క్షమాపణ చెప్పిన మోడీ! | My chopper was deliberately delayed: Narendra Modi | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన మోడీ!

Published Tue, Apr 1 2014 6:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

క్షమాపణ చెప్పిన మోడీ! - Sakshi

క్షమాపణ చెప్పిన మోడీ!

బరిల్లీ: ఉద్దేశ పూర్వకంగానే తన హెలికాప్టర్ ఆపివేశారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. బరిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గోనేందుకు వెళ్లాల్సిన తనను ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావాలనే ఆలస్యం చేశారని మోడీ అన్నారు. ర్యాలీలో రావడానికి ఆలస్యమైనందుకు మోడీ క్షమాపణలు చెప్పి ప్రసంగం ఆరంభించారు. రెండు గంటలపాటు హెలికాఫ్టర్ కు అనుమతి ఇవ్వకుండా ఏటీసీ సిబ్బంది ఆపివేశారని మోడీ అన్నారు. 
 
ప్రతి ఒక్కరికి రాయ్ బరేలి మాత్రమే తెలుసునని.. గాలి పటాలకు ఉపయోగించే 'మాంజా'ను తయారు చేసే ఉత్తత్పిదారులు దేశంలో ఇక్కడే ఎక్కువ అని చాలామందికి తెలియదు అని అన్నారు. బాలీవుడ్ లో ఎక్కువ పాటలు ఈ ప్రదేశంపై రాశారని మోడీ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement