భార్యాబిడ్డలకు విషమిచ్చిన నాయుడు రెండు రోజుల తర్వాతతొలుత మణికట్టు కోసుకుని, అనంతరం ఉరి వేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే లక్ష్మి మెడ పైన కూడా కమిలినట్టు ఉండడంతో రెండు రోజుల క్రితం ఆమె కూడా ఉరి వేసుకుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆమెను నాయుడు కిందకు దించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఆ ఇంట్లో ఎలాంటి పురుగుమందుల డబ్బా కనిపించకపోవడంతో నాయుడు భార్యాబిడ్డల మరణం తర్వాత ఎక్కడో పారేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కానీ, ఎలాంటి విష పదార్థం కానీ కనిపించలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చి, నాయుడి కుటుంబ నేపథ్యాన్ని క్షుణ్నంగా ఆరా తీస్తే తప్ప పూర్తి వివరాలు చెప్పలేమని డీఎస్పీ బాబ్జీ పేర్కొన్నారు. ఏ బలమైన కారణం బలిగొందో? చిన్నమనాయుడి కుటుంబం విషాదాంతానికి ఆర్థిక ఇబ్బందులే కారణ ం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాయుడికి సొంత ఊరిలో అప్పులు ఉన్నట్టు తెలియడంతో పాటు ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంట్లో పడుకునేందుకు మంచం కూడా లేకపోవడం, వంట సామాన్లు కూడా చాలీచాలనట్టు ఉండడం, పోపుల పెట్టె నిండుకుని ఉండడం, బియ్యం నాలుగైదు కిలోలు మాత్రమే ఉండడాన్ని బట్టి ఆర్థికంగా చిక్కుల్లో ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల శారీరక పరిస్థితి, ముఖ కవళికలను బట్టి రెండురోజుల నుంచి భోజనం చేసి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే చిన్నమనాయుడికి అప్పులేమీ లేనట్టు అతని కుటుంబీకులు చెబుతున్నారు. అలాంటప్పుడు కుటుంబ మంతా ఇలా అంతమైపోవడానికి ఏ బలమైన కారణం ప్రేరేపించి ఉంటుందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతకీ వీరు ఆత్మహత్య చేసుకునేందుకు మరో కారణం ఏమైనా ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఆలుబిడ్డలంటే ఎంతో అపురూపం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలోని లుంబూరుకు చెందిన చిన్నమనాయుడికి, అదే జిల్లా కొండాపురానికి చెందిన లక్ష్మికి 2009లో వివాహమైంది. తండ్రితో విభేదాలు తలెత్తడంతో చిన్నమనాయుడు భార్య, పిల్లలతో హైదరాబాద్ వెళ్లి ఓ బేకరీలో పనికి కుదిరాడు. అక్కడ బేకరీ వంటకాల తయారీలో నైపుణ్యం సంపాదించిన చిన్నమనాయుడు ఏడాదిన్నర కిందట రాజమండ్రి వచ్చి పుష్కరాల రేవు సమీపంలోని రిలయన్స్ మార్ట్ బేకరీలో రూ.12,500 జీతానికి చేరాడు. తండ్రితో పంతం కొద్దీ తన ఇంటి గడప తొక్కని నాయుడు మధ్య మధ్య అత్తగారింటికి మాత్రం వెళ్లి వచ్చేవాడు. నాయుడికి ఉద్యోగం, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేదని, పెళ్లాం, పిల్లలను అపురూపంగా చూసుకునే వాడని సహోద్యోగులు అంటున్నారు. అలాంటి కుటుంబానికి ఎలాంటి కష్టం ఎదురై, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారోనని కంట తడిపెడుతున్నారు. ఇరవై రోజుల క్రితం నాయుడి కుటుంబం అన్నవరం వెళ్లి దైవదర్శనం చేసుకుందని, ఇంతలోనే వారంతా శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చూస్తామనుకోలేదు.. చిన్నమనాయుడు నెమ్మదస్తుడు. స్థానికంగా అప్పులు లేవు. కుటుంబాన్ని రాజమండ్రి తీసుకువచ్చే వరకూ లక్ష్మీవారపుపేటలో కొందరు స్నేహితులం అంతా కలిసి ఉండేవాళ్లం. తర్వాత ఇల్లు మారాడు. డ్యూటీ కచ్చితంగా చేసేవాడు. మంగళవారం సెలవు తీసుకున్న నాయుడు బుధవారం డ్యూటీకి వచ్చాడు. గురువారం రాలేదు. ఇంటి వెళ్లేసరికి తాళం వేసి ఉంది. కానీ ఇప్పుడు ఇలా చూస్తామనుకోలేదు. - శ్రీను, చిన్నమనాయుడి సహోద్యోగి గుట్టుగా ఉండేవారు.. శుక్రవారం ఉదయం ఆరుగంటలప్పుడు నేను డ్యూటీకి బయల్దేరుతుంటే నాయుడు ఇంట్లోకి వెళ్తూ కనిపించాడు. తర్వాత 11 గంటలకు ఇంటికి వచ్చే సరికి కుటుంబం అంతా చనిపోయారన్నారు. ఈ ఘోరాన్ని నమ్మలేకపోతున్నాను. ఎదురుగా ఉంటున్నా వారి పరిస్థితి తెలిసేది కాదు. అంత గుట్టుగా ఉండే ఆ దంపతులకు ఏమి కష్టం వచ్చిందో? - లక్ష్మి, చిన్నమనాయుడి పొరుగింటి వాసి, శేషయ్యమెట్ట ఒకటో తేదీకల్లా అద్దె ఇచ్చే వాడు.. మా ఆయన పనిచేసే చోటే పనిచేస్తున్నాడు కదా అని ఇల్లు అద్దెకు ఇచ్చాం. మేం కొంచెం దూరంలోని వేరే ఇంట్లో ఉంటాం. అద్దె రూ.1700 ఏ నెలకు ఆనెల ఒకటోతేదీకల్లా ఇచ్చేసేవాడు. ఆ దంపతులు బయట వాళ్లతో చాలా రిజర్వుడుగా ఉంటారు. రోజూ పిల్లలకు అన్నీ కొనిపెడతాడు. గొడవలు కూడా లేవు. కానీ ఇలా ఎందుకు చేశారో ఆర్థం కావడంలేదు. - సత్యవతి, చిన్నమనాయుడి ఇంటి యజమానురాలు -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య
జీడిమెట్లలోని షాపూర్ నగర్ సమీపంలోని న్యూ ఎల్.బి.నగర్లో గత అర్థరాత్రి ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారినా ఇంకా తలుపులు తీయకపోవడంతో ఆ ఇంటి పక్కవారు కిటికిలో నుంచి చూడగా దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గమనించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.