
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్వస్థలమైన బరేలీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. బరేలీలో నివసించడం లేదని ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా పేర్లను ఓటర్ లిస్టు నుంచి బుధవారం తొలగించారు. ప్రియాంక మిస్ వరల్డ్‌గా ఎంపికైనప్పుడే వారి కుటుంబం బరేలీ నుంచి ముంబైకి వలస వెళ్లిందని, సుమారు 17 ఏళ్ల నుంచి వారి ఇంటికి తాళం వేసుండటంతోనే ఓటర్ లిస్టు నుంచి తొలిగించామని జిల్లా మెజీస్ట్రిక్ అధికారి కెప్టెన్ ఆర్ విక్రమ్ సింగ్ మీడియాకు తెలిపారు.
బరేలీ 50వ వార్డులో వీరికి ఓటు హక్కు ఉందని, ఇక్కడ నివసించడం లేదని ఓ స్థానిక నివాసి బ్లాక్ లెవల్ ఆఫిసర్‌కు ఫిర్యాదు చేశారని డీఎం చెప్పారు. బీఎల్‌ఓ ఆఫీసర్ ఆదేశాలతోనే వారి పేర్లు తొలిగించామన్నారు. ఇక ప్రియాంక తండ్రి కల్నల్ అశోక్ చోప్రా 2012లోనే బరేలీలో నివసించడం లేదనే విషయాన్ని జిల్లా అధికారులు తెలియజేశాడని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే ప్రియాంక ఫ్యామిలీకి ముంబైలో ఓటు హక్కు ఉందో లేదో అనే విషయం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment