కుటుంబంతో సహా బలవన్మరణానికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాష్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ గదిలో భార్య, ఇద్దరు పిల్లలకు కేక్‌లో విషం పెట్టి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరణించారని నిర్ధారణ చేసుకున్న తర్వాతే.. మృతదేహాలను బెడ్‌పై పడుకోబెట్టాడు. పిల్లల ముక్కులో నుంచి రక్తం కారకుండా దూది పెట్టాడు. భార్య మృతదేహంపై దుప్పటి కప్పాడు. ఈ స్థితిలో సూర్యప్రకాష్ ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడో అంటూ అక్కడి వారు కంటనీరు తెచ్చుకున్నారు.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో నలుగురు కుటుంబ సభ్యుల బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్‌నర్ల మధ్య గొడవతో తీవ్ర వేధింపులు, దాడులకు గురైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సూర్యప్రకాష్ (37), భార్య అక్షయ (36), కూతురు ప్రత్యూష (13) కొడుకు అద్వైత్ (10) లకు విషమిచ్చి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఐరన్‌హార్డ్‌వేర్ షాపు, పెట్రోల్ బంక్ నిర్వహించారు.
ఆరేళ్ల క్రితం పెట్రోల్ బంక్‌ను అమ్మేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లో నలుగురు పార్ట్‌నర్స్‌తో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో పార్ట్‌నర్స్‌తో విభేదాలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ప్రత్యర్థులు దాడులు చేశారు. దీంతో పదిహేడు రోజుల క్రితం సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వచ్చి ప్రముఖ హోటల్ లో ఉంటున్నారు. హోటల్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం తలుపులు తట్టగా స్పందించకపోవడంతో నిద్రపోయారని భావించారు. రాత్రి వేళ సిబ్బంది రూమ్‌కు వెళ్లగా గడియ వేసుకుని ఉండటంతో అటువైపు వెళ్లలేదు. ఆదివారం ఉదయం కూడా రూం క్లీనింగ్ కోసం డోర్ తట్టడంతో ఎంతకూ లోపలున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిపించారు. గదిలో లోపల సూర్యప్రకాష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అయన భార్య, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగత జీవులుగా కనిపించారు. సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు ముందుగా కేక్‌లో విషం కలిపి తినిపించి, వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల నుంచి రక్తం కారడంతో పిల్లల ముక్కుల్లో దూది పెట్టాడు. భార్య మృత దేహంపై దుప్పటి కప్పాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్‌పైన పడుకోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నితో ఉరివేసుకున్నాడు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీ నం చేసుకున్నారు.
సూసైడ్ నోట్‌లో ఏముంది..?
బాధిత కుటుంబం రాసిన మరణ వాంగ్మూలంలోని వివరాలు తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ పార్ట్ట్‌నర్స్ బాధితుల ఇంటిపైకి వెళ్లి దాడి చేసినట్లు లేఖలో ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అందులో కిరణ్ కుమార్, వెంకట్ అనే ఇద్దరు మోసం చేశారని, తన చావుకు వారే కారణమని రాసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కనాయం చక్రవర్తి, జెనం చక్రవర్తి పేర్లు కూడా çసూసైడ్ నోట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన ఆర్థిక నష్టంతో పాటు, భాగస్వాములుగా ఉన్నవారు మోసం చేయడంతోనే సూర్యప్రకాష్ కుటుంబం బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీంతో ఆనవాళ్లు సేకరించారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రియల్ ఎస్టేట్ పార్ట్‌నర్స్ వేధించారు
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సూర్యప్రకాష్ కు టుంబం ఆత్మహత్య చేసుకుంది. వారి వద్ద నుంచి సూసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నాం. పార్ట్‌నర్స్ వే ధింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నా రు. కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ చేస్తాం.
– వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment