![Five Students attack on Other Students - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/21/645.jpg.webp?itok=lqmSN9hz)
నిజామాబాద్: గంజాయి సేవించాలని ఒత్తిడి చేయగా.. అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థిపై మరో ఐదుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన మాక్లూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన విరామంలో స్కూల్‌కు కొద్దిదూరం వెళ్లి గంజాయి సేవిస్తున్నారు.
గత శనివారం వారి తరగతిలోని మరో విద్యార్థిని సైతం గంజాయి సేవించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, సదరు విద్యార్థి అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఆ విద్యార్థి తనపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తల్లికి చెప్పాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో బాధిత విద్యార్థి తల్లి మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. సోమవారం తిరిగి బాధిత విద్యార్థి పాఠశాలకు వెళ్లగా తల్లిదండ్రులకు చెబు తావా అంటూ ఐదుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లి చితకబాదారు.
దీంతో సదరు విద్యార్థికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి బుధవారం మాక్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్సై సుధీర్‌రావును సంప్రదించగా విచారణ చేపట్టి చర్య లు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే కేసు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment