
ఆశీష్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తన నిద్ర భంగం చేశారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి విద్యార్థులను స్కేలుతో చితకబాదాడు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేష్ రేణుకల కుమారుడు ఆశీష్‌కుమార్ మడ్‌ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో రవికుమార్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రిస్తున్నాడు.
విరామం అనంతరం విద్యార్థులు తరగతి గదికి రాగా శబ్ధం రావడంతో నిద్ర భంగమైందని కోపోద్రిక్తుడైన రవికుమార్ స్కేల్‌తో పలువురు విద్యార్థులతో పాటు తన టేబుల్ దగ్గర ఉన్న ఆశీష్‌కుమార్ పిక్కలు, మోకాలి కింది భాగంలో కొట్టాడు. ఈ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు.
శుక్రవారం స్నానం చేయించే సమయంలో తల్లి నల్లగా కమిలినట్లు ఉండటం గమనించి ఆరా తీయగా ఉపాధ్యాయుడు కొట్టినట్లు తెలిపాడు. పాఠశాలకు వెళ్లి నిలదీయగా తాను కొట్టలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మిగతా విద్యార్థులు సైతం తమని కూడా కొట్టాడని చెప్పడంతో శుక్రవారం కార్ఖాన పీఎస్‌లో రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment